India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
హెల్మెట్ వ్యక్తి ప్రాణాలు కాపాడిన ఘటన నెల్లూరులో జరిగింది. పోలీసుల కథనం మేరకు.. వెంకటాచలం(M) నిడిగుంటపాలెంకు చెందిన సుబమ్మ(58), భర్త ప్రసాద్ సోమవారం విడవలూరు(M) వావిళ్ల నుంచి బైక్‌పై వెంకటాచలం బయలుదేరారు. నెల్లూరు సమీపంలోని ప్రశాంత్ నగర్ కూడలి హైవే వద్దకు రాగానే వెనుక నుంచి టిప్పర్ బైక్‌ను ఢీకొంది. ఈ ఘటనలో సుబ్బమ్మ అక్కడికక్కడే మృతి చెందగా, భర్త హెల్మెట్ ధరించడంతో స్పల్పగాయాలతో బయటపడ్డారు.
నెల్లూరులో రోడ్డు ప్రమాదం జరిగింది. నెల్లూరు నగరంలోని అయ్యప్పగుడి నుంచి మినీ బైపాస్‌కు ఫ్లైఓవర్ మీదుగా ఓ పాఠశాల బస్సు వెళ్తోంది. ఫ్లైఓవర్ దిగగానే బస్సు డ్రైవరుకు మూర్ఛ వచ్చింది. ఈక్రమంలో అదుపుతప్పి రోడ్డు పక్కన పార్కింగ్ చేసిన ఐదు కార్లను వెనువెంటనే ఢీకొంది. బస్సులో ఉన్న ఓ మహిళ కిందపడిపోయారు. స్థానికులు డ్రైవరును ఆసుపత్రికి తరలించారు. దెబ్బతిన్న కార్లలోనూ ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది.
బారా షాహిద్ దర్గా రొట్టెల పండుగకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సంబంధిత శాఖల అధికారులను జిల్లా కలెక్టర్ ఆనంద్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని తిక్కన ప్రాంగణంలో రొట్టెల పండుగ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు మున్సిపల్ కమీషనర్ వికాస్ మర్మత్‌తో పాటు వివిధ శాఖల అధికారుల పాల్గొన్నారు.
నెల్లూరు కలెక్టరేట్‌లోని తిక్కన ప్రాంగణంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహించారు. కలెక్టర్ ఆనంద్ ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు అవసరమైన సేవలు అందించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పట్ల నిర్లక్ష్యం వద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఐటి శాఖ మంత్రి నారా లోకేశ్‌తో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సోమవారం అమరావతిలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. కోటంరెడ్డిని నారా లోకేశ్ ఆప్యాయంగా పలకరించారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం అభివృద్ధి పనులకు సంబంధించి పలు అంశాలను కోటంరెడ్డి ఆయన దృష్టికి తీసుకువెళ్లారు.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి ఆయనతో ఉన్న జ్ఞాపకాలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. వైఎస్సార్‌తో కలిసి ఉన్న ఓ ఫోటోను షేర్ చేస్తూ మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఇవే మా ఘన నివాళులంటూ ఆయన పేర్కొన్నారు.
రైలు పట్టాలు దాటుతుండగా ప్రమాదవశాత్తు రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన వేదాయపాళెం రైల్వే స్టేషన్ సమీపంలో ఆదివారం జరిగింది. ఘటనా స్థలాన్ని పరిశీలించిన రైల్వే పోలీసులు మృతుడి వయసు సుమారు 55 ఏళ్ల వరకు ఉంటుందని భావిస్తున్నారు. మృతదేహాన్ని జీజీహెచ్ మార్చురీకి తరలించి.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.
ఉద్యోగం కోసం వెళ్తున్న వ్యక్తి రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. గూడూరు బాలాజీనగర్‌కు చెందిన సురేశ్‌కుమార్(44) ఓ కళాశాలలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తూ నిలిచిపోయాడు. ఈక్రమంలో ఉద్యోగం కోసం మిత్రుడు ప్రశాంత్‌తో కలిసి నెల్లూరుకి స్కూటీపై బయల్దేరారు. బెంగళూరు నుంచి కందుకూరు వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు కొమ్మలపూడి వద్ద హైవేపై ఢీకొట్టడంతో సురేశ్ అక్కడికక్కడే మృతి చెందగా ప్రశాంత్‌కు గాయాలయ్యాయి.
నెల్లూరు జిల్లాకు చెందిన SC, ST, BC కులాలకు చెందిన DSC అభ్యర్థులకు నెల్లూరులోని BC స్టడీ సర్కిల్ ద్వారా ఉచిత శిక్షణ ఇవ్వనున్నారని ఆ శాఖ అధికారి వెంకటయ్య తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఈనెల 10తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని, శిక్షణ కాలంలో రూ.3 వేలు స్టైపెండ్, స్టడీ మెటీరియల్ అందజేస్తారన్నారు. వివరాలకు నగరంలోని ఆర్టీసీ బస్టాండు సమీపంలోని బీసీ స్టడీ సర్కిల్‌లో సంప్రదించాలని అన్నారు.
బుచ్చిరెడ్డిపాలెం మండలం సల్మాన్ పురం గ్రామం సమీపంలో కారు అదుపుతప్పి కాలువలోకి దూసుకుపోయింది. అయితే కారులో ప్రయాణిస్తున్న వారికి ఎటువంటి ప్రాణాపాయం జరగలేదని స్థానికులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Sorry, no posts matched your criteria.