Kurnool

News July 3, 2024

నంద్యాల కలెక్టర్‌గా శ్రీనివాసులు తనదైన మార్క్..!

image

నంద్యాల జిల్లా కలెక్టర్‌గా డా.కే.శ్రీనివాసులు జిల్లాలో తనదైన మార్క్ వేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి 2న కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన ఆయన 5 నెలల పాటు జిల్లాకు సేవలందించారు. కలెక్టర్ హోదాలో ఆయనకు నంద్యాల తొలి పోస్టింగ్ కాగా.. జిల్లా రెండో కలెక్టర్‌గా ఆయన రికార్డు సృష్టించారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలను ఆయన సమర్థవంతంగా నడిపించారు. జూలై 1న పింఛన్ల పంపిణీలో ఆయన కీలకంగా వ్యవహరించారు.

News July 3, 2024

నంద్యాల: విధుల్లో ఉండగానే టీచర్ మృతి

image

విధుల్లో ఉన్న ఉపాధ్యాయుడు మంగళవారం ఒక్కసారిగా కుప్పకూలి మృతిచెందారు. ఆత్మకూరులో నివాసముంటున్న జీ.నాగలక్ష్మయ్య(58) కొత్తపల్లి మండలం కొత్తమాడుగుల ప్రభుత్వ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్నారు. భోజన విరామ సమయంలో ఛాతిలో నొప్పి రావడంతో కుప్పకూలిపోయారు. అపస్మారక స్థితిలో ఉన్న నాగలక్ష్మయ్యను తోటి ఉపాధ్యాయులు ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

News July 3, 2024

BREAKING: నంద్యాలలో రైలు నుంచి కిందపడి ఇద్దరి మృతి

image

నంద్యాలలోని మూలసాగరం రైల్వే గేటు వద్ద బుధవారం ఉదయం రైలు నుంచి జారి పడి ఇద్దరు మృతి చెందారు. ప్రమాదవశాత్తూ జారిపడి మృతి చెంది ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతిచెందిన వారి వివరాలు తెలియాల్సి ఉంది.

News July 3, 2024

నంద్యాల: ఆర్టీసీ బస్సు, బైక్ ఢీ.. వ్యక్తి మృతి

image

నందికొట్కూరు మండలం బ్రాహ్మణకొట్కూరు సమీపంలో మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతిచెందాడు. కర్నూలు నుంచి వస్తున్న ఒంగోలు ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు బ్రాహ్మణకొట్కూరు సమీపంలో బైక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో రవి(35) చెందాడు. ఎస్సై సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నందికొట్కూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

News July 3, 2024

నంద్యాల: విధుల్లో ఉండగానే టీచర్ మృతి

image

విధుల్లో ఉన్న ఉపాధ్యాయుడు ఒక్కసారిగా కుప్పకూలి మంగళవారం మృతిచెందారు. ఆత్మకూరులో నివాసముంటున్న జీ.నాగలక్ష్మయ్య(58) కొత్తపల్లి మండలం కొత్తమాడుగుల ప్రభుత్వ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్నారు. భోజన విరామ సమయంలో ఉన్నఫళంగా ఛాతిలో నొప్పి రావడంతో కుప్పకూలిపోయారు. అపస్మారక స్థితిలో ఉన్న ఉపాధ్యాయుడిని తోటి ఉపాధ్యాయులు ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

News July 3, 2024

కర్నూలు: హిజ్రాలకు గుర్తింపు కార్డులు

image

కర్నూలు జిల్లాలో నివాసం ఉంటున్న హిజ్రాలకు ధ్రువపత్రాలు, గుర్తింపు కార్డులను అందించేందుకు చర్యలు చేపట్టినట్లు విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు రయిస్ ఫాతిమా తెలిపారు. ఇప్పటి వరకు వాటిని పొందని వారు http://transgender.dosje.gov.inలో ఆధార్ కార్డు, నోటరీ అఫిడవిట్ పొందుపరిస్తే కలెక్టర్ ద్వారా ధ్రువపత్రాలు, గుర్తింపు కార్డులను అందిస్తామన్నారు.

News July 3, 2024

నంద్యాల నూతన కలెక్టర్ ప్రస్థానం

image

నంద్యాల జిల్లా నూతన కలెక్టర్‌గా బీ.రాజకుమారి నియమితులయ్యారు. శ్రీకాకుళం (D) టెక్కలి మండలం కొల్లివలస ఆమె స్వస్థలం. 2009 గ్రూప్‌-1 అధికారి అయిన ఈమె విజయనగరం ఆర్డీవోగా ఎంపికయ్యారు. 2013లో సింహాచలం దేవస్థానం స్పెషల్ డీసీగా, 2017లో తూ.గోలో డ్వామా పీడీగా, 2019లో అదే జిల్లాకు JC(వెల్ఫేర్)గా పని చేశారు. 2021లో IAS హోదా పొందారు. ప్రస్తుతం గుంటూరు JCగా ఉన్న ఈమె నంద్యాల కలెక్టర్‌గా బదిలీ అయ్యారు.

News July 3, 2024

పొదుపు ఉద్యమానికి అంతర్జాతీయ ఖ్యాతి: కలెక్టర్

image

ఓర్వకల్లులో సాగిన పొదుపు ఉద్యమం అంతర్జాతీయ స్థాయి ఖ్యాతి పొందిందని కలెక్టర్ రంజిత్ బాషా, ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఓర్వకల్లులోని బాలభారతి పాఠశాల మైదానంలో మండల పొదుపు లక్ష్మీ ఐక్య సంఘం రజతోత్సవ మహాసభ కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. మగవాళ్లు చదువుకుంటే ఆ కుటుంబం పైకి వస్తుందని, ఒక మహిళ చదువుకుంటే ఇంటితో పాటు సమాజంలో ఉన్న వారందరూ పైకి వస్తారని అన్నారు.

News July 2, 2024

BIG BREAKING: నంద్యాల జిల్లా కలెక్టర్‌గా రాజకుమారి

image

నంద్యాల జిల్లా కలెక్టర్‌గా బీ.రాజకుమారి నియమితులయ్యారు. 2016 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన ఆమె ప్రస్తుతం గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుత కలెక్టర్ డా.కే.శ్రీనివాసులు బదిలీ అయ్యారు. కాగా ప్రభుత్వం ఆయనకు ఇంకా ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు.

News July 2, 2024

నంద్యాల: వర్షాలు కురవాలని కప్పలకు పెళ్లిళ్లు

image

వర్షాలు కురవాలని డోన్ మండలం గుమ్మకొండ గ్రామస్థులు మంగళవారం కప్పలకు పెళ్లిళ్లు చేశారు. పాటలు పాడుతూ గ్రామంలోని ప్రతి ఇంటికీ తిరుగుతూ కప్పలకు నీటిని పోస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. సకాలంలో వర్షాలు కురవకపోవడం వల్ల పొలాలలో విత్తనాలు, దుక్కులు వేసిన రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.