India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

కర్నూలు జిల్లాలో ప్రవేశపెట్టిన డ్రోన్ పెట్రోలింగ్ ద్వారా ప్రజల భద్రత మరింత పటిష్ఠం కానుంది. డే, నైట్ విజన్ సౌకర్యాలు కలిగిన డ్రోన్ కెమెరాలతో పగలు, రాత్రి నిరంతరం నిఘా పెట్టనున్నారు. దీంతో నేరాలు ముందే గుర్తించి అరికట్టే అవకాశం ఉంటుంది. మహిళల భద్రతకు నియంత్రణ, కాలేజీలు, పాఠశాలల వద్ద ఈవ్ టీజింగ్‌కు పాల్పడేవారిని గుర్తించే అధునాతన సాంకేతికను జోడించారు. దీంతో నేరాల సంఖ్య తగ్గుముఖం పట్టనుంది.

కర్నూలు జిల్లాలో ప్రవేశపెట్టిన డ్రోన్ పెట్రోలింగ్ ద్వారా ప్రజల భద్రత మరింత పటిష్ఠం కానుంది. డే, నైట్ విజన్ సౌకర్యాలు కలిగిన డ్రోన్ కెమెరాలతో పగలు, రాత్రి నిరంతరం నిఘా పెట్టనున్నారు. దీంతో నేరాలు ముందే గుర్తించి అరికట్టే అవకాశం ఉంటుంది. మహిళల భద్రతకు నియంత్రణ, కాలేజీలు, పాఠశాలల వద్ద ఈవ్ టీజింగ్‌కు పాల్పడేవారిని గుర్తించే అధునాతన సాంకేతికను జోడించారు. దీంతో నేరాల సంఖ్య తగ్గుముఖం పట్టనుంది.

2026–27 కేంద్ర బడ్జెట్ వికసిత భారత్ దిశగా ముందడుగు అని ఎంపీ బస్తిపాటి నాగరాజు పేర్కొన్నారు. పార్లమెంట్‌లో బడ్జెట్‌పై ధన్యవాద తీర్మానంలో మాట్లాడిన ఆయన.. ఆర్థిక క్రమశిక్షణతో దూరదృష్టి కలిగిన బడ్జెట్‌ను సమర్పించిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు అభినందనలు తెలిపారు. బడ్జెట్‌లో మేక్ ఇన్ ఇండియా, మౌలిక వసతుల అభివృద్ధి, ఆర్థిక వృద్ధి వేగవంతం, సమగ్ర అభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చారని చెప్పారు.

మహా శివరాత్రి సందర్భంగా జిల్లాలోని శైవక్షేత్రాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి, ఎస్పీ విక్రాంత్ పాటిల్ అధికారులను ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆర్డీవోలు, డీఎస్పీలు, తహశీల్దార్లు, ఎండోమెంట్స్ అధికారులతో సమీక్షించారు. దేవాలయాల్లో పారిశుద్ధ్యం, క్యూలైన్లు, బ్యారికేడింగ్, తాగునీరు, షేడ్‌లు తదితర మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు.

పీహెచ్సీల్లో డాక్టర్లు ప్రజలకు అందుబాటులో ఉండి వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి ఆదేశించారు. మంగళవారం కర్నూలు కలెక్టరేట్ నుంచి వాట్సప్ గవర్నెన్స్‌పై అధికారులతో సమీక్ష ద్వారా మాట్లాడారు. వాట్సప్ గవర్నెన్స్‌లో ఈ నెల కూడా జిల్లా మొదటి స్థానంలో ఉండాలని అన్నారు. నాలుగు రోజుల్లోపు యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

కర్నూలు జిల్లాలో నేరాల నియంత్రణకు ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ జిల్లా పోలీసు శాఖ డ్రోన్ పెట్రోలింగ్ ప్రారంభించింది. డీజీపీ కార్యాలయం నుంచి కేటాయించిన 3 నూతన డ్రోన్ కెమెరాలను ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆవిష్కరించారు. డే, నైట్ విజన్ సౌకర్యంతో పనిచేసే ఈ డ్రోన్లు జిల్లావ్యాప్తంగా నిరంతర నిఘా నిర్వహించనున్నాయి. మహిళల భద్రతపై ప్రత్యేక దృష్టి సారిస్తూ కాలేజీలు, పాఠశాలల ప్రత్యేక నిఘాకు ఉపయోగపడతాయన్నారు.

‘KYC–సురక్షిత బ్యాంకింగ్ వైపు తొలి అడుగు’ థీమ్‌తో కర్నూలులో ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలు (ఫిబ్రవరి 9–13) ప్రారంభమయ్యాయి. కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి పోస్టర్లు, టీవీ కమర్షియల్స్ ఆవిష్కరించారు. అధికారులు KYC, Re-KYC, CKYC ప్రాముఖ్యతపై అవగాహన కల్పిస్తూ, KYC అప్డేట్ చేయకపోతే ఖాతాలపై పరిమితులు ఉండొచ్చని తెలిపారు. ఆధార్, ఓటర్ ఐడీ వంటి పత్రాలతో Re-KYC చేయవచ్చు అని సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు.

తిరుమల, శ్రీశైలం దేవాలయాల్లో లడ్డూ ప్రసాదం కల్తీ అని ఆరోపణలు చేస్తున్న సీఎం చంద్రబాబు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులకు భేషరతుగా క్షమాపణలు చెప్పాలని జిల్లా వైసీపీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. లడ్డూ వివాదంలో బీజేపీ అగ్ర నాయకత్వం ఇప్పటివరకు ఒక్కమాటా మాట్లాడలేదని, ఇంకెన్నాళ్లు ఈ కల్తీ రాజకీయం చేస్తారని ఆయన మండిపడ్డారు.

కర్నూలు రేంజ్ పరిధిలో 9 మంది సీఐలను బదిలీ చేస్తూ కర్నూలు రేంజ్ DIG కోయ ప్రవీణ్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభాకర్ రెడ్డి అన్నమయ్య- SM నంద్యాలకు, అహ్మద్ రియాజ్ ప్రొద్దుటూరు-నంద్యాలకు, గోవింద్ రెడ్డి, దస్తగిరి కడప-నంద్యాలకు, ప్రసాద్ బాబు మన్నూరు-అన్నమయ్యకు, లింగప్ప బద్వేల్-మాన్నూరు, రామకృష్ణ SSS(D)- బద్వేల్‌కు, మహ్మద్ రఫీ మదనపల్లి 1-2టౌన్‌కు, రాజారెడ్డిని మదనపల్లి 2- 1టౌన్‌కు బదిలీ చేశారు.

జిల్లాలో అన్ని శాఖలు చేపడుతున్న అభివృద్ధి పనుల్లో ఖచ్చితమైన పురోగతి కనిపించాలని కలెక్టర్ డా. సిరి అధికారులను ఆదేశించారు. సోమవారం సీఎం వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహించారు. మార్చిలో జరిగే కలెక్టర్ల సమావేశం నాటికి అన్ని విభాగాల్లో ఫలితాలు చూపాలని సూచించారు. జాబ్ మేళాల ద్వారా 7 నుంచి 8 వేల మందికి ఉపాధి కల్పించాలని, PGRS ఫిర్యాదుల పరిష్కారంలో వేగం పెంచాలని ఆదేశించారు.
Sorry, no posts matched your criteria.