Kurnool

News August 9, 2024

శానిటేషన్ వర్కర్లకు కనీస వేతనం ఇవ్వాలి: సీఐటీయూ

image

నంద్యాల జిల్లా ప్రభుత్వాసుపత్రి, మెడికల్ కళాశాలలో పనిచేస్తున్న శానిటేషన్ వర్కర్లకు కనీస వేతనం అమలు చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఏసురత్నం, కార్యదర్శి కేఎన్‌డీ గౌస్ డిమాండ్ చేశారు. నంద్యాల సీఐటీయూ కార్యాలయంలో శానిటేషన్ వర్కర్ల సమావేశం శుక్రవారం జరిగింది. వారు మాట్లాడుతూ.. శానిటేషన్ వర్కర్లపై పనిభారం ఎక్కువగా ఉందని, 70 మందితో చేయాల్సిన పనులను కేవలం 40 మందితో చేయించుకుంటున్నారని అన్నారు.

News August 9, 2024

కర్నూలు, నంద్యాలలో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించేది వీరే..

image

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నిర్వహణపై రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులను జారీ చేశారు. కర్నూలులోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్‌లో పంద్రాగస్టు నాడు మంత్రి టీజీ భరత్ జాతీయ పతకాన్ని ఆవిష్కరించనున్నారు. నంద్యాలలో జరిగే స్వాతంత్ర్య వేడుకల్లో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆవిష్కరిస్తారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

News August 9, 2024

నంద్యాల జిల్లా నుంచి బెంగళూరు వెళ్లనున్న వైఎస్ జగన్

image

మాజీ సీఎం వైఎస్ జగన్ నంద్యాల జిల్లా పర్యటన ముగిసిన అనంతరం బెంగళూరుకు వెళ్లనున్నారు. ఇవాళ ఉ.10 గంటలకు ఓర్వకల్ విమానాశ్రయానికి చేరుకోనున్న జగన్ అక్కడి నుంచి రోడ్డు మార్గంలో సీతారామపురం చేరుకుంటారు. సుబ్బరాయుడు కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం ఓర్వకల్లు విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా బెంగళూరుకు బయలుదేరనున్నారు. నాలుగు రోజుల పాటు ఆయన అక్కడే ఉండే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

News August 9, 2024

నంద్యాల జిల్లా హెడ్ కానిస్టేబుల్‌‌కు ఏడాది జైలు శిక్ష

image

నంద్యాల జిల్లా ఏఆర్ హెడ్ కానిస్టేబుల్‌ శోభన్ బాబుకు ఏడాది జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా పడింది. ఈ మేరకు మొదటి అదనపు జుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ జ్యోత్స్నాదేవి తీర్పు చెప్పారు. 2019లో కర్నూలులోని ఓ మహిళపై కానిస్టేబుల్ అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై కేసు నమోదు కాగా విచారణలో నేరం రుజువు కావడంతో జైలు శిక్ష, జరిమానా విధించారు.

News August 9, 2024

నేడు నంద్యాల జిల్లాకు వైఎస్ జగన్

image

వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు నంద్యాల జిల్లాకు రానున్నారు. ఉదయం10 గంటలకు ఓర్వకల్ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో హుసేనాపురం, పాణ్యం, నంద్యాల బైపాస్ మీదుగా సీతారామపురం చేరుకుంటారు. ఇటీవల హత్యకు గురైన సుబ్బరాయుడు కుటుంబాన్ని పరామర్శించనున్నారు.

News August 9, 2024

నంద్యాల జిల్లాలో భారీగా SIల బదిలీ

image

నంద్యాల జిల్లాలో భారీగా ఎస్సైలు బదిలీ అయ్యారు. 20 మంది ఎస్సైలను బదిలీ చేస్తూ నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో భాగంగా 15 మందికి వివిధ మండలాలకు పోస్టింగ్ ఇవ్వగా, మరో ఐదుగురు ఎస్సైలను వీఆర్‌కు బదిలీ చేస్తూ ఈ మేరకు ఎస్పీ ఉత్తర్వులు జారీ చేశారు.

News August 8, 2024

రేపు నంద్యాలకు వైఎస్ జగన్: YCP

image

నంద్యాల జిల్లాలో రేపు YCP అధినేత, మాజీ CM వైఎస్ జగన్ పర్యటించనున్నట్లు YSRCP (X)లో వెల్లడించింది. ప్రత్యర్థుల దాడిలో మృతి చెందిన నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం సీతారామపురం గ్రామానికి చెందిన YCP కార్యకర్త పెద్ద సుబ్బారాయుడు కుటుంబ సభ్యులను వైఎస్ జగన్ పరామర్శించనున్నట్లు పేర్కొంది. కాగా, జగన్ రేపటి నంద్యాల షెడ్యూల్ ను మాజీ MLA కాటసాని రాంభూపాల్ రెడ్డి ఇప్పటికే మీడియాకు వెల్లడించారు.

News August 8, 2024

కర్నూలు: ఇండికేటర్స్ ‌లో పురోగతి సాధించాలి

image

ఆస్పిరేషనల్ జిల్లా/బ్లాకులకు సంబంధించిన ఇండికేటర్స్‌లో సెప్టెంబరు 30వ తేదిలోపు పురోగతి సాధించాలని నీతి అయోగ్ సీఈఓ బివిఆర్.సుబ్రహ్మణ్యం అన్ని రాష్ట్రాల జిల్లా కలెక్టర్లకు సూచించారు. గురువారం ఢిల్లీ నీతి అయోగ్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని రాష్ట్రాల కలెక్టర్లతో వివిధ అంశాలపై నీతి అయోగ్ సీఈఓ సమీక్ష నిర్వహించారు. కర్నూల్ కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా పాల్గొన్నారు.

News August 8, 2024

రేపు మాజీ సీఎం జగన్ రాక

image

మాజీ సీఎం జగన్ శుక్రవారం మహానంది మండలం సీతారామపురానికి రానున్నారు. వైసీపీ నేత పసుపులేటి సుబ్బరాయుడు ఇటీవల హత్యకు గురైన విషయం తెలిసిందే. ఆయన ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు జగన్ వస్తున్న నేపథ్యంలో వైసీపీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. మహానంది, బండిఆత్మకూరు మండలాల నుంచి వైకాపా నాయకులు తరలి రానున్నట్లు సమాచారం.

News August 8, 2024

నంద్యాల: రైలు కింద పడి రైల్వే కూలీ ఆత్మహత్య

image

అనంతపురం జిల్లా గుత్తి జీఆర్‌పీ పరిధిలోని రాయలచెరువు రైల్వే స్టేషన్ వద్ద రైల్వే కూలీ (ప్యాకింగ్ మిషన్ కూలీ) మనోహర్(23) గురువారం తెల్లవారుజామున రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు జీఆర్‌పీ ఎస్ఐ నాగప్ప చెప్పారు. నంద్యాల జిల్లా బేతంచెర్లకు చెందిన మనోహర్ కొన్ని రోజులుగా గుత్తి జీఆర్‌పీ పరిధిలో రైల్వే పనులు చేస్తున్నాడు. అయితే అనారోగ్య కారణాలతో ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.