Kurnool

News July 31, 2024

కర్నూలు: పింఛన్ల పంపిణీకి రూ.103.54 కోట్లు

image

ఆగస్టు 1న ఉదయం 6 గంటలకే ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ ప్రక్రియ ప్రారంభించాలని, మొదటి రోజే 96 శాతానికిపైగా పంపిణీ పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదేశించారు. పింఛన్ల పంపిణీపై మంగళవారం వీడియో కాన్ఫరెన్స్‌లో సమీక్షించారు. అనంతరం కలెక్టర్ రంజిత్ బాషా పింఛన్ల పంపిణీపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. జిల్లాకు రూ.103.54 కోట్లు ప్రభుత్వం విడుదల చేసిందని చెప్పారు.

News July 31, 2024

వెలుగోడు జలాశయానికి పెనుముప్పు.. కట్టపై భారీ గొయ్యి

image

వెలుగోడు బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ కట్టపై భారీ గొయ్యి ఏర్పడటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ప్రాజెక్టు కట్ట దెబ్బతిన్నా అధికారులు గుర్తించలేదని, ఏదైనా ప్రమాదం జరిగితే భారీ నష్టం జరిగే అవకాశముందని పేర్కొంటున్నారు. ప్రస్తుతం వెలుగోడు జలాశయంలోకి శ్రీశైలం జలాలు చేరుతున్నాయి. వెలుగోడు జలాశయ సామర్థ్యం 16.95 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 2.136 టీఎంసీల నీరు చేరింది.

News July 31, 2024

ఉదయం 6 గంటలకే ఇంటింటికీ పింఛన్ పంపిణీ: సీఎస్

image

విజయవాడ సీఎస్ కార్యాలయం నుంచి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ సమీక్షించారు. ఉదయం 6 గంటలకే ఇంటింటికీ పింఛన్ పంపిణీ కార్యక్రమం చేపట్టాలని కలెక్టర్లను సీఎస్ ఆదేశించారు. కర్నూలు కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో కర్నూలు కలెక్టర్ రంజిత్ బాషా, ఇతర అధికారులు పాల్గొన్నారు.

News July 31, 2024

సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్

image

నంద్యాల కలెక్టర్ రాజకుమారి మంగళవారం శ్రీశైలం చేరుకున్నారు. ఆగస్టు 1న సీఎం చంద్రబాబు శ్రీశైలం వస్తున్న సందర్భంగా ఏర్పాట్లను పరిశీలించారు. డ్యామ్ అధికారులతో పలు విషయాలపై చర్చించారు. వారితో పాటు జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్, ఆత్మకూరు ఆర్డీవో దాస్, జిల్లాస్థాయి అధికారులు, పోలీసు అధికారులు, మండల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

News July 30, 2024

మోడల్ స్కూల్‌ను తనిఖీ చేసిన కడప ఆర్జేడీ

image

బేతంచెర్ల: గోరుమానుకొండ సమీపాన మోడల్ స్కూలును కడప ఆర్జెడీ శామ్యూల్ పాల్ మంగళవారం సందర్శించారు. పాఠశాల ఉత్తీర్ణతను, పిల్లల అడ్మిషన్ల ప్రక్రియను, అదనపు తరగతుల నిర్మాణ పనుల గురించి అడిగి తెలుసుకున్నారు. స్టూడెంట్ కిట్టుపై విస్తృతంగా చర్చించారు. విద్యార్థుల బట్టలు, బూట్లు, సాక్షులు విషయాల గురించి ఆరా తీశారు. ఇంటర్ విద్యార్థులకు భవిష్యత్ అవకాశాల గురించి ముచ్చటించారు.

News July 30, 2024

భక్తులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయండి: ఎస్పీ

image

కర్నూలు జిల్లా పరిధిలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఉరుకుంద శ్రీ ఈరన్న నరసింహస్వామి ఆలయ భద్రత ఏర్పాట్లను మంగళవారం ఎస్పీ బిందు మాధవ్ పరిశీలించారు. శ్రావణ మాస ఉత్సవాలకు విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని నిర్వాహకులు, పోలీసులను ఎస్పీ ఆదేశించారు. ఆదోని DSP శివ నారాయణ స్వామి, EO వెంకటేశ్వర్లు, CIలు నాగరాజు యాదవ్, ప్రసాద్, SI నరేంద్ర కుమార్ రెడ్డి పాల్గొన్నారు.

News July 30, 2024

Way2News ఎఫెక్ట్.. శ్రీశైలం డ్యామ్‌కు లైట్లు ఏర్పాటు

image

శ్రీశైలం డ్యామ్‌కు లైట్లు ఏర్పాటు చేయాలంటూ Way2Newsలో ప్రచురితమైన కథనానికి జలవనరుల శాఖ అధికారులు స్పందించారు. డ్యామ్ రేడియల్ క్రస్ట్ గేట్లకు మంగళవారం లైట్లు ఏర్పాటు చేశారు. దీంతో రాత్రి వేళలో పాల నురగలాంటి కృష్ణమ్మ పరవళ్లను తిలకిస్తూ, జల్లులో తడుస్తూ సందర్శకులు మంత్రముగ్ధులవుతున్నారు. జలాశయం 7 గేట్ల ద్వారా దిగువకు నీటి విడుదల కొనసాగుతోంది.

News July 30, 2024

కృష్ణా నదిలో పడవలు నడపవద్దు: శ్రీశైలం సీఐ నోటీసులు

image

శ్రీశైలం డ్యామ్‌కు కృష్ణానది పరీవాహక ప్రాంతాల నుంచి వరద ప్రవాహం క్రమంగా పెరుగుతుండటంతో శ్రీశైలం పోలీసులు అప్రమత్తమయ్యారు. జలాశయం బ్యాక్ వాటర్‌లో పడవలు నడపొద్దు అంటూ ఏపీ టూరిజం మేనేజర్‌కు, స్థానిక మత్స్యకార బోట్ ఆపరేటర్లకు శ్రీశైలం సీఐ ప్రసాదరావు నోటీసులు అందజేశారు. వరద ప్రవాహం ఉధృతంగా ప్రవహిస్తోందని, సందర్శకుల శ్రేయస్సు దృష్ట్యా నోటీసులు జారీ చేశామన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పన్నారు.

News July 30, 2024

ఇష్టకామేశ్వరి అమ్మవారి దర్శనానికి అనుమతి లేదు

image

నల్లమల అభయారణ్యంలో వెలసిన శ్రీ ఇష్టకామేశ్వరి దేవి అమ్మవారి దర్శనానికి ఆగస్టు 1 తేదీ నుంచి అనుమతి నిలిపివేశారు. ఎన్టీసీఏ న్యూఢిల్లీ ఆదేశాల మేరకు నాగార్జునసాగర్-శ్రీశైలం టైగర్ రిజర్వులో నక్కంటి రేంజ్ పరిధిలో జంగిల్ రైడ్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు. పులులు, వన్యప్రాణుల సంయోగ సమయంగా (గర్భం దాల్చే) పరిగణిస్తూ నల్లమల అభయారణ్యంలోని పర్యాటక ప్రదేశాలకు అనుమతి నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

News July 30, 2024

కర్నూలు: పొలం తగదాలో ఘర్షణ.. వ్యక్తి మృతి

image

పొలం గట్టు విషయంలో ఘర్షణపడి దాయాదిని హత్య చేశారు. పోలీసుల వివరాలు.. ఎమ్మిగనూరు(M) గుడేకల్‌కి చెందిన గోపాల్‌‌ సోమవారం పొలం గట్టున రాళ్లను పాతుతుండగా బాబాయ్ కామయ్య అడ్డుచెప్పాడు. దీంతో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. కామయ్యపై గోపాల్, అతడి బంధువులు గడ్డపారతో దాడిచేయగా మృతిచెందాడు. మృతుడి కుమారుడు పెద్దయ్య ఫిర్యాదు మేరకు గోపాల్, వీరేశ్, రామకృష్ణ, మహదేవ, నాగిరెడ్డి, నారయణ, ఉరకుందమ్మపై కేసు నమోదుచేశారు.