India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
స్వచ్చతా హి సేవ కార్యక్రమంలో భాగంగా నెల్లూరు జిల్లా పరిషత్ ఆవరణలో బుధవారం కలెక్టర్ ఆనంద్, ZP చైర్ పర్సన్ ఆనం అరుణమ్మ, జిల్లా అధికారులు మొక్కలు నాటారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఈనెల 17 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు స్వచ్ఛత హి సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. జిల్లాలో పారిశుద్ధ్యం నిర్వహణ, వ్యర్థ పదార్థాలను డంపింగ్ యార్డులకు తరలించడం తదితర కార్యక్రమాలు చేపట్టేమన్నారు.
సంగం మండలం పడమటి పాలెంలో మంగళవారం అప్పుల బాధ తట్టుకోలేక ఏఎస్ పేట పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న రమేశ్ పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్న విషయం తెలిసిందే. కుటుంబసభ్యులు హుటాహుటిన నెల్లూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం కానిస్టేబుల్ రమేశ్ మృతి చెందాడు. ఆర్థిక ఇబ్బందులే కారణమని కుటుంబ సభ్యులు తెలిపారు.
ఏఎస్ పేటలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న రమేశ్ సంగం మండలం పడమటిపాలెంలో మంగళవారం సాయంత్రం పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఆత్మహత్యాయత్నానికి వ్యవసాయంలో వచ్చిన నష్టాలు, ఆర్థిక ఇబ్బందులే కారణమని పోలీసులు భావిస్తున్నారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం బుచ్చి నుంచి నెల్లూరుకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. రమేశ్ స్వగ్రామం విడవలూరు.
జవహర్ నవోదయ విద్యాలయాల్లో 6వ తరగతిలో చేరేందుకు నిర్వహించే ప్రవేశ పరీక్షకు దరఖాస్తు గడువును సెప్టెంబర్ 23వ తేదీ వరకు పొడిగించినట్లు నవోదయ ప్రిన్సిపల్ శ్రీనివాసరావు తెలిపారు. జిల్లాలోని 5వ తరగతి చదువుతున్న విద్యార్థులంతా ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇతర వివరాలు, సూచనలు, సలహాలు కొరకు 08985007588, 63004 29938 నంబర్లను సంప్రదించాలని కోరారు.
కావలి మండలం తాళ్లపాలెం వద్ద మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. మంచాల శ్రీకాంత్, సుబ్బారావు అనే ఇద్దరు వ్యక్తులు కావలి మండలం జువ్విగుంటపాలెం నుంచి కావలి వస్తుండగా తాళ్లపాలెం వద్ద లారీ వేగంగా వచ్చి బైక్‌ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో సుబ్బారావు నడుముపై లారీ టైర్ ఎక్కడంతో అక్కడికక్కడే మృతి చెందగా.. శ్రీకాంత్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. శ్రీకాంత్‌ను చికిత్స కోసం నెల్లూరుకు తరలించారు.
నెల్లూరు జిల్లాలోని పంటల నమోదులో చేయాల్సిన ఈక్రాప్ బుకింగ్ ఈకేవైసీ గడువు ఈనెల 25 వరకు పొడిగించినట్లు జిల్లా వ్యవసాయ శాఖ అధికారిణి సత్యవాణి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 15వ తేదీతో ముగిసిందని జిల్లాలో చాలాచోట్ల నమోదులో కాలేదని దీంతో గడువు పెంచినట్లు తెలిపారు. జిల్లాలోని వివిధ పంటలు వేసిన రైతులు ఈ క్రాప్ బుకింగ్ తో పాటు ఈ కేవైసీ నమోదు చేసుకోవాలని కోరారు.
అనంతసాగరం(M), కమ్మవారిపల్లికి చెందిన ఆర్ వెంకటేశ్వర్లు(46) కువైట్‌లో సూసైడ్ చేసుకున్నాడు. కుటుంబసభ్యుల వివరాల ప్రకారం.. వెంకటేశ్వర్లు నాలుగేళ్లుగా కువైట్‌లో ఓ సేట్ వద్ద పనిచేస్తున్నాడు. అయతే ఆ సేట్ కొన్నినెలలుగా వేతనం ఇవ్వకపోవడంతో ఆర్థికంగా ఇబ్బంది పడ్డాడు. అప్పుల బాధ తట్టుకోలేక ఆ ఇంట్లోనే ఫ్యానుకు ఉరేసుకుని మృతి చెందాడు. సోమవారం అతని మృతదేహాన్ని కమ్మవారిపల్లికి తీసుకొచ్చి అంత్యక్రియలు చేశారు.
మున్సిపల్ శాఖ మంత్రి నారాయణను టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గ విలీన గ్రామాల్లో అభివృద్ధి పనులకు సంబంధించి ఆయన దృష్టికి తీసుకెళ్లారు. మంత్రి సానుకూలంగా స్పందించారని కోటంరెడ్డి తెలిపారు.
తెలంగాణ వరద బాధితులకు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి అండగా నిలిచారు. ఈ మేరకు సోమవారం ఆయన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి రూ.25 లక్షల చెక్కును అందించారు. ఇటీవల వరదలతో ప్రజలు ఇబ్బందులకు గురవడంతో వారి సహాయార్థం సాయం అందించానన్నారు.
నెల్లూరు రూరల్ పరిధిలోని ఒకటో డివిజన్ కార్పొరేటర్ జానా నాగరాజ గౌడ్, రెండో డివిజన్ కార్పొరేటర్ రామ్మోహన్ యాదవ్ సోమవారం రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సమక్షంలో టీడీపీలో చేరారు, వారందరికీ ఎమ్మెల్యే టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు, ఈ కార్యక్రమంలో రూరల్ టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పాల్గొన్నారు
Sorry, no posts matched your criteria.