Kurnool

News March 31, 2025

కర్నూలు: రూ.71.47 కోట్ల పన్నులు వసూలు

image

నగరాభివృద్ధికి పన్నులు చెల్లించి సహకరించాలనే కర్నూలు నగరపాలక సంస్థ పిలుపునిచ్చింది. స్పందించిన బకాయిదారులు అత్యధిక సంఖ్యలో పన్నులు చెల్లించినందుకు నగరపాలక మేనేజర్ చిన్నరాముడు, ఆర్వో ఇశ్రాయేలు కృతజ్ఞతలు తెలిపారు. సోమవారం వారు కేఎంసీ కార్యాలయంలోని పన్ను వసూలు కేంద్రాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గతంలో ఎప్పుడూ లేనంతగా రూ.71.47 కోట్లు పన్ను రూపంలో వసూలు అయినట్లు తెలిపారు.

News March 31, 2025

కర్నూలు: 12వ రోజుకు చేరిన మున్సిపల్ చైర్ పర్సన్ దీక్ష

image

నాలుగేళ్ల పాలనలో ఎలాంటి తప్పు చేయలేదని, సొంత పార్టీ ఐనా వైసీపీ కౌన్సిలర్లు తనను ఛైర్మన్‌ పదవి నుంచి తొలగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని నిరసిస్తూ ఆదోని మున్సిపల్ చైర్ పర్సన్ శాంత దీక్ష చేపట్టారు. ఈ దీక్ష సోమవారం 12వ రోజుకు చేరుకుంది. ఉగాది, రంజాన్ పండగలు ఉన్నప్పటికీ ఈనెల 20 నుంచి దీక్ష నిరంతరంగా కొనసాగిస్తున్నారన్నారు. మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తనకు న్యాయం చేయాలని శాంత కోరారు.

News March 31, 2025

ఆదోనిలో సచివాలయ ఉద్యోగి సూసైడ్

image

ఆదోని మండలం కపటి గ్రామ సచివాలయ ఉద్యోగి మధు సూసైడ్ చేసుకున్నాడు. శ్రీనివాసనగర్ కాలనీకి చెందిన మధు (26) కపటిలో డిజిటల్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్నారు. శనివారం సాయంత్రం డ్యూటీ నుంచి వచ్చి భోజనం చేసి మేడపై గదిలో పడుకున్నాడు. ఆదివాదం ఉదయం తల్లిదండ్రులు చూడగా .. అప్పటికే ఉరివేసుకుని చనిపోయాడు. తండ్రి నారాయణరావు ఫిర్యాదుతో త్రీ టౌన్ సీఐ రామలింగయ్య కేసు నమోదు చేశామన్నారు.

News March 31, 2025

కర్నూలు జిల్లా నేటి ముఖ్యాంశాలు

image

➤ఒకే కుటుంబంలో ఐదు ప్రభుత్వ ఉద్యోగాలు ➤ శ్రీశైలం ఘాట్ రోడ్డులో ప్రమాదం.. ఇద్దరు మృతి➤ ఉమ్మడి కర్నూలు జిల్లాలో సీఐల బదిలీ ➤ బ్రెయిలీ భగవద్గీత రూపకర్తకు ఉగాది పురస్కారం➤ కర్నూలులో ఉగాది ఉత్సవాల్లో మంత్రి, జిల్లా కలెక్టర్ ➤ నేర ప్రవృత్తికి స్వస్తి చెప్పండి: జిల్లా ఎస్పీ➤ RU డిగ్రీ సెమిస్టర్ ఫలితాలు విడుదల➤ రాఘవేంద్ర స్వామి మఠంలో పంచాంగ శ్రవణం

News March 30, 2025

ఆర్యు డిగ్రీ సెమిస్టర్ ఫలితాలు విడుదల

image

రాయలసీమ యూనివర్సిటీ 1,3,5 సెమిస్టర్ డిగ్రీ ఫలితాలను ఆదివారం యూనివర్సిటీ ఇన్‌ఛార్జి ఉపకులపతి ఉమా ఆదేశాల మేరకు విడుదల చేశారు. 1వ సెమిస్టర్‌లో 7,643 మంది పరీక్ష రాయగా 3,827 మంది ఉత్తీర్ణత సాధించారు, 3వ సెమిస్టర్‌లో 6,169 మంది పరీక్ష రాయగా 3,134 ఉత్తీర్ణత సాధించారు. 5వ సెమిస్టర్ 5,709 మంది పరీక్ష రాయగా 4,097 మంది ఉత్తీర్ణత సాధించారు. వీటితోపాటు సప్లమెంటరీ పరీక్షల ఫలితాలు కూడా విడుదల చేశారు.

News March 30, 2025

నేర ప్రవృత్తికి స్వస్తి చెప్పండి: జిల్లా ఎస్పీ

image

జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు ఆదివారం కర్నూలు జిల్లా వ్యాప్తంగా రౌడీ షీటర్లకు పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించారు. సత్ప్రవర్తనతో జీవించాలని, నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొంటే తప్పనిసరిగా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని పోలీసు అధికారులు హెచ్చరించారు.

News March 30, 2025

కర్నూలు జిల్లాలో చికెన్ ధర రూ.200

image

కర్నూలు జిల్లాలో పలు చోట్ల చికెన్ ధర రూ.200 నుంచి రూ.220 వరకు పలుకుతోంది. కర్నూలు, ఆదోని, ఎమ్మిగనూరు, పత్తికొండ, తదితర ప్రాంతాల్లో లైవ్ కోడి కిలో రూ.120 ఉండగా.. స్కిన్‌ రూ.180, స్కిన్ లెస్ రూ.200 చొప్పున విక్రయిస్తున్నారు. 2 నెలల క్రితం రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ కలకలం నేపథ్యంలో చికెన్ అమ్మకాలు తగ్గి, మటన్, చేపల విక్రయాలు పెరిగాయి. దీంతో కిలో మటన్ రూ.900, చేపలు రూ.300 చొప్పున అమ్ముతున్నారు.

News March 30, 2025

కర్నూలు జిల్లా ప్రజలకు ఎస్పీ విజ్ఞప్తి

image

మార్చి 31న రంజాన్ పండుగ ను పురస్కరించుకొని సోమవారం పోలీస్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రిసల్ సిస్టం) కార్యక్రమంను రద్దు చేస్తున్నట్లు ఎస్పీ విక్రాంత్ పాటిల్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు సుదూర ప్రాంతాల నుంచి వ్యయప్రయాసలతో పీజీఆర్ఎస్ కార్యక్రమానికి రావద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

News March 30, 2025

ఒకే కుటుంబంలో ఐదు ప్రభుత్వ ఉద్యోగాలు

image

క్రిష్ణగిరి మండల పరిధిలోని పెనుమాడలో ఇటీవల విడుదలైన ప్రభుత్వ ఉద్యోగాలలో ఒకే కుటుంబంలో 5 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించినట్లు గ్రామస్థులు తెలిపారు. ఇందులో ఇద్దరు అసిస్టెంట్ లోకో పైలట్, ఇద్దరు జిల్లా కోర్టులో ప్రాసెస్ సర్వర్, ఒకరు ఏపీ హైకోర్టులో సబర్డినేట్ ఉద్యోగాలు సాధించడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. మారుమూల గ్రామంలో ఉద్యోగాలు రావడంతో ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచారని చెప్పారు.

News March 30, 2025

పీజీఆర్ఎస్ కార్యక్రమం రద్దు: కలెక్టర్

image

ఈనెల 31న రంజాన్ పండుగను పురస్కరించుకొని సోమవారం కర్నూలు కలెక్టరేట్లో నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రిసల్ సిస్టం) కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు లెక్టర్ పీ.రంజిత్ బాషా ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి, వ్యయ ప్రయాసలతో జిల్లా కేంద్రానికి రావొద్దని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.