Kurnool

News August 8, 2024

రోడ్డు ప్రమాదానికి గురైన ఏఎస్ఐ, కానిస్టేబుల్‌

image

ఎమ్మిగనూరు మండలం కందనాతి వద్ద గురువారం ఉదయం స్కూల్ విద్యా కమిటీ ఎన్నికల విధులకు వెళ్తున్న ఎమ్మిగనూరు రూరల్ ASI బాలా నాయక్, కానిస్టేబుల్ సర్వేశ్వర్ రెడ్డి బైకును ఆటో ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం వెంటనే కర్నూలు మెడికల్ కళాశాలకు తరలించారు.

News August 8, 2024

కర్నూలు జిల్లాకు ఇద్దరు కొత్త డీఎస్పీలు

image

ఉమ్మడి కర్నూలు జిల్లాకు ఇద్దరు కొత్త డీఎస్పీలు నియమితులయ్యారు. నంద్యాల డీఎస్పీగా యుగంధర్ బాబు, ఆదోని డీఎస్పీగా డీ.సోమన్నను నియమిస్తూ డీజీపీ ద్వారకా తిరుమలరావు ఉత్తర్వులు జారీ చేశారు. ఆదోని, పత్తికొండ డీఎస్పీలు జే.శివ నారాయణస్వామి, పీ.శ్రీనివాస రెడ్డిని పోలీస్ హెడ్ క్వార్టర్‌లో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న కర్నూలు డీఎస్పీ విజయ్ శేఖర్‌ను తిరుమల డీఎస్పీగా నియమించారు.

News August 8, 2024

ఎమ్మెల్యే కోట్ల జయ సూర్యప్రకాశ్ రెడ్డి సోదరి మృతి

image

డోన్ ఎమ్మెల్యే కోట్ల జయ సూర్యప్రకాశ్ రెడ్డి సోదరి, ప్రముఖ సినీ నిర్మాత ఎం.శ్యాం ప్రసాద్ రెడ్డి సతీమణి వరలక్ష్మి బుధవారం రాత్రి 10 గంటల సమయంలో మరణించారు. ఆమె మృతి పట్ల నియోజకవర్గంలోని రాజకీయ నాయకులు, స్వచ్ఛంద సంస్థల సభ్యులు, పలువురు సంతాపం తెలిపారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

News August 8, 2024

నంద్యాల: దారుణం.. చెత్తకుండీలో పసికందు

image

ఏ కష్టం వచ్చిందో, ఏ తప్పు జరిగిందో తెలియదు..? నవమాసాలు మోసి కన్న పసికందును చెత్తబుట్టలో పడేసి వెళ్లింది ఓ తల్లి. శిరివెళ్లలోని షాదిఖానా సమీపంలో ఉన్న చెత్తకుండీలో ఓ పసికందు లభ్యమవడం బుధవారం స్థానికులను కలచివేసింది. విషయం తెలుసుకున్న ఐసీడీఎస్ అధికారులు పసికందుకు ఆస్పత్రిలో చికిత్సలు చేయించి జిల్లా కేంద్రంలోని బాలుర శిశు భవనంలో చేర్చారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News August 8, 2024

BREAKING: కర్నూలు జిల్లాలో భారీగా SIల బదిలీ

image

ఉమ్మడి కర్నూలు జిల్లాలో భారీగా ఎస్సైలు బదిలీ అయ్యారు. 44 మంది ఎస్సైలను బదిలీ చేస్తూ కర్నూలు రేంజ్ డీఐజీ డా.కోయ ప్రవీణ్ బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో ఆరుగురిని నంద్యాల జిల్లా నుంచి కర్నూలు జిల్లాకు, మరో ఇద్దరిని కడప, చిత్తూరు నుంచి కర్నూలుకు బదిలీ చేశారు. అటు కర్నూలు జిల్లాలో విధులు నిర్వర్తిస్తున్న 10 మంది ఎస్సైలను వీఆర్‌కు బదిలీ చేస్తూ డీఐజీ ఉత్తర్వులిచ్చారు.

News August 8, 2024

ప్రతి శాఖ వంద రోజుల కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలి: కలెక్టర్

image

ప్రతిశాఖ వంద రోజులు, ఏడాది, 5 ఏళ్ల కాలానికి లక్ష్యాలతో కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్ రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాలులో వంద రోజుల ప్రణాళిక, ఏడాది ప్రణాళిక, 5 ఏళ్ల కార్యాచరణ ప్రణాళిక రూపకల్పనపై జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఏమేమి చేయగలమో లక్ష్యాలు నిర్ణయించుకొని వాటిని పూర్తి చేయాలని ఆదేశించారు.

News August 7, 2024

సున్నిపెంట పంచాయతీకి కేటాయించిన 208.74 ఎకరాల భూమి రద్దు: మంత్రి

image

శ్రీశైలం మండల కేంద్రమైన సున్నిపెంట గ్రామపంచాయతీకి గత ప్రభుత్వ హయాంలో కేటాయించిన జల వనరుల శాఖ ఆధీనంలోని 208.74 ఎకరాల భూమిని రద్దు చేస్తూ రాష్ట్ర క్యాబినెట్ ఆమోదించింది. ఈ మేరకు మంత్రి పార్థసారథి వివరాలు వెల్లడిస్తూ రద్దయిన భూమిని తిరిగి జల వనరుల శాఖకు కేటాయిస్తూ మంత్రిమండలి ఆమోదించినట్లు పేర్కొన్నారు. ఆ భూమిని శ్రీశైలం ప్రాంత అభివృద్ధిలో భాగంగా మాస్టర్ ప్లాన్‌కు వినియోగించుకోవాలని సూచించారు.

News August 7, 2024

వేదవతి ప్రాజెక్టును పీఎంకేసీవై పథకంలోకి చేర్చండి: కర్నూలు ఎంపీ

image

కర్నూలు జిల్లాలోని వేదవతి ప్రాజెక్టును ప్రధాన మంత్రి కృషి సించాయీ యోజన పథకం కింద చేర్చాలని కేంద్ర జలశక్తి మంత్రి చంద్రకాంత్ రఘునాథ్ పాటిల్‌ను కర్నూలు ఎంపీ నాగరాజు కోరారు. బుధవారం ఢిల్లీలోని ఆయన కార్యాలయంలో కలిసి కేంద్ర మంత్రికి వినతిపత్రం సమర్పించారు. ఈ ప్రాజెక్టు ద్వారా 80 వేల ఎకరాలకు నీరు అందించవచ్చని, అధిక సంఖ్యలో రైతులకు లబ్ధిచేకూరి వలసలను అరికట్టవచ్చని తెలిపారు.

News August 7, 2024

బ్యాంకాక్‌లో కిడ్నాప్.. యువకుడిని ఇంటికి చేర్చిన డోన్ ఎమ్మెల్యే

image

డోన్ మండలం చిన్న మల్కాపురానికి చెందిన మధు కుమార్ కొద్దిరోజుల కిందట బ్యాంకాక్‌లో కిడ్నాప్ అయిన విషయం తెలిసిందే. ఆ యువకుడిని డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి కిడ్నాపర్ల చర నుంచి విడిపించి బుధవారం ఇంటికి చేర్చారు. వెంటనే స్పందించి తమ కుమారుడిని తమ దగ్గరకు చేర్చినందుకు కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపారు.

News August 7, 2024

హత్య కేసులో 11 మంది అరెస్ట్

image

మహానంది మండలం సీతారామపురంలో వైసీపీ నేత సుబ్బారాయుడు హత్యకేసులో బుధవారం 11 మందిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఎస్పీ ఆధిరాజ్ సింగ్ రాణా ఆదేశాల మేరకు చాపిరేవుల అండర్ పాస్ దగ్గర అరెస్ట్ చేసినట్లు ఇన్‌ఛార్జ్ సీఐ ఇస్మాయిల్ తెలిపారు. అరెస్టయిన వారిలో ప్రభాకర్ రెడ్డి, లక్ష్మీరెడ్డి, శేఖర్ రెడ్డి, తాళ్లూరి శ్రీనివాసులు, తదితరులు ఉన్నారు. రెండు వాహనాలు సీజ్ చేశామన్నారు.