Kurnool

News February 9, 2026

103 మంది విద్యార్థులు హాజరు కాలేదు: లాలప్ప

image

జిల్లా వ్యాప్తంగా 61 పరీక్షా కేంద్రాలలో ఆదివారం జరిగిన ఇంటర్ జనరల్, ఒకేషనల్ ప్రాక్టికల్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని ఇంటర్ బోర్డు ప్రాంతీయ అధికారి లాలప్ప వెల్లడించారు. ఉదయం జరిగిన ప్రథమ సంవత్సరంలో 2,721 మంది విద్యార్థులు హాజరవ్వగా.. 82 మంది గైర్హాజరయ్యారన్నారు. మధ్యాహ్నం జరిగిన ద్వితీయ సంవత్సరంలో 1,968 మంది విద్యార్థులు పరీక్షలు రాశారని, 21 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాలేదని పేర్కొన్నారు.

News February 9, 2026

103 మంది విద్యార్థులు హాజరు కాలేదు: లాలప్ప

image

జిల్లా వ్యాప్తంగా 61 పరీక్షా కేంద్రాలలో ఆదివారం జరిగిన ఇంటర్ జనరల్, ఒకేషనల్ ప్రాక్టికల్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని ఇంటర్ బోర్డు ప్రాంతీయ అధికారి లాలప్ప వెల్లడించారు. ఉదయం జరిగిన ప్రథమ సంవత్సరంలో 2,721 మంది విద్యార్థులు హాజరవ్వగా.. 82 మంది గైర్హాజరయ్యారన్నారు. మధ్యాహ్నం జరిగిన ద్వితీయ సంవత్సరంలో 1,968 మంది విద్యార్థులు పరీక్షలు రాశారని, 21 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాలేదని పేర్కొన్నారు.

News February 8, 2026

పోలీస్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక రద్దు: ఎస్పీ

image

రేపు జరగాల్సిన పోలీస్ పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. అదే రోజు విజయవాడలో CM చంద్రబాబు ఆధ్వర్యంలో జరిగే ఉన్నత స్థాయి సమావేశానికి హాజరు కావాల్సి ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. దూర ప్రాంతాల నుంచి రావద్దని ప్రజలకు ఎస్పీ విజ్ఞప్తి చేశారు.

News February 8, 2026

ప్రజా గ్రీవెన్స్ రద్దు: కలెక్టర్

image

కర్నూలు కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికను రద్దు చేస్తున్నట్లు కర్నూలు కలెక్టర్ డాక్టర్ సిరి ఒక ప్రకటనలో తెలిపారు. పీజీఆర్ఎస్, రెవున్యూ క్లినిక్ రద్దు విషయాన్ని జిల్లా ప్రజలు గమనించాలని పేర్కొన్నారు. పీజీఆర్ఎస్ రద్దు కారణంగా ఎవరూ అర్జీలు ఇచ్చేందుకు కలెక్టర్ కార్యాలయానికి రాకూడదని సూచించారు.

News February 8, 2026

కర్నూలులో రెసోనెన్స్.. సీమకు జాతీయ స్థాయి విద్య

image

రెసోనెన్స్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కర్నూలులో ఫిబ్రవరి 7(శనివారం) ప్రారంభమైంది. కార్యక్రమానికి టీ.జీ. వెంకటేశ్, పద్మశ్రీ బ్రహ్మానందం, ఎంపీ బస్తిపాటి నాగరాజు హాజరై రెసోనెన్స్ 25 ఏళ్ల అకడమిక్ సేవలను ప్రశంసించారు. రాయలసీమ విద్యార్థులకు స్థానికంగా నాణ్యమైన విద్య, నిపుణుల మార్గదర్శకత్వం, క్రమశిక్షణతో కూడిన చదువు వాతావరణం లభిస్తే JEE/NEET వంటి పోటీపరీక్షల్లో గొప్ప విజయాలు సాధిస్తారని వారు తెలిపారు.

News February 8, 2026

వ్యర్థాల నిర్వహణ సమర్థవంతంగా నిర్వహించాలి: కలెక్టర్

image

కలెక్టరేట్‌లో వ్యర్థాల నిర్వహణ, రీసైక్లింగ్ అంశాలపై మున్సిపల్ కమిషనర్లతో కలెక్టర్ సమీక్షించారు. ఆమె మాట్లాడుతూ.. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నిర్దేశాల ప్రకారం వ్యర్థాల నిర్వహణను సమర్థవంతంగా నిర్వహించాన్నారు. పర్యావరణ పరిరక్షణకు తోడ్పడాలన్నారు. తడి చెత్తను సాంకేతిక పద్ధతి ద్వారా వ్యవసాయ ఎరువుగా మార్చాలన్నారు. డంపింగ్ యార్డులలో పేరుకుపోయి ఉన్న వ్యర్థాలను శుభ్రం చేయించాలన్నారు.

News February 7, 2026

రోడ్డు ప్రమాదాల నియంత్రణే లక్ష్యం: ఎస్పీ

image

రహదారి ప్రమాదాల నియంత్రణ లక్ష్యంగా ప్రతీ శనివారం రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా పోలీస్ స్టేషన్ల పరిధిలో ట్రాఫిక్ నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించారు. మైనర్లు వాహనాలు నడపకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. హెల్మెట్ ధరించడం తప్పనిసరి, ఓవర్ స్పీడ్, ఓవర్ లోడ్, డ్రంకెన్ డ్రైవ్ చేయరాదని తెలిపారు.

News February 7, 2026

ఏపీపీఎస్సీ పరీక్షల ఏర్పాట్లపై సమీక్ష

image

జిల్లాలో ఏపీపీఎస్సీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని కర్నూల్ డీఆర్‌వో వెంకట నారాయణమ్మ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో ఆమె చాంబర్లో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. పరీక్షా కేంద్రాల్లో మౌలిక వసతులు, భద్రతా ఏర్పాట్లు, తాగునీరు, వైద్య సదుపాయాలు సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. రవాణా, విద్యుత్, పోలీసు శాఖలు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.

News February 7, 2026

వాయిస్ క్లోనింగ్ సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ

image

కర్నూలు జిల్లాలో వాయిస్ క్లోనింగ్ ద్వారా జరిగే సైబర్ మోసాలు పెరుగుతున్నాయని ఎస్పీ విక్రాంత్ పాటిల్ హెచ్చరించారు. AI సాయంతో బంధువులు లేదా స్నేహితుల గొంతును క్లోన్ చేసి అత్యవసర సహాయం పేరుతో డబ్బులు అడిగే ఘటనలు జరుగుతున్నాయన్నారు. ఇలాంటి కాల్స్ వచ్చినప్పుడు వెంటనే డబ్బులు పంపకుండా, తెలిసిన నంబర్‌కు స్వయంగా ఫోన్ చేసి వారి వివరాలు నిర్ధారించుకోవాలని సూచించారు.

News February 7, 2026

డబ్బులు తీసుకుంటే కఠిన చర్యలు: కలెక్టర్

image

ప్రజలకు మంచి సేవలు అందించి రిజిస్ట్రేషన్ శాఖకు మంచి పేరు రావాలని కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి అధికారులను ఆదేశించారు. శనివారం కర్నూలు కలెక్టరేట్ నుంచి జిల్లాలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ అధికారులతో పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్‌పై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రజల నుంచి డబ్బులు తీసుకుంటే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు.