Kurnool

News August 5, 2024

పీజీఆర్ఎస్ కార్యక్రమం ద్వారా ప్రజా విజ్ఞప్తుల స్వీకరణ: కలెక్టర్

image

నంద్యాల కలెక్టరేట్‌లోని సెంటినరీ హాలులో నేడు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించనున్నట్లు కలెక్టర్‌ రాజకుమారి గణియా ఆదివారం ప్రకటనలో తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి, ప్రజల నుంచి అర్జీలు స్వీకరించే ప్రక్రియను పబ్లిక్‌ గ్రివియన్స్‌ రెడ్రెస్సల్‌ సిస్టం (పీజీఆర్‌ఎస్‌) ద్వారా చేపట్టనున్నట్లు తెలిపారు.

News August 4, 2024

నంద్యాల: ‘డబ్బులు ఇవ్వలేదని విద్యార్థి చెవి కొరికారు’

image

నంద్యాలలో దారుణం చోటుచేసుకుంది. ఆటోనగర్ సమీపంలో లోకేశ్వర్ రెడ్డి అనే విద్యార్థిని అటకాయించిన దుండగులు డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లన దగ్గర లేవని చెప్పడంతో విచక్షణ కోల్పోయిన దుండగులు.. కింద పడేసి కొట్టారు. అంతటితో ఆగకుండా ఆ విద్యార్థి చెవిని కొరకడంతో చెవి కొంతభాగం తెగి కిందపడింది. లోకేశ్వర్ రెడ్డి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.

News August 4, 2024

రాజకీయ కక్షతోనే హత్య చేశారు: సుబ్బమ్మ

image

వైసీపీకి ఓటు వేశామనే తన భర్త సుబ్బరాయుడును టీడీపీ నేత బుడ్డా శ్రీనివాసరెడ్డి, ఆయన అనుచరులు హత్య చేశారని బాల సుబ్బమ్మ ఆరోపించారు. ‘శ్రీనివాసరెడ్డి అనుచరులు 30 మంది అర్ధరాత్రి మా ఇంటికి వచ్చారు. సుబ్బరాయుడు ఎక్కడ అని అడిగారు. లేడని చెప్పడంతో నన్ను కొట్టారు. తర్వాత రాళ్లు, కర్రలతో దాడిచేసి నా భర్తను చంపేశారు. దాడికి పాల్పడింది మా ఊరోళ్లే. భూ సమస్య కాదు. రాజకీయ కక్షతోనే హత్య చేశారు’ అని ఆమె చెప్పారు.

News August 4, 2024

కక్షతో నంద్యాలలో మా కార్యకర్తను హత్య చేశారు: వైసీపీ

image

నంద్యాలలో వైసీపీ కార్యకర్త సుబ్బరాయుడిని టీడీపీకి సంబంధించిన వ్యక్తులే హత్య చేసినట్లు వైసీపీ ఆరోపించింది. ‘మహానంది మండలం సీతారామపురంలో సుబ్బారాయుడు వైసీపీ కోసం పని చేశారు. టీడీపీ గూండాలు కక్ష పెట్టుకుని ఇంట్లోకి చొరబడి రాళ్లు, కత్తులతో దాడి చేశారు. సుబ్బారాయుడు అక్కడికక్కడే మృతి చెందగా భార్యకు తీవ్ర గాయాలు అయ్యాయి. రాష్ట్రంలో ఇంకెన్నాళ్లు ఈ రాక్షసకాండ’ అని ప్రశ్నిస్తూ వైసీపీ ట్వీట్ చేసింది.

News August 4, 2024

నంద్యాల హత్య ఘటన.. భార్యకూ తీవ్ర గాయాలు

image

నంద్యాలలో వైసీపీ కార్యకర్త సుబ్బారాయుడు <<13773210>>హత్యకు<<>> గురైన విషయం తెలిసిందే. అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడ్డ దుండగులు ఇంట్లోని సామగ్రి, వస్తువులను ధ్వంసం చేసి రాళ్లు, కర్రలతో సుబ్బరాయుడిని కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. భర్తను కాపాడేందుకు అడ్డుగా వెళ్లిన భార్య పసుపులేటి బాలసుబ్బమ్మపై కూడా కత్తులతో దాడిచేసినట్లు తెలుస్తోంది. తీవ్ర గాయాలపాలైన ఆమె ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

News August 4, 2024

నంద్యాలలో శిల్పా అనుచరుడి దారుణ హత్య

image

నంద్యాలలో శిల్పా చక్రపాణిరెడ్డి అనుచరుడు సుబ్బరాయుడు దారుణ హత్యకు గురయ్యాడు. సీతారామపురంలోని తన ఇంట్లో నిద్రిస్తుండగా ఆదివారం తెల్లవారుజామున దుండగులు ఇంట్లోకి ప్రవేశించి రాళ్లతో దాడి చేశారు. కత్తులతో పొడిచి అక్కడి నుంచి పరారయ్యారు. తీవ్రగాయాలపాలైన సుబ్బరాయుడు అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News August 4, 2024

అవార్డుకు దరఖాస్తుల ఆహ్వానం: కర్నూల్ కలెక్టర్

image

విపత్తు నిర్వహణ రంగంలో వ్యక్తులు, సంస్థలు అందించిన నిస్వార్థ సేవలను గుర్తించి వారిని గౌరవించేందుకు భారత ప్రభుత్వం సుభాశ్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ పురస్కార్-25కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ రంజిత్ బాషా తెలిపారు. ఈ అవార్డును ప్రతి ఏడాది జనవరి 23న చంద్రబోస్ జయంతి రోజున ప్రకటిస్తారన్నారు. అవార్డు పారితోషికం సంస్థకు రూ.51 లక్షలు, వ్యక్తులకు రూ.5 లక్షలు ఉంటుందని తెలిపారు.

News August 4, 2024

వచ్చేవారం నుంచి వర్క్ అడ్జస్ట్‌మెంట్ ప్రక్రియ: డీఈఓ

image

వచ్చేవారం నుంచి ఉపాధ్యాయుల వర్క్ అడ్జస్ట్‌మెంట్ ప్రక్రియ ఆన్‌లైన్‌లో ప్రారంభమవుతుందని డీఈఓ శామ్యూల్ పేర్కొన్నారు. శనివారం కలెక్టరేట్లో విద్యాశాఖ అధికారుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో త్వరలోనే పాఠశాల విద్యాశాఖ కమిషనర్, కార్యదర్శి పర్యటనలు ఉంటాయని పేర్కొన్నారు. అందుకు అనుగుణంగా నివేదికలను సిద్ధం చేసుకోవాలని కోరారు. ఎస్ఎంసీ కమిటీ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారం నిర్వహించాలన్నారు.

News August 3, 2024

కర్నూలు: త్వరలో ఎస్సైల బదిలీలు..?

image

ఉమ్మడి కర్నూలు జిల్లాలో త్వరలో ఎస్సైల బదిలీలు జరగనున్నట్లు సమాచారం. ఇప్పటికే DIG, SPలు, DSPలను ప్రభుత్వం బదిలీ చేసింది. తాజాగా కర్నూలు రేంజ్ పరిధిలో పెద్ద సంఖ్యలో CIలను బదిలీ చేస్తూ DIG డా.ప్రవీణ్ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, ఇటీవలే నంద్యాల, కర్నూలు జిల్లాలకు కొత్త ఎస్పీలు ఛార్జ్ తీసుకున్నారు. ఈ నేపథ్యంలో త్వరలో ఎస్సైలను బదిలీ చేస్తూ ఎస్పీలు ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది.

News August 3, 2024

దేశభక్తి భావన ఉట్టిపడేలా స్వాతంత్ర్య దినోత్స‌వం: కలెక్టర్

image

దేశభక్తి భావన ఉట్టిపడేలా స్వాతంత్ర్య దినోత్స‌వాన్ని ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాలులో స్వాతంత్ర్య దినోత్సవ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. వేడుకలను మొక్కుబడిగా కాకుండా దేశ, రాష్ట్ర, జిల్లా సంస్కృతీ, సంప్రదాయాలు ఉట్టిపడేలా నిర్వహించాలని పేర్కొన్నారు.