India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కర్నూలు జిల్లా వ్యాప్తంగా పదవ తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు విద్యాశాఖ హెచ్చరికలు జారీ చేసింది. ప్రైవేట్ పాఠాశాలలకు చెందిన విద్యార్థులు తమ పాఠశాల యూనిఫామ్ వేసుకుని పరీక్షలకు హాజరు కాకూడదని జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ పాల్ ఆదివారం తెలిపారు. ఈ ఆదేశాలను అతిక్రమించి విద్యార్థులను యూనిఫామ్‌తో పరీక్షలకు పంపితే, ఆ పాఠశాలల యజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో విద్యార్థులకు కర్నూలు ఎం.పి బస్తిపాటి నాగరాజు శుభాకాంక్షలు తెలిపారు. ఆదివారం మీడియాతో ఆయన మాట్లాడారు. విద్యార్థులు ఒత్తిడి, ఆందోళనకు గురికాకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలని సూచించారు. జీవితంలో ఉన్నత చదువులకు తొలి మెట్టు పదవ తరగతి అని, ప్రతి ఒక్కరూ గొప్ప ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు.
ఆదోనిలోని ఒకటో వార్డు చిన్నశక్తి గుడి ఆవరణలో శనివారం అర్ధరాత్రి నుంచి తెల్లవారుజామున వరకు ‘గరివిడి లక్ష్మి’ సినిమా షూటింగ్ జరిగింది. షూటింగ్‌ను తిలకించడానికి జనాలు ఎగబడ్డారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఒకటో పట్టణ పోలీసులు బందోబస్తు కల్పించారు. గౌరీ నాయుడు జమ్ము దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి జే.ఆదిత్య కెమెరామెన్ కాగా, చరణ్ అర్జున్ సంగీతం అందిస్తున్నారు.
రాష్ట్ర సాధన కోసం కఠోర దీక్ష చేసి తెలుగు జాతికి స్ఫూర్తిగా నిలిచిన అమరజీవి పొట్టి శ్రీరాములు జీవిత చరిత్ర నేటి యువత అనుసరించాలని మంత్రి టీజీ భరత్ అన్నారు. పొట్టి శ్రీరాములు 124వ జయంతి పురస్కరించుకొని కర్నూలులోని పూల బజార్ వద్ద ఉన్న ఆయన కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 58 రోజుల పాటు నిర్విరామంగా అమరణ నిరాహార దీక్ష చేసి రాష్ట్రాన్ని సాధించారని అన్నారు.
కర్నూలు జిల్లాలో చికెన్ ధరలు ఆదివారం ఈ విధంగా ఉన్నాయి. కర్నూలు, ఎమ్మిగనూరులో కిలో స్కిన్ రూ.160, స్కిన్ లెస్ రూ.180కి అమ్ముతున్నారు. ఆదోనిలో స్కిన్ లెస్ రూ.185, స్కిన్ రూ.160కి విక్రయాలు జరిగుతున్నాయి. మిగిలిన పట్టణాల్లోనూ ఇవే రేట్లు పలుకుతున్నాయి.
ఈ నెల 17 నుంచి 31వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నట్లు ఆదోని ఆర్టీసీ డిపో మేనేజర్ రఫిక్ వెల్లడించారు. విద్యార్థులు ఆర్టీసీ బస్సు కండక్టర్లకు హాల్ టికెట్ చూపించి, 14 రోజుల పాటు ఉచితంగా ప్రయాణించే వెసలుబాటు కల్పించామన్నారు. పరీక్షలు రాసే విద్యార్థులు ఉచిత బస్సు ప్రయాణాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపిద్దామని జిల్లా ఇన్‌ఛార్జ్ ఆఫీసర్, రహదారులు, భవనాలు, రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కాంతిలాల్ దండే పేర్కొన్నారు. శనివారం కర్నూలు కలెక్టరేట్లో కలెక్టర్ రంజిత్ బాషా అధ్యక్షతన జిల్లా అభివృద్ధిపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. జిల్లాలో పేదరిక నిర్మూలన, ఎంఎస్ఎంఈల ఏర్పాటు, విద్య, వైద్య రంగాల అభివృద్ధి, నీటి వనరుల వినియోగం అంశాలపై దృష్టి సారిస్తామన్నారు.
కర్నూలు జిల్లా వ్యాప్తంగా శనివారం జరిగిన ఇంటర్మీడియట్ రెండో సంవత్సర పరీక్షకు 393 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు జిల్లా ఇంటర్ బోర్డు ప్రాంతీయ అధికారి గురువయ్య శెట్టి తెలిపారు.19,182 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా 393 విద్యార్థులు హాజరు కాలేదన్నారు. జిల్లా వ్యాప్తంగా ఎలాంటి మల్ ప్రాక్టీస్ ఘటనలు చోటు చేసుకోలేదని ఆర్ఐఓ స్పష్టం చేశారు.
కర్నూలులో TDP నేత సంజన్న <<15763975>>హత్య<<>> కలకలం రేపింది. శరీన్‌నగర్‌లో ఉంటున్న సంజన్నకు స్థానికంగా అంజితో ఆధిపత్యపోరు ఉంది. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి ఇంటికి వెళ్తున్న సంజన్నపై దండగులు కత్తులతో దాడి చేసి హత్య చేశారు. విషయం తెలుసుకున్న సంజన్న వర్గీయులు ఆంజి వాహనంపై దాడికి పాల్పడటంతో ఉద్రిక్తత నెలకొంది. అంజి వర్గీయులే ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
కర్నూలులో దారుణ హత్య జరిగింది. నగరంలోని షరీఫ్ నగర్‌కు చెందిన కార్పొరేటర్ జయన్న తండ్రి సంజన్నను గుర్తుతెలియని వ్యక్తులు దాడిచేసి హత్య చేశారు. 2024లో టీడీపీలో చేరిన ఆయన బైరెర్డి వర్గీయుడిగా ఉన్నారు. అయితే స్థానికంగా అంజన్నతో మృతుడికి ఆధిపత్యపోరు ఉన్నట్లు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. నాల్గో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Sorry, no posts matched your criteria.