India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

నంద్యాల సమీపంలోని పొన్నాపురం వద్ద రైలు పట్టాలపై బీటెక్ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న రైల్వే పోలీసులు శనివారం మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతుడు బేతంచెర్లకు చెందిన విజయ్ కుమార్(27)గా గుర్తించారు. కర్నూలులోని KV సుబ్బారెడ్డి కళాశాలలో ఇంజినీరింగ్ చదువుతున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు.

కర్నూలు జిల్లాలో రహదారి ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని డీఐజీ కోయ ప్రవీణ్, ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ట్రాఫిక్ నిబంధనలపై పోలీసులు అవగాహన కల్పించారు. జనవరి 1 నుంచి ఫిబ్రవరి 21వ తేదీ వరకు 810 ఓవర్ స్పీడ్, 642 హెల్మెట్ లేని కేసులు నమోదయ్యాయని ఎస్పీ తెలిపారు. 270 సెల్ ఫోన్ డ్రైవింగ్, 1,187 డ్రంక్ అండ్ డ్రైవింగ్, 2,137 ఓపెన్ డ్రింకింగ్ కేసులు నమోదయ్యాయన్నారు.

గూడూరు నగర పంచాయతీ పరిధిలోని ఎస్ఎస్వీ కళాశాల వెనుక భాగంలో ఉన్న ఒక కాలనీలో మున్సిపాలిటీ ఏర్పాటు చేసిన నీటి తొట్టిలో పడి చిన్నారి మృతిచెందింది. బోయరేవుల శ్రీదేవి-గోపాల్ దంపతుల కుమార్తె విజయలక్ష్మి(5) ఆడుకుంటూ నీటి తొట్టిలో పడింది. తల్లిదండ్రులు బతుకుదెరువు కోసం వలస వెళ్లగా చిన్నారి అవ్వతాతల వద్ద ఉంటోంది. ఈ క్రమంలో శనివారం ఆడుకోవడానికి వెళ్లిన చిన్నారి నీటి తొట్టిలో పడి మరణించింది.

కర్నూలు జిల్లాలో ఫిబ్రవరి 23 నుంచి మార్చి 24 వరకు ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పరీక్షా కేంద్రాల సమీపంలోని జిరాక్స్, ఇంటర్నెట్ సెంటర్లను మూసివేయాలని ఉప కార్మిక కమిషనర్ వెంకటేశ్వర్లు ఆదేశించారు. బోర్డు నిబంధనల ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించి కేంద్రాలను తెరిచి ఉంచితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

తిరుమల అంశంపై మాజీ సీఎం జగన్ భక్తులకు క్షమాపణ చెప్పాలని మంత్రి TG భరత్ డిమాండ్ చేశారు. శనివారం కర్నూలులోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో కుడా ఛైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లుతో కలిసి పూజలు, మహా సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించారు. నెయ్యి కల్తీ వాస్తవమని, వైసీపీ నేతలు కౌన్సిల్‌లో చెప్పులు వేసుకుని స్వామి ఫొటోలు ప్రదర్శించడం బాధాకరమన్నారు. నిజాలు కప్పిపుచ్చేందుకే జగన్ అడ్డంగా వాదిస్తున్నారని విమర్శించారు.

కర్నూలు కలెక్టరేట్ ఆవరణలో ‘స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర’ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి ప్రతిజ్ఞతో ప్రారంభించారు. ‘జీరో లిటర్ గవర్నెన్స్’ థీమ్‌తో చేపట్టిన ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. ప్రజల భాగస్వామ్యంతోనే పరిశుభ్రత సాధ్యమని చెప్పారు. ప్రతి ఒక్కరూ ‘జీరో-వేస్ట్’ జీవనశైలి అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. అధికారులు, సిబ్బంది స్వచ్ఛత దిశగా అడుగులు వేయాలని ఆమె కోరారు.

కర్నూలు కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం అమలుకు సంబంధించి జిల్లా విజిలెన్స్ & మానిటరింగ్ కమిటీ సమావేశం జేసీ నూరుల్ ఖమర్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం పకడ్బందీగా అమలు చేయాలన్నారు. బాధిత కుటుంబాలకు ఉపాధి, ఇంటి స్థలం, అర్హత కలిగిన ఇతర ప్రయోజనాలను త్వరితగతిన మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు.

కర్నూలు(D) గోనెగండ్ల మండలం ఐరన్ బండకు చెందిన టీడీపీ కార్యకర్త, ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ బోయ నీలకంఠ(30) నిన్న రాత్రి అనారోగ్యంతో మృతి చెందారు. ఈయనకు ఇటీవలే నిశ్చితార్థం అయింది. మార్చి 5, 6వ తేదీలలో వివాహం జరగాల్సి ఉండగా ఈ ఘటనతో ఇరు కుటుంబాలు కన్నీరు మున్నీరయ్యాయి. నీలకంఠ మృతి పట్ల టీడీపీ మండల నాయకులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

నంద్యాల(D) ఆత్మకూరుకు చెందిన కోవా బన్ను వ్యాపారి షేక్ బాషా నిన్న గుండెపోటుతో మృతిచెందారు. మేడారం జాతర సందర్భంగా ఓ యూట్యూబ్ ఛానల్ చూపిన అత్యుత్సాహంతో అతని వ్యాపారం పడిపోయింది. ఈ వ్యాపారం కోసం ప్రత్యేకంగా గేదెలు, ఆటో కొనుగోలు చేయడంతో పాటు సుహానా-సమయ మిల్క్ డెయిరీ పేరుతో పాల ఉత్పత్తి చేసేవారు. వ్యాపారం ఆగిపోవడంతో అప్పులు తీర్చేమార్గం లేక వేదనకు గురై గుండెపోటుతో మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

దేశంలోని ఎక్కువగా వలసలు వెళ్లే రైతు కూలీలున్న ఆదోని, మంత్రాలయం, ఆలూరు, ఎమ్మిగనూరు, పత్తికొండ ప్రాంతాల్లో మరిన్ని KGBVలు ఏర్పాటు చేయాలని అసెంబ్లీలో ఎమ్మెల్యే పార్థసారథి కోరారు. వైసీపీ హయాంలో కర్నూలు పశ్చిమ ప్రాంతంలో 25 సీజనల్ హాస్టళ్లుంటే.. వాటిని కేవలం 6 నెలల్లోనే 78కి పెంచామని చెప్పారు. అందుకు విద్యాశాఖ మంత్రి లోకేశ్‌కు ధన్యవాదాలు తెలుపుతూ.. ఇవి సరిపోవని, ఇంకా కావాలని కోరారు.
Sorry, no posts matched your criteria.