Nellore

News May 15, 2024

నెల్లూరు రూరల్ రూలర్ ఎవరో..?

image

నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని ఏలబోయే నాయకుడెవరనేది తీవ్ర ఉత్కంఠగా మారింది. జిల్లాలో నువ్వా-నేనా అన్నట్లు పోటీపడుతున్న స్థానాల్లో రూరల్ ఒకటి. 66.18 శాతం మంది ఓటర్లు ఓటు వేశారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఆదాల ప్రభాకర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్ని ప్రయత్నాలు చేశారు. ప్రజలు మాత్రం సైలెంట్‌గా ఓటేసి తమ బాధ్యతను నిర్వర్తించారు. జూన్ 4 తర్వాత రూరల్ రూలర్ ఎవరో తేలనుంచి.

News May 15, 2024

NLR: నేటి నుంచి ఇంటర్ అడ్మిషన్లు

image

నెల్లూరు జిల్లాలోని అన్ని జూనియర్ కళాశాలల్లో బుధవారం నుంచి అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. మొదటి సంవత్సరం కోర్సుల్లో తొలిదశ ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు ఇంటర్ బోర్డు ఆర్ఐఓ శ్రీనివాసులు తెలిపారు. 21వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారని, 22 నుంచి జూన్ 1వ తేదీ వరకు అడ్మిషన్లు ఇస్తామన్నారు. జూన్ 1 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని వెల్లడించారు. రెండో దశ అడ్మిషన్లు జూన్ 10 నుంచి జూలై 1 వరకు ఉంటాయి.

News May 15, 2024

నెల్లూరులో నెగ్గేదెవరో..!

image

నెల్లూరు సిటీ నియోజకవర్గ విజేత ఎవరనే అంశంపై ఆసక్తికర చర్చ సాగుతోంది. గతానికి భిన్నంగా భారీ స్థాయిలో 70.20 శాతం పోలింగ్ నమోదైంది. గతంలో చేసిన అభివృద్ధే పొంగూరు నారాయణను గెలిపిస్తుందని టీడీపీ శ్రేణులు చెబుతుండగా, వైసీపీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఖలీల్‌ను విజేతగా నిలుపుతాయని ఆ పార్టీ నేతలు వాదిస్తున్నారు. ఎప్పుడూ లేని విధంగా భారీగా పోలైన ఓట్లు అంతిమంగా ఎవరిని విజేతగా నిలుపుతాయో..?

News May 15, 2024

పెరిగిన పోలింగ్ శాతం.. ఎవరికి లాభం?

image

సర్వేపల్లిలో 2019లో 82.42 శాతం పోలింగ్ నమోదు కాగా ఈసారి 83.39 శాతం నమోదైంది. పాత ప్రత్యర్థులు కాకాణి గోవర్ధన్ రెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి హోరాహోరీగా తలపడ్డారు. కాకాణికి ప్రచారంలో కుమార్తె పూజిత అండగా నిలవగా, సోమిరెడ్డికి మద్దతుగా కుమారుడు రాజగోపాల్ రెడ్డి, కోడలు శృతిరెడ్డి, కుమార్తె సింధుతో పాటు పలువురు విస్తృతంగా ప్రచారం చేశారు. పెరిగిన 0.97 శాతం పోలింగ్ ఎవరిని గట్టెక్కిస్తుందో..?

News May 15, 2024

పాశం సునీల్‌కు గాయం.. రవిచంద్ర పరామర్శ 

image

చిల్లకూరులోని పోలింగ్ కేంద్రం వద్ద సోమవారం ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో గూడూరు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ అభ్యర్థి పాశం సునీల్ కుమార్ చేతికి స్వల్ప గాయమైంది. ఈక్రమంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర మంగళవారం ఆయనను పరామర్శించారు. జరిగిన ఘటనపై ఆరా తీశారు. గూడూరు నియోజకవర్గంలో పోలింగ్ సరళిపైనా చర్చించారు.

News May 14, 2024

సర్వేపల్లి స్ట్రాంగ్ రూమ్‌‌కు సీల్

image

సర్వేపల్లి నియోజకవర్గంలో చెదురుమదురు ఘటనలు తప్ప పోలింగ్ ప్రశాంత వాతావరణంలో ముగిసింది. అన్ని పోలింగ్ కేంద్రాల నుంచి ఈవీఎంలను పకడ్బందీ భద్రత మధ్య నెల్లూరు రూరల్ మండలం కనుపర్తిపాడులోని ఓ ఇంజినీరింగ్ కళాశాలకు తరలించారు. ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్‌కు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో అధికారులు సీల్ వేశారు.

News May 14, 2024

క్రాస్ ఓటింగ్ ఎవరి కొంప ముంచేనో..?

image

నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో భారీగా క్రాస్ ఓటింగ్ జరిగిందనే ప్రచారం ప్రధాన పార్టీల అభ్యర్థులను కలవరపెడుతోంది. పలు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఎమ్మెల్యే ఓటు ఓ పార్టీకి, ఎంపీ ఓటు మరో పార్టీకి వేసినట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థికి గణనీయంగా ఓట్లు పోలైనట్లు అంచనా వేస్తున్నారు. ఈక్రమంలో క్రాస్ ఓటింగ్ ఎవరి విజయ అవకాశాలను దెబ్బతీస్తుందోనని చర్చ జరుగుతోంది.

News May 14, 2024

నెల్లూరు: బస్సుల కోసం నిరీక్షణ

image

నెల్లూరు జిల్లాలో ఓటింగ్ ప్రక్రియ ముగిసింది. హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు తదితర ప్రాంతాల నుంచి వచ్చిన ఓటర్లు తిరుగు ప్రయాణమయ్యారు. ఈక్రమంలో కావలి, నెల్లూరు, గూడూరు, ఆత్మకూరు తదితర బస్టాండ్‌ల ప్రాంగణంలో రద్దీ నెలకొంది. ఉదయగిరి నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు బస్సులు లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు.

News May 14, 2024

గూడూరు: ఒక ఓటే తనకు అవకాశం

image

గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ ఈ ఎన్నికల్లో బీజేపీ తిరుపతి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఈక్రమంలో ఆయన నిన్న గూడూరులో ఓటు వేశారు. స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థిగా టీడీపీ నుంచి పాశం సునీల్ కుమార్ పోటీలో ఉండటంతో ఇక్కడ బీజేపీ ఎన్నికకు దూరంగా ఉంది. ఫలితంగా వరప్రసాద్ గూడూరులో తన పార్టీ(బీజేపీ)కి ఓటు వేసే అవకాశం లేకుండా పోయింది. మరొక ఓటు(ఎంపీ) తనకు తాను వేసుకునే ఛాన్స్ వచ్చింది.

News May 14, 2024

NLR: ఓటేయని ఎమ్మెల్యే అభ్యర్థి

image

నెల్లూరు జిల్లాలో ఓ MLA అభ్యర్థి ఓటు హక్కు వినియోగించుకోలేకపోయారు. వివరాల్లోకి వెళ్తే.. ప్రకాశం జిల్లా కనిగిరి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న బుర్రా మధుసూదన్ యాదవ్‌ను నెల్లూరు జిల్లా కందుకూరు వైసీపీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. నిన్న పోలింగ్ సరళిని పరిశీలించడానికి కందుకూరులో విస్తృతంగా పర్యటించారు. ఈక్రమంలో ఆయన కనిగిరికి వెళ్లి ఓటు వేయలేకపోయారు. బుర్రా తీరుపై పలువురు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.