India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

కర్నూలు జిల్లాలో రబీ సీజన్‌కు యూరియా ఎరువుల కొరత లేదని జిల్లా వ్యవసాయ అధికారి పీఎల్ వరలక్ష్మి స్పష్టం చేశారు. అవసరమైన నిల్వలు అందుబాటులో ఉన్నాయని, ఇప్పటికే భారీగా సరఫరా జరిగిందని తెలిపారు. వేల మెట్రిక్ టన్నుల యూరియాను మార్క్‌ఫెడ్ గోదాములు, సొసైటీల్లో సిద్ధంగా ఉంచామన్నారు. ఎవరైనా కృత్రిమ కొరత సృష్టించినా లేదా ఎంఆర్పీ కంటే ఎక్కువ ధరకు అమ్మినా కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు.

ఎమ్మిగనూరు మండలం కలుగొట్ల గ్రామానికి ఫిబ్రవరి 6న సీఎం చంద్రబాబు నాయుడు రానున్న నేపథ్యంలో భారీ భద్రత ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. 1,200 మంది పోలీసులతో పాటు స్పెషల్ పార్టీ, బాంబ్ స్క్వాడ్, మఫ్టీ బృందాలను రంగంలోకి దింపినట్లు పేర్కొన్నారు. హెలిప్యాడ్ నుంచి సభా ప్రాంగణం వరకు సీఎం వెళ్లే మార్గంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు.

సీఎం చంద్రబాబు ఈ నెల 6న ఎమ్మిగనూరు మండలం కలుగొట్లలో పర్యటించనున్నారు. పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ నేపథ్యంలో హెలిప్యాడ్, ప్రజావేదిక, రైతు పంట పొలాల సందర్శన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి, ఎస్పీ విక్రాంత్ పాటిల్ బుధవారం పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జయనాగేశ్వర రెడ్డి, జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్, కుడా ఛైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

ఈనెల 7 నుంచి 8 వరకు విశాఖపట్నంలో జరగబోయే జాతీయ స్థాయి కరాటే పోటీలకు జిల్లా క్రీడాకారులు 30 మంది ఎంపికైనట్లు కరాటే సంఘం ప్రతినిధి మహావీర్ తెలిపారు. బుధవారం కర్నూలులో జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన క్రీడాకారులకు స్పోర్ట్స్ కిట్లను డాక్టర్ శంకర్ శర్మ అందజేశారు. కరాటే సాధన చేయడం ద్వారా క్రమశిక్షణ అలవడుతుందని అన్నారు. పతకాలు సాధిస్తే నజరానా అందజేస్తానని హామీ ఇచ్చారు.

ఎమ్మిగనూరు వ్యవసాయ మార్కెట్ యార్డులో వేరశనగ ధర మళ్లీ పెరిగింది. మంగళవారం క్వింటా గరిష్ఠ ధర రూ.9,207 పలికింది. సోమవారం భారీగా పడిపోయి క్వింటా గరిష్ఠ ధర రూ.6,490 మాత్రమే పలికింది. ఒక్క రోజులోనే రూ.2,717 పెరగడంతో రైతులు కాస్త ఊరట చెందారు. నిన్న మధ్యస్థ ధర రూ.7,600, కనిష్ఠ ధర రూ.3,636కు వ్యాపారులు కొనుగోలు చేశారు. మొత్తం 2,918 బస్తాలు మార్కెట్‌కు వచ్చాయి.

జిల్లా వ్యాప్తంగా 72 పరీక్షా కేంద్రాలలో మంగళవారం జరిగిన ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు మూడవరోజు ముగిశాయి. వివరాలను ఇంటర్ బోర్డు ప్రాంతీయ అధికారి లాలప్ప వెల్లడించారు. ఉదయం జరిగిన ప్రథమ సంవత్సరంలో 4,330 మంది విద్యార్థులు హాజరవ్వగా, 168 మంది గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. మధ్యాహ్నం జరిగిన ద్వితీయ సంవత్సరంలో 3,538 మంది విద్యార్థులు పరీక్షలు రాశారని, 74 మంది గైర్హాజరయ్యారన్నారు.

ఆన్‌లైన్, బ్యాంక్, OTP, UPI/ATM/క్రెడిట్ కార్డు స్కామ్‌లు జరిగితే ఫిర్యాదు చేయడానికి ప్రభుత్వం 1930 టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేసింది. ఈ మధ్య సైబర్ మోసాలు ఎక్కువ కావడంతో కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పోలీసులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మోసానికి గురైనప్పుడు 1930కి కాల్ చేస్తే బ్యాంక్‌కు అలర్ట్ పంపిస్తారు. https://cybercrime.gov.inలో కూడా ఫిర్యాదు చేయొచ్చు.

ఆన్‌లైన్, బ్యాంక్, OTP, UPI/ATM/క్రెడిట్ కార్డు స్కామ్‌లు జరిగితే ఫిర్యాదు చేయడానికి ప్రభుత్వం 1930 టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేసింది. ఈ మధ్య సైబర్ మోసాలు ఎక్కువ కావడంతో కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పోలీసులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మోసానికి గురైనప్పుడు 1930కి కాల్ చేస్తే బ్యాంక్‌కు అలర్ట్ పంపిస్తారు. https://cybercrime.gov.inలో కూడా ఫిర్యాదు చేయొచ్చు.

అప్పులు, ఆర్థిక ఇబ్బందులతో ఓ పేద కుటుంబం బలైంది. పెద్దకడబూరు(M) కమ్మలదిన్నెకు చెందిన కురవ భీరప్ప, బీరమ్మ దంపతులు గత నెల 28న పురుగు మందు తాగారు. అదేరోజు భీరప్ప మృతి చెందగా, బీరమ్మ కర్నూలు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ నిరంజన్ రెడ్డి తెలిపారు.

సీఎం చంద్రబాబు ఈనెల 7న ఎమ్మిగనూరు(M) కలుగొట్లలో పర్యటించనున్నారు. ఈ మేరకు కలెక్టర్ ఏ.సిరి, ఎస్పీ విక్రాంత్ పాటిల్, ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి 3 చోట్ల స్థలాలను పర్యటించారు. ఈ నెల 3 లేదా 8న సీఎం పర్యటించనున్నట్లు ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. పర్యటన తేదీపై సీఎంవో స్పష్టతనిచ్చింది. ఈనెల 7న గ్రామంలో రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను సీఎం పంపిణీ చేయనున్నారు.
Sorry, no posts matched your criteria.