Kurnool

News November 29, 2024

కర్నూలు: ‘సెమిస్టర్ పరీక్షలను పక్కగా నిర్వహించాలి’

image

పరీక్షలను సరిగ్గా నిర్వహించాలని ఇన్‌ఛార్జి వైస్ ఛాన్స్‌లర్ ఎన్టీకే నాయక్ అన్నారు. శుక్రవారం రాయలసీమ వర్సిటీ పరిధిలో డిగ్రీ 3వ, 5వ సెమిస్టర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి కర్నూలు జిల్లాలో 61 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. కర్నూలులో పరీక్ష కేంద్రాలను ఆయన పరిశీలించారు. 6,531 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా, 5,848 మంది హాజరయ్యారు. 683 గైర్హాజరయ్యారు.

News November 29, 2024

గర్భిణులు, బాలింతలపై ప్రత్యేక దృష్టి సారించండి: కలెక్టర్

image

పుట్టిన వెంటనే నవజాత శిశువులు మృత్యువాత పడకుండా నిరంతరాయంగా పాలఫ్ చేస్తూ పిల్లలను సంరక్షించే బాధ్యత వైద్య, స్త్రీ శిశు సంక్షేమ శాఖ సిబ్బంది తీసుకోవాలని కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాలులో మేటర్నిటీ అండ్ చైల్డ్ సమావేశం నిర్వహించారు. గర్భిణులు, బాలింతలపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ ఆదేశించారు.

News November 29, 2024

ఇస్తేమాకు రూ.10 కోట్ల నిధులు కేటాయించాం: మంత్రి ఫరూక్

image

ఆత్మకూరులో జనవరి 7, 8, 9వ తేదీల్లో జరగబోయే ఉమామి తబ్లిగే ఇస్తేమాను జయప్రదం చేయాలని మంత్రి ఫరూక్ కోరారు. ఉత్సవ ఏర్పాట్లను శుక్రవారం పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. గతంలో తాను మంత్రిగా ఉన్నప్పుడు కర్నూలు నన్నూరు టోల్ ప్లాజా దగ్గర ఇస్తామాను ఏర్పాటు చేశామన్నారు. అప్పుడు సీఎంగా ఉన్న చంద్రబాబు ఇస్తామాకు రూ.10 కోట్లు నిధులు కేటాయించారని తెలిపారు.

News November 29, 2024

నంద్యాల: భర్తను చంపిన కేసులో భార్య మరో ఇద్దరి అరెస్ట్

image

నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం పెట్నికోట గ్రామంలో భర్తను చంపిన కేసులో భార్య రమాదేవి, ఆమె ప్రియుడు వేణుగోపాల్, సహకరించిన వడ్డే నారాయణస్వామిని శుక్రవారం అరెస్టు చేసినట్లు ఆళ్లగడ్డ డీఎస్పీ రవికుమార్ తెలిపారు. మృతుడు రమేశ్ భార్య రమాదేవి వేణుగోపాల్‌తో అక్రమ సంబంధం పెట్టుకుందని పేర్కొన్నారు. భర్తను అడ్డు తొలగించుకునేందుకు ఈ నెల 26న నిద్రపోతున్న రమేశ్ ముఖంపై దిండు పెట్టి అదిమి హత్య చేశారని వివరించారు.

News November 29, 2024

పురిటి నొప్పులతో మహిళ.. ఆదోనిలో బైక్‌పై ప్రసవం

image

నిండు గర్భిణి బైక్‌పైనే ప్రసవించిన ఘటన ఆదోనిలో జరిగింది. క్రాంతినగర్‌కు చెందిన మహిళ లలితకు నిన్న పురిటి నొప్పులు రాగా ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు కుటుంబ సభ్యులు సిద్ధమయ్యారు. సమయానికి ఆటోలు లేకపోవడంతో బైక్‌పైనే ఆమెను ఎక్కించుకుని బయలుదేరారు. కొంత దూరం వెళ్లగానే నొప్పులు ఎక్కువై బిడ్డ తల బయటకి వచ్చింది. వెంటనే సమీపంలోని జనరల్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు నార్మల్ డెలివరీ చేయగా కవలలు జన్మించారు.

News November 29, 2024

అంజలి శర్వాణీని రిటైన్ చేసుకున్న యూపీ వారియర్స్

image

ఉమెన్స్‌ ప్రీమియర్‌ లీగ్‌ (WPL)లో టీమ్ఇండియా క్రికెటర్ అంజలి శర్వాణీని యూపీ వారియర్స్ రిటైన్ చేసుకుంది. కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన ఆమెను గతేడాది వేలంలో ఆ జట్టు రూ.55లక్షలకు కొనుగోలు చేసింది. వచ్చే సీజన్ కోసం డిసెంబర్ 15న మినీ వేలం జరగనుండగా ఆయా ఫ్రాంజైజీలు పలువురు ప్లేయర్లను వదులుకున్నాయి. కాగా 2012లో క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన అంజలి తన అద్భుతమైన బౌలింగ్‌తో ఆకట్టుకుంటున్నారు.

News November 29, 2024

ట్రాక్టర్ బోల్తా.. ఒకరు మృతి, ఇద్దరికి తీవ్ర గాయాలు

image

కర్నూలు జిల్లా వెల్దుర్తి సమీపంలోని నక్కల మిట్ట వద్ద ట్రాక్టర్ టైర్ పేలి బోల్తాపడటంతో మల్లికార్జున(25) మృతి చెందగా.. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ట్రాక్టర్ డ్రైవర్ రామాంజనేయలు వివరాల ప్రకారం.. ఓర్వకల్ నుంచి వెల్దుర్తికి రాళ్ల లోడ్‌తో వస్తుండగా ఇవాళ తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. క్షతగాత్రులు నాగేశ్వరావు, కృష్ణలను స్థానికులు హుటాహుటిగా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

News November 29, 2024

నంద్యాలలో ఎఫ్ఎం రేడియో స్టేషన్ ఏర్పాటు

image

నంద్యాలలో ఎఫ్ఎం రేడియో స్టేషన్ నిర్మించనున్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. దేశవ్యాప్తంగా మొత్తం 48 చోట్ల ఎఫ్ఎం రేడియో స్టేషన్లను నిర్మించేందుకు ప్రాంతాలను గుర్తించారు. అందులో భాగంగా ఏపీలో నంద్యాల, చింతపల్లి, విజయనగరం ప్రాంతాలను గుర్తించారు. నంద్యాలలో ఎక్కడ ఏర్పాటయ్యేది త్వరలోనే తెలియనుంది.

News November 29, 2024

బాధితులకు న్యాయం చేయాలి: ఎస్పీ

image

ప్రాపర్టీ కేసులు, సైబర్ నేరాల కేసులలో బాధితులకు న్యాయం చేయాలని కర్నూలు ఎస్పీ బిందు మాధవ్ అన్నారు. గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలతో నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. కర్నూలు, పత్తికొండ, ఆదోని, ఎమ్మిగనూరు సబ్ డివిజన్‌లో దీర్ఘకాలంగా ఉన్న పెండింగ్‌ కేసుల గురించి ఆరా తీశారు. పోలీసుస్టేషన్ల వారీగా కేసుల పెండింగ్‌కు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.

News November 29, 2024

సీసీ రోడ్ల నిర్మాణ పనులు వేగవంతం చేయండి: కలెక్టర్

image

జిల్లాలో ప్రారంభించిన సీసీ రోడ్ల నిర్మాణ పనుల పూర్తికి 4 వారాలు మాత్రమే సమయం ఉందని, నాణ్యత ప్రమాణాలు పాటించి మండలాల వారీగా కేటాయించిన లక్ష్యాన్ని పూర్తి చేయాలని కలెక్టర్ రాజకుమారి పంచాయతీరాజ్ ఇంజినీర్లను ఆదేశించారు. నంద్యాల కలెక్టరేట్లో ఆమె మాట్లాడారు. 1,026 సీసీ రోడ్ల నిర్మాణానికి గాను 255 రోడ్లు పూర్తి అయ్యాయని, మిగిలిన 771 సీసీ రోడ్ల లక్ష్యాన్ని పూర్తి చేయాలని ఆదేశించారు.