Kurnool

News July 11, 2024

నందికొట్కూరు పోలీస్‌స్టేషన్ ఎదుట వాసంతి బంధువుల నిరసన

image

చిన్నారి వాసంతి తల్లిదండ్రులు, బంధువులు నందికొట్కూరు పోలీసు స్టేషన్‌ను చుట్టుముట్టారు. ఇంతవరకు చిన్నారి ఆచూకీ దొరకలేదని బంధువులు పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన తెలిపారు. తమ పాపకు జరిగిన ఘటన వేరొకరికి జరగకూడదని కోరారు. వాసంతిని అత్యాచారం చేసి హతమార్చిన మైనర్ బాలురులకు ఎన్‌కౌంటర్ చేయాలని కోరారు.

News July 11, 2024

కర్నూలు రేంజ్ డీఐజీగా కోయ ప్రవీణ్

image

కర్నూలు రేంజ్ డీఐజీగా కోయ ప్రవీణ్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుత డీఐజీగా ఉన్న సీహెచ్ విజయరావును తదుపరి ఆదేశాలు వచ్చేంతవరకు విజయవాడలోని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కార్యాలయంలో రిపోర్ట్ చేయవలసిందిగా ఉత్తర్వుల్లో ఆయన పేర్కొన్నారు.

News July 11, 2024

బాలుడి చికిత్సకు ప్రభుత్వమే ఖర్చులు భరిస్తుంది: కర్నూలు కలెక్టర్

image

విద్యుదాఘాతంతో గాయపడిన హుసేని వైద్యచికిత్సకు అయ్యే ఖర్చులను మొత్తం ప్రభుత్వమే భరిస్తుందని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా అన్నారు. గురువారం జిల్లా కలెక్టర్ మీడియాతో మాట్లాడారు. క్రమశిక్షణా చర్యల్లో భాగంగా విధుల్లో నిర్లక్ష్యం వహించిన అంగన్వాడీ హెల్పర్, విద్యుత్ లైన్‌మెన్, సీడీపీఓ, సూపర్వైజర్లకు షోకాజ్ మెమో జారీ చేశామని కలెక్టర్ పేర్కొన్నారు.

News July 11, 2024

కర్నూలు: రోకలి బండతో బాది తల్లిని చంపిన కొడుకు

image

పాణ్యం మండలం వడ్డుగండ్ల గ్రామంలో కన్న కొడుకే తల్లిని కడతేర్చిన ఘటన గురువారం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. మహేశ్ అనే వ్యక్తి కొంతకాలంగా మద్యానికి బానిసై మతిస్తిమితం కోల్పోయాడు. ఈ క్రమంలో గురువారం తల్లి నాగలక్ష్మమ్మ(58)ను రోకలితో తలపై బాదడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. పాణ్యం సీఐ నల్లప్ప, ఎస్సై అశోక్ ఘటనా స్థలానికి చేరుకొని నిందితుడిని అరెస్ట్ చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

News July 11, 2024

మున్సిపల్ కమిషనర్‌పై నంద్యాల JC ఆగ్రహం

image

నంద్యాల మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డిపై జాయింట్ కలెక్టర్ టీ.రాహుల్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు వివాదంలో ఉన్న రైతు బజార్ పక్కన గల స్థలంలో కాంపౌండ్ వాల్ తొలగించడాన్ని JC సీరియస్‌గా తీసుకున్నారు. దీనిపై కమిషనర్‌ను JC ప్రశ్నించగా ఆయన పొంతన లేని సమాధానం చెప్పారు. దీంతో కమిషనర్‌పై JC మండిపడ్డారు. ప్రభుత్వ స్థలాలు అన్యాక్రాంతం అవుతుంటే అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.

News July 11, 2024

చిన్నారి వాసంతి గాలింపు చర్యలను పరిశీలించిన కలెక్టర్

image

ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాన్ని గురువారం నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి, జిల్లా ఎస్పీ రఘువీర్‌రెడ్డి పరిశీలించారు. 8ఏళ్ల బాలిక వాసంతిని రేప్ చేసి, కాలువలో పడేశామని నిందుతులు చెప్పడంతో గురువారం జిల్లా ఎస్పీ రఘువీర్‌రెడ్డి ఆధ్వర్యంలో కృష్ణ బ్యాక్ వాటర్‌లో ఎన్‌డీఆర్ఎఫ్ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆ ప్రాంతానికి వెళ్లి పరిశీలించారు.

News July 11, 2024

కర్నూలు: ఐటీఐలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ITI కాలేజీల్లో వివిధ ట్రేడ్‌లలో రెండో విడత ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ITI కాలేజీల జిల్లా కన్వీనర్ కృష్ణమోహన్ తెలిపారు. ఈనెల 24వ తేదీ వరకు గడువు ఉందని తెలిపారు. దరఖాస్తు చేసుకున్న వారికి 25న సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News July 11, 2024

కర్నూలు: ఈనెల 14 కోఆపరేటివ్ ఎన్నికలు

image

ఉమ్మడి కర్నూలు జిల్లా తపాలా కార్యాలయంలో కోఆపరేటివ్ ఎన్నికల కోలాహలం మొదలైంది. అభ్యర్థులు విజయం కోసం ప్రచారం ముమ్మరం చేశారు. జులై 14న కోఆపరేటివ్‌లో సభ్యులంతా కలిసి ఓటింగ్‌లో పాల్గొని డైరెక్టర్లను ఎన్నుకుంటారు. ఉమ్మడి జిల్లాలో 746 మంది సభ్యులకు ఓటు హక్కు ఉంది. 9 డైరెక్టర్ల పదవులకు 32 మంది తలపడుతున్నారు. 14న పోలింగ్, సాయంత్రం లెక్కింపు, అదేరోజు రాత్రికి ఫలితాలను ప్రకటిస్తారు.

News July 11, 2024

సరసమైన ధరలకు కందిపప్పు, బియ్యం: కలెక్టర్

image

నంద్యాలలోని పద్మావతి నగర్ రైతు బజార్‌లో నాణ్యమైన కర్నూలు సోనా బియ్యం, సార్టెక్స్ కందిపప్పు ప్రత్యేక విక్రయ కేంద్రాలను కలెక్టర్ రాజకుమారి గురువారం ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే కందిపప్పు, బియ్యం సరఫరా చేయాలని సంంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జేసీ రాహుల్ కుమార్ రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.

News July 11, 2024

పోలీసులు YCP ముసుగులు తీసేయాలి: ఎంపీ బైరెడ్డి

image

పోలీసులు YCP ముసుగులు తీసేసి ప్రజలకు సేవ చేయాలని MP బైరెడ్డి శబరి హెచ్చరించారు. ముచ్చుమర్రి వద్ద ఎత్తిపోతల పథకం పంపుహౌస్‌ సమీపంలో బాలిక ఆచూకీ కోసం కొనసాగుతున్న గాలింపును ఎంపీ బైరెడ్డి శబరి పరిశీలించి మాట్లాడారు. పాప ఆచూకీ గుర్తించాలని చెప్పడంతో పోలీసులు విచారణ చేపట్టారని, లేదంటే మామూలు కేసు నమోదు చేసి వదిలేసేవారన్నారు. ఉద్యోగం చేయడం ఇష్టం లేకపోతే సెలవుల్లో వెళ్లిపోవచ్చని సూచించారు.