Kurnool

News July 10, 2024

ఉన్నత విద్యకు 10వ తరగతి తొలి మెట్టు: నంద్యాల కలెక్టర్

image

ఉన్నత విద్యకు పదవ తరగతి తొలి మెట్టు అని, ప్రతి విద్యార్థి పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించేలా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా విద్యార్థులకు దిశా నిర్దేశం చేశారు. మంగళవారం కల్లూరు మండలం పెద్దపాడు గ్రామంలోని శ్రీ దామోదరం సంజీవయ్య స్మారక ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం విద్యార్థులను కలెక్టర్ కొన్ని ప్రశ్నలు అడిగి సమాధానం తెలుసుకున్నారు.

News July 10, 2024

రైతు నష్టపోకుండా అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోండి: నంద్యాల కలెక్టర్

image

ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో రైతులకు ఇబ్బంది లేకుండా రైతు సేవా కేంద్రాల ద్వారా నాణ్యమైన విత్తనాలను పంపిణీ చేయడంతో పాటు నకిలీ విత్తనాల అరికట్టేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ జి.రాజకుమారి వ్యవసాయ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ ఛాంబర్‌లో వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాల ప్రగతిపై సంబంధిత అధికారులతో సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు.

News July 9, 2024

మహానంది: యువకుడిపై చిరుత దాడి

image

మహానంది గ్రామ సమీపంలోని ఈశ్వర్ నగర్ కాలనీ వద్ద గిరిజనుడు నాగన్నపై చిరుతపులి దాడి చేసింది. మంగళవారం సాయంకాలం బహిర్భూమికి వెళ్లిన నాగన్నపై చిరుత దాడి చేయడంతో చాకచ్యకంగా తప్పించుకుని పారిపోయి వచ్చాడు. మీదకు దూకడంతో గాయాలయ్యాయి. ఈ విషయాన్ని గిరిజనులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. 

News July 9, 2024

నంద్యాల: రైతు బజార్లలో కంది పప్పు, బియ్యం కౌంటర్లు

image

నిత్యావసర సరుకులైన కంది పప్పు, బియ్యం ధరలు పెరుగుతున్న నేపథ్యంలో రైతుబజార్లలో కౌంటర్లు ఏర్పాటుచేసి ప్రభుత్వం నిర్ధేశించిన ధరలకే విక్రయించాలని అధికారులను జేసీ రాహుల్ కుమార్ రెడ్డి ఆదేశించారు. మంగళవారం రైస్ మిల్లర్లతో ధరల పెరుగుదలపై సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. కందిపప్పు రూ. 160, సోనా మసూరి బియ్యం(ఫైన్) రూ.49, మసూరి బియ్యం(RAW) రూ.48గా నిర్ణయించినట్లు తెలిపారు.

News July 9, 2024

ఆర్జేడీగా బాధ్యతలు స్వీకరించిన కర్నూలు డీఈవో

image

కర్నూలులోని డీఈవో కార్యాలయంలో రీజనల్ జాయింట్ డైరెక్టర్ (ఆర్జేడీ-కడప)గా కర్నూలు విద్యాశాఖ అధికారి శామ్యూల్
మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆదేశాలనుసారం రీజినల్ జాయింట్ డైరెక్టర్‌గా బాధ్యతలను స్వీకరించాలని అన్నారు. పాఠశాల విద్యను బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని అన్నారు.

News July 9, 2024

ఆదోని: విద్యుత్ షాక్‌తో బాలుడికి తీవ్రగాయాలు

image

విద్యుత్ షాక్‌‌కు గురై బాలుడు తీవ్రంగా గాయపడిన ఘటన మంగళవారం జరిగింది. ఆదోని(M) ఇస్వీ గ్రామానికి చెందిన ఈరమ్మ, బసవరాజు కుమారుడు హుసేని అంగన్వాడీ స్కూల్‌కి వెళ్లాడు. ఆడుకోవడానికి బయటికొచ్చిన బాలుడికి సమీపంలోనే ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌కి ఉన్న విద్యుత్ తీగ తగలడంతో తీవ్రగాయాలయ్యాయి. అదే సమయంలో అదృష్టవశాత్తు కరెంట్ పోవడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. బాలుడిని ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

News July 9, 2024

భారత వాయుసేనలో దరఖాస్తుల ఆహ్వానం

image

భారత వాయుసేనలో అగ్నివీర్-వాయు ఉద్యోగాలకు సంబంధించి మంగళవారం నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు సెట్కూరు సీఈవో రమణ తెలిపారు. ఇంటర్, డిప్లొమా పూర్తైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈనెల 28వ తేదీ లోగా అందజేయాలని తెలిపారు. అక్టోబరు 18వ తేదీ తర్వాత ఆన్‌లైన్‌లో అర్హత పరీక్ష ఉంటుందన్నారు. మరిన్ని వివరాలకు సెట్కూరు కార్యాలయంలో సంప్రదించాలని కోరారు.

News July 9, 2024

రన్‌వే విస్తరణకు ప్రతిపాదనలు పంపండి: కలెక్టర్

image

ఓర్వకల్లు విమానాశ్రయంలో రన్‌వే విస్తరణకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్ రంజిత్ బాషా విమానాశ్రయ అధికారులను ఆదేశించారు. సోమవారం ఓర్వకల్లు ఎయిర్ పోర్టు డెవలప్‌మెంటు అధికారులతో సమీక్షించారు. రన్‌వే విస్తరణకు కావాల్సిన నిధులు, తదితర వివరాలతో పూర్తిస్థాయిలో ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. విమానాలు రాత్రి సమయంలో దిగేందుకు అనువైన చర్యలు చేపట్టాలన్నారు.

News July 9, 2024

ప్రతి ఒక్కరూ యూనిఫాం ధరించాల్సిందే: ఎస్పీ

image

క్రైం పార్టీ అయినా, కంప్యూటర్ విధులు నిర్వహిస్తున్నా.. ప్రతి ఒక్కరూ యూనిఫాం ధరించాల్సిందేనని ఎస్పీ కృష్ణకాంత్ ఆదేశాలు జారీ చేశారు. క్రైం పార్టీ పేరుతో మఫ్టీలో తిరగడం ఇకపై కుదరదని హెచ్చరించారు. విధి నిర్వహణలో అలసత్వం వహించినా, వసూళ్లకు పాల్పడినట్లు ఫిర్యాదులు వచ్చినా చర్యలు తప్పవని హెచ్చరించారు. కర్నూలు అర్బన్ తాలుకా పోలీస్ స్టేషన్‌లో సిబ్బంది పనితీరుపై ఫిర్యాదుల నేపథ్యంలో ఈ ఆదేశాలిచ్చారు.

News July 8, 2024

పాణ్యం హత్య కేసులో నలుగురి అరెస్ట్

image

పాణ్యం మండలంలోని మద్దూరు గ్రామంలో ఈ నెల 2న జరిగిన పెద్ద దస్తగిరి (50) హత్య కేసులో సోమవారం నలుగురు ముద్దాయిలను అరెస్ట్ చేసినట్లు పాణ్యం సీఐ నల్లప్ప తెలిపారు. వడ్డే రామాంజనేయులు, హరి, శ్రీనివాసులు, రవితేజ అనే వ్యక్తులను అరెస్ట్ చేసి ఒక కారు, హత్యకు ఉపయోగించిన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ఈ కేసును త్వరితగతిన ఛేదించిన పోలీస్ సిబ్బందిని సీఐ నల్లప్ప అభినందించారు.