India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నెల్లూరు జిల్లా పరిధిలో నేడు అక్కడక్కడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ(APSDMA) అధికారులు తెలిపారు. ఈ మేరకు APSDMA అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రజలు, పనుల నిమిత్తం బయటకు వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
వరద బాధితులకు సాయం చేయాలంటూ ప్రముఖ సాయి శిల్పి మంచాల సనత్ కుమార్ దాతలను కోరారు. చిల్లకూరు మండలం ఏరూరు గ్రామ సముద్రతీరంలో హెల్పింగ్ హ్యాండ్‌ను సైకత శిల్పంగా తీర్చిదిద్దాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎంతోమంది ఈ వరదల వల్ల ఇబ్బందులకు గురవుతున్నారని, ప్రభుత్వం ఒకటే ఆదుకుంటే సరిపోదని, దాతలు కూడా ముందుకు రావాలని అందుకోసమే ఈ హెల్పింగ్ హ్యాండ్ తయారు చేయడం జరిగిందన్నారు.
అనంతసాగరం మండలం సోమశిల జలాశయానికి శుక్రవారం ఎగువ ప్రాంతాల నుంచి 13,053 క్యూసెక్కుల కృష్ణా జలాలు వచ్చి చేరుతున్నట్లు జలాశయ అధికారులు తెలిపారు. జలాశయం పూర్తి సామర్థ్యం 78 టీఎంసీలు కాగా ప్రస్తుతం జలాశయంలో 42.080 టీఎంసీల నీరు నిల్వ ఉంది. పెన్నా డెల్టాకు 1050 క్యూసెక్కులు, కండలేరుకు 6000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. జలాశయంలో 169 క్యూసెక్కుల నీరు ఆవిరి అవుతోంది.
ఇసుక డిమాండ్ పెరగడంతో అక్రమార్కులు సరికొత్త ఆలోచనలకు తెర తీస్తున్నారు. ఎడ్లబండ్లలో ఇసుక తరలించి దానిని ట్రక్కులకు నింపి సొమ్ము చేసుకుంటున్న ఘటన నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలంలో వెలుగు చూసింది. వాస్తవానికి బండ్లకు ఎటువంటి డబ్బులు కట్టకుండా తరలించవచ్చు. ఇదే అదునుగా భావించిన కొందరు అక్రమంగా ఇలా ఇసుక రవాణా చేస్తున్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
వ్యవసాయ సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో నకిలీ విత్తనాలు, ఎరువులను విక్రయిస్తే దుకాణ యజమానులపై చట్ట పరమైన చర్యలు చేపడతామని జిల్లా వ్యవసాయాధికారిణి సత్యవాణి హెచ్చరించారు. ఉదయగిరి వ్యవసాయ కార్యాలయంలో ఎరువుల దుకాణ యజమానులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. నిబంధనలను పాటిస్తూ దుకాణాల వద్ద ధరల పట్టికను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రికార్డులను సక్రమంగా నిర్వహించాలని సూచించారు.
ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పొదుపు మహిళల డబ్బు దాదాపు రూ.కోటికి పైగా పక్కదారి పట్టించారు. ఈ ఉదంతం డక్కిలి మండలంలో వెలుగు చూసింది. దీనిపై విచారణ చేయగా నగదు స్వాహా నిజమని తేలింది. దీనికి కారణమైన ఏడుగురిపై చర్యలు తీసుకోవాలని తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్ నెల్లూరు జిల్లా అధికారులకు లేఖ రాశారు. దీంతో డక్కలి వెలుగు కార్యాలయంలో పనిచేసే ఆ ఉద్యోగులపై నేడో, రేపో వేటు పడనుంది.
నెల్లూరు జిల్లా ASపేట మండలం గండువారిపల్లెలో క్షుద్రపూజలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. సంబంధిత ఇంటి వ్యక్తులను ఊరి నుంచి వెలివేయాలని గ్రామస్థులు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. అదే ఇల్లు గురువారం రాత్రి అగ్నిప్రమాదానికి గురైంది. వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేశారు. షార్ట్ సర్క్యూట్ జరిగిందా? స్థానికులే ఎవరైనా ఇలా చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
జిల్లా కలెక్టరేట్‌లోని తిక్కన ప్రాంగణంలో కలెక్టర్ ఆనంద్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలను ఎమ్మెల్యే ఘనంగా సత్కరించారు. సోమిరెడ్డి మాట్లాడుతూ.. గురువులు దైవ సమానులని, ఉత్తమ ఉపాధ్యాయులను తన చేతులు మీద సన్మానించడం చాలా సంతోషకరమని అన్నారు.
కలువాయి పోలీస్ స్టేషన్లో బుధవారం హెడ్ కానిస్టేబుల్ జేమ్స్ మద్యం మత్తులో రైటర్‌పై దాడి చేసి, వీరంగం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఎస్పీ కృష్ణకాంత్ సీరియస్ అయ్యారు. హెడ్ కానిస్టేబుల్ జేమ్స్‌పై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటూ ఆయనను సస్పెండ్ చేశారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.
విజయవాడ వరద బాధితుల సహాయార్థం నెల్లూరు జిల్లా రిటైర్డ్ రెవెన్యూ ఉద్యోగుల అసోసియేషన్ సభ్యులు తమ దాతృత్వం చాటుకున్నారు. గురువారం సీఎం సహాయనిధికి రూ.1,10,116 చెక్కును కలెక్టర్ ఆనంద్‌కు అందించారు. అసోసియేషన్ ట్రెజరర్ మస్తానయ్య మరో రూ.15 వేల చెక్కును అందజేశారు. రిటైర్డ్ రెవెన్యూ ఉద్యోగులను కలెక్టర్ అభినందించారు.
Sorry, no posts matched your criteria.