India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కర్నూలు జిల్లా బార్ అసోసియేషన్ ఎన్నికలు గురువారం జరగనున్నట్లు ఎన్నికల అధికారి సీనియర్ న్యాయవాది సీ.ప్రభాకర్ రెడ్డి తెలిపారు. జిల్లా బార్ అసోసియేషన్ కార్యాలయంలో ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అధ్యక్షుడి రేసులో హరినాథ్ చౌదరి, మురళీ మోహన్, సంపత్ కుమారి, జనరల్ సెక్రటరీ రెసులో ఆంజనేయులు, కృష్ణమూర్తి, వెంకటేశ్వర్లు, జాయింట్ సెక్రటరీ రేసులో బాల సుబ్రహ్మణ్యం, నాగరాజు ఉన్నారని తెలిపారు.
కర్నూలు జిల్లా ఫ్యాప్టో ఛైర్మన్‌గా (ఆప్టా) సేవలాల్ నాయక్ బుధవారం ఎస్టీయూ భవన్‌లో జిల్లా జరిగిన ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికలకు రాష్ట్ర పరిశీలకుడిగా రాష్ట్ర ప్యాప్తో కో ఛైర్మన్ కాకి ప్రకాష్ రావు హాజరై నూతన కమిటీని అధికారికంగా ప్రకటించారు. సెక్రటరీ జనరల్‌గా జీ.భాస్కర్(బీటీఏ), కో ఛైర్మన్లుగా నారాయణ(HMA), వెంకట రాముడు(డీటీఎఫ్) నుంచి మరికొందరు సభ్యులుగా ఉన్నారు.
కర్నూలు జిల్లాలోని గిరిజన నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి శిక్షణ తరగతులను ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని టీఎస్ఎఫ్ ఆధ్వర్యంలో సెట్కూరు సీఈవో వేణుగోపాల్‌ను కలిసి వినతపత్రం అందచేశారు. టీఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రప్ప మాట్లాడుతూ.. జిల్లాలో ఎంతోమంది గిరిజన నిరుద్యోగ యువత ఉపాధి లేక జీవనాన్ని కొనసాగిస్తున్నారని అన్నారు. అలాంటి వారిని ప్రభుత్వం గుర్తించి ప్రత్యేక శిక్షణను సెట్కూరు ద్వారా అందించాలని కోరారు.
ఆదోని అడ్వకేట్ బార్ అసోసియేషన్ ఎలక్షన్‌కు రంగం సిద్ధం చేశారు. ఎలక్షన్ ఆఫీసర్స్‌గా విజయ భాస్కర్ రెడ్డి, సోమశేఖర్, హనుమేశ్‌ను ఎన్నుకున్నారు. న్యాయవాదుల మధ్య రెండు ప్యానల్స్ నుంచి నామినేషన్ వేశారని, ప్రెసిడెంట్‌గా శ్రీరాములు, మధుసూదన్ రెడ్డి మధ్య.. వైస్ ప్రెసిడెంట్‌గా జే.వెంకటేశ్వర్లు, లోకేశ్ కుమార్ మధ్య పోటీ ఉండగా.. మరి కొంతమంది నామినేషన్ దాఖలు చేశారని ఎలక్షన్ ఆఫీసర్లు తెలిపారు.
ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియపై వైసీపీ మరోసారి సంచలన ఆరోపణ చేసింది. ‘నిన్న మొన్నటివరకు చికెన్ షాప్‌ల మీద పడి దండుకున్న ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఇప్పుడు పొగాకు గోదాములను కూడా వదలడం లేదు. అడుగుకు ‘రూపాయి పావలా’ చొప్పున తనకు రౌడీ మాములు ఇస్తే తప్ప అక్కడ పొగాకు నిల్వ చేయనివ్వమని హెచ్చరించారు. ఎమ్మెల్యే దిగజారుడుతనం చూసి వ్యాపారులు భీతిల్లుతున్నారు’ అంటూ ట్వీట్ చేసింది.
శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో వేలాది మంది కన్నడిగులు పాదయాత్రతో శ్రీశైలం చేరుకుంటున్నారు. వందల కిలోమీటర్ల నుంచి వస్తూ ఆత్మకూరు సమీపంలో కాళ్లకు కర్రలు కట్టుకొని దట్టమైన నల్లమల అడవులలో సాహస యాత్రను చేపడుతున్నారు. వారి పాదయాత్రను చూసి స్థానిక ప్రజలు కన్నడిగుల భక్తికి ఇదే నిదర్శనమని పేర్కొంటున్నారు. కాగా ఈ నెల 31 వరకు ఉగాది మహోత్సవాలు జరగనున్నాయి.
ఆదోనికి చెందిన 21ఏళ్ల యువకుడు ఉదయ్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. స్థానికుల వివరాల మేరకు.. కార్వన్‌పేటలో నివాసం ఉంటున్న యువకుడు బేల్దారిగా పనిచేస్తున్నారు. తన సంపాదనతో కుటుంబానికి అండగా నిలుస్తున్నారు. ఈక్రమంలో నిన్న ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కడుపు నొప్పి తాళలేక ఆత్మహత్య చేసుకున్నట్లు మృతుడి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పత్తికొండకు చెందిన కేపీఆర్ మైత్రి ఛారిటబుల్ ట్రస్టు వ్యవస్థాపక అధ్యక్షుడు రామ్మోహన్ ఉత్తమ సేవా పురస్కారాన్ని అందుకున్నారు. తన సంస్థ ద్వారా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తూ విద్యార్థులు, నిరుపేదల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారు. పాండిచ్చేరిలో జరిగిన ఇంటర్నేషనల్ పీస్ కౌన్సిల్ అచీవర్స్ అవార్డు-2025 ప్రధానోత్సవంలో డాక్టర్ ఆఫ్ సోషల్ సర్వీస్ అవార్డును అందుకున్నారు.
➤ కోడుమూరు ఘటన.. విద్యార్థిపై కేసు
➤ బెట్టింగ్ జోలికెళ్లొద్దు: కర్నూలు ఎస్పీ
➤ నవోదయ ఫలితాల్లో ఆస్పరిలో బార్బర్ కొడుకు ప్రతిభ
➤ ఆలూరు: వంట గ్యాస్ సిలిండర్ పేలి గాయపడ్డ వ్యక్తి మృతి
➤ శ్రీశైలం మల్లన్న దర్శనానికి 5 గంటల సమయం
➤ సీఎం సమావేశంలో జిల్లా కలెక్టర్
➤ నందవరంలో వినతులు స్వీకరించిన సబ్ కలెక్టర్
➤ ఎమ్మిగనూరులో 27న జాబ్ మేళా
➤కోసిగిలో గూడ్స్ రైలు ఢీకొని వ్యక్తి మృతి
ఐపీఎల్ వేళ యువత బెట్టింగ్‌కు దూరంగా ఉండాలని కర్నూలు SP విక్రాంత్ పాటిల్ సూచించారు. ‘తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభమనే మాయలో పడకండి. అమాయక ప్రజలను మోసగించేందుకు ముఠాలు యాక్టివ్‌గా పనిచేస్తున్నాయి. చట్టవిరుద్ధమైన బెట్టింగ్‌తో కొందరు మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. జిల్లాలో ఎవరైనా బెట్టింగ్‌లకు పాల్పడితే 100/112కు సమాచారం ఇవ్వండి. వారి వివరాలు గోప్యంగా ఉంచుతాం’ అని ఎస్పీ తెలిపారు.
Sorry, no posts matched your criteria.