Kurnool

News January 19, 2025

ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలి: ఏఐవైఎఫ్

image

రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయాలని ఏఐవైఎఫ్ నంద్యాల జిల్లా కార్యదర్శి నాగరాముడు డిమాండ్ చేశారు. వచ్చే నెల 6, 7, 8, 9వ తేదీలలో శ్రీకాకుళంలో జరిగే ఏఐవైఎఫ్ 22వ రాష్ట్ర మహాసభలకు నంద్యాల జిల్లా నుంచి యువతీ, యువకులు తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. శనివారం నంద్యాలలోని సీపీఐ కార్యాలయంలో నాయకులతో కలిసి కరపత్రాలను ఆవిష్కరించారు.

News January 18, 2025

పశు ఆరోగ్య శిబిరాల పోస్టర్లు ఆవిష్కరించిన కలెక్టర్

image

నంద్యాలలోని కలెక్టరేట్ కార్యాలయంలో ఉచిత పశు ఆరోగ్య శిబిరాల పోస్టర్లను శనివారం DAHO డా.గోవింద్ నాయక్‌తో కలిసి కలెక్టర్ జీ.రాజకుమారి ఆవిష్కరించారు. ఈనెల 20వ తేదీ నుంచి 31వ తేదీ వరకు జిల్లాలోని వివిధ గ్రామాల్లో నిర్వహించే ఈ ఉచిత పశు ఆరోగ్య శిబిరాలను పాడి రైతుల సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.

News January 18, 2025

ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి: కలెక్టర్

image

ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని జిల్లా కలెక్టర్ పీ.రంజిత్ బాషా పిలుపునిచ్చారు. శనివారం ‘స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ దివాస్’ కార్యక్రమంలో భాగంగా గూడూరు మండల కేంద్రంలోని అన్న క్యాంటీన్ ప్రాంగణంలో కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరితో కలిసి మొక్కలు నాటారు. అనంతరం అన్న క్యాంటీన్ నుంచి అంబేడ్కర్ సర్కిల్ వరకు అవగాహన ర్యాలీ చేపట్టారు.

News January 18, 2025

మంత్రి ఫరూక్‌పై సీఎం అసంతృప్తి!

image

మంత్రులు, ఎంపీలతో సమావేశమైన సీఎం చంద్రబాబు నాయుడు వారి పనితీరు ఆధారంగా ర్యాంకులు ప్రకటించారు. సోషల్ మీడియాను వినియోగించుకోవడంలోనూ మార్కులు ఇచ్చారు. ప్రభుత్వ కార్యక్రమాలను సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేయడంలో మంత్రి ఫరూక్ వెనుకబడ్డారని సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రత్యేకంగా పీఆర్వో, ఉద్యోగులను ఇచ్చినా చివరిస్థానంలో నిలవడం సరికాదరి, ఈసారి ర్యాంకు మెరుగవ్వాలని సూచించారు.

News January 18, 2025

రాష్ట్రస్థాయి వాలీబాల్ విజేత వైజాగ్ జట్టు

image

శ్రీశైల మండల కేంద్రమైన సున్నిపెంటలో నిర్వహించిన రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీల్లో వైజాగ్ జట్టు విజేతగా నిలిచింది. సంక్రాంతి పండుగ సందర్భంగా సున్నిపెంట యూత్ ఆధ్వర్యంలో సెంట్రల్ లొకాలిటీ పాఠశాలలో 4 రోజులుగా వాలీబాల్ పోటీలు నిర్వహించారు. రన్నర్‌గా గంగావతి టీమ్, 3వ స్థానంలో కర్నూలు, 4వ స్థానంలో అనంతపురం టీంలు నిలిచాయి. ఆ జట్లకు నిర్వాహకులు నగదుతో పాటు కప్పులను అందజేశారు.

News January 18, 2025

మంత్రి ఫరూక్‌పై సీఎం అసంతృప్తి!

image

మంత్రులు, ఎంపీలతో సమావేశమైన సీఎం చంద్రబాబు నాయుడు వారి పనితీరు ఆధారంగా ర్యాంకులు ప్రకటించారు. సోషల్ మీడియాను వినియోగించుకోవడంలోనూ మార్కులు ఇచ్చారు. ప్రభుత్వ కార్యక్రమాలను సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేయడంలో మంత్రి ఫరూక్ వెనుకబడ్డారని సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రత్యేకంగా పీఆర్వో, ఉద్యోగులను ఇచ్చినా చివరిస్థానంలో నిలవడం సరికాదరి, ఈసారి ర్యాంకు మెరుగవ్వాలని సూచించారు.

News January 18, 2025

కర్నూలు, నంద్యాల జిల్లాలకు కొత్త డీఎస్పీలు

image

ఉమ్మడి కర్నూలు జిల్లాకు ఇద్దరు కొత్త డీఎస్పీలను కేటాయిస్తూ డీజీపి సీహెచ్ ద్వారకా తిరుమలరావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల శిక్షణ పూర్తి చేసుకున్న ప్రొబేషనరీ డీఎస్పీలకు పోస్టింగ్‌లు కేటాయించారు. అందులో భాగంగా ఆదోని డీఎస్పీగా మర్రిపాటి హేమలత, ఆళ్లగడ్డ డీఎస్పీగా కొలికిపూడి ప్రమోద్‌ నియమితులయ్యారు. త్వరలో వీరు బాధ్యతలు స్వీకరించనున్నారు.

News January 18, 2025

చిరంజీవి బీజేపీలో చేరట్లేదు: టీజీ వెంకటేశ్

image

మెగాస్టార్ చిరంజీవి బీజేపీలోకి వస్తున్నారన్న వార్తల్లో నిజం లేదని మాజీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్ అన్నారు. కర్నూలులో శుక్రవారం ఆయన మాట్లాడారు. ‘చిరంజీవి, పవన్ కళ్యాణ్‌కు ప్రధాని మోదీతో మంచి అనుబంధం ఉంది. బీజేపీ పెద్దలతో చిరంజీవి స్నేహపూర్వకంగా ముందుకు వెళ్తున్నారు. అంత మాత్రాన పార్టీలో చేరుతారని ఎలా చెబుతారు. కొందరు పనిగట్టుకు ఇలాంటి ప్రచారం చేస్తున్నారు’ అని ఆయన పేర్కొన్నారు

News January 18, 2025

ప్రతి మూడో శనివారం స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివాస్: కలెక్టర్

image

పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఈనెల 18న జిల్లా వ్యాప్తంగా స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ-దివాస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జీ.రాజకుమారి వెల్లడించారు. ప్రతి నెల మూడో శనివారం స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివస్ కార్యక్రమాలను అన్ని నివాసిత ప్రాంతాలు, పంచాయతీలు, ప్రభుత్వ, ప్రైవేటు సెక్టార్లలో పరిశుభ్రత కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

News January 17, 2025

‘ఎన్నికల ప్రక్రియను అడ్డుకోవడం సమంజసం కాదు’

image

విజయ డెయిరీలో అప్రజాస్వామికంగా ఎన్నికల ప్రక్రియను అడ్డుకోవడం సమంజసం కాదని వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి అన్నారు. శుక్రవారం పార్టీ నేతలతో కలిసి ఆయన మాట్లాడుతూ.. టీడీపీ వర్గీయులు పాల ఉత్పత్తి కర్మాగారం వద్ద దౌర్జన్యం చేసి నామినేషన్లను వేయకుండా అడ్డుకోవడం ప్రజాస్వామ్యంలో మంచిది కాదన్నారు. దౌర్జన్యాలకు దిగి ఎన్నికలను అడ్డుకోవడం ద్వారా ఎన్నికలకు విలువ లేకుండా పోతుందన్నారు.