India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నెల్లూరు రూరల్ కలివెలపాలెం గ్రామ సర్పంచ్ పార్లపల్లి మధుసూదన్ రెడ్డి చెక్ పవర్‌ను మూడు నెలల పాటు రద్దు చేశారు. ఈ మేరకు జిల్లా పంచాయతీ అధికారి సుస్మిత ఆదేశాలు జారీ చేశారు. నిధుల దుర్వినియోగానికి సంబంధించి మధుసూదన్ రెడ్డిపై అనేక ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఉన్నతాధికారులు విచారణ జరిపారు. డివిజనల్ పంచాయతీ అధికారి ఇచ్చిన నివేదిక ఆధారంగా చెక్ పవర్ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
రాష్ట్ర యూనియన్ సూచనలు మేరకు విజయవాడలో వరద తీవ్రత దృష్ట్యా 7వ తేది జరగాల్సిన ప్రభుత్వం మద్యం దుకాణాల బంద్ తాత్కాలికంగా విరమణ ఇస్తున్నట్లు నాయుడుపేట యూనియన్ నాయకులు బుధవారం తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వ లిక్కర్ డిపో మేనేజర్‌కు వినతిపత్రం అందజేసినట్లు తెలిపారు. ప్రభుత్వ మద్యం దుకాణాలలో పనిచేసే సూపర్వైజర్లు, సేల్స్ మెన్‌లకు ఉద్యోగ భద్రత కల్పించాలని వారు డిమాండ్ చేశారు.
జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా చల్లా మల్లికార్జున్ రెడ్డి ఎంపికయ్యారు. బుధవారం జిల్లా విద్యాశాఖ అధికారులు విడుదల చేసిన జాబితాలో రాపూరు మండలం రేగడపల్లి మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాల H.Mగా పని చేస్తున్న మల్లికార్జున రెడ్డి 2024 సంవత్సరం జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికయ్యారు. ఆయన ఎంపిక పట్ల PRTU జిల్లా నాయకుడు చంద్రశేఖర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశాడు.
నెల్లూరు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి వరదబాధితులకు బాసటగా నిలిచారు. భారీ వర్షాలతో ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో వరదలతో ఇబ్బందులు పడుతున్న ప్రజల సహాయానికి రూ. 50 లక్షలు అందచేస్తున్నట్లు ప్రకటించారు. బుధవారం జిల్లా వైసీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మేకపాటి ఈ సహాయాన్ని ప్రకటించారు. ఏపీకి రూ.25 లక్షలు, తెలంగాణకు రూ.25 లక్షల వంతున మొత్తం రూ.50 లక్షలు ప్రకటించారు.
పొత్తిళ్లలో ఉండాల్సిన బాలుడిని బస్టాండులో వదిలేసి వెళ్లిన ఘటన నెల్లూరులో జరిగింది. మంగళవారం రాత్రి బస్సు కోసం ఎదురు చూస్తున్న ఇద్దరు విద్యార్థులకు ఓ మహిళ పసికందును అప్పగించి బాత్రూంకి వెళ్లి వస్తానని చెప్పి అటునుంచి అటే వెళ్లిపోయింది. ఎంత సేపటికీ రాకపోవడంతో విద్యార్థులు ఆ బిడ్డను ఆర్టీసీ డీఎం, ఓ లాయర్ సహాయంతో శిశు గృహానికి తరలించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
నెల్లూరు జిల్లాలో ట్రైబల్ వెల్ఫేర్ సబ్ ప్లాన్‌ను సక్రమంగా అమలు చేసేందుకు ఆయా శాఖలు ప్రతిపాదనలు రూపొందించాలని కలెక్టర్ ఆనంద్ పేర్కొన్నారు. ఆయన మంగళవారం కలెక్టరేట్లో సబ్ ప్లాన్ అమలుకు అధికారులతో సమావేశం నిర్వహించారు. ఎస్టీల కోసం ప్రభుత్వం శాఖల వారీగా నిధులు కేటాయిస్తుందన్నారు. STల ప్రాంతాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి సారించాలన్నారు.
విజయవాడలో వరద ఉద్ధృతి తగ్గుతోందని మంత్రి నారాయణ అన్నారు. మున్సిపల్ కమిషనర్లతో మంత్రి నారాయణ సమీక్షా సమావేశం నిర్వహించారు. కాలువల్లో పెద్దఎత్తున పూడిక పేరుకుపోయిందని, రోడ్లపైన భారీగా మట్టి, ఇసుక చేరిందన్నారు. ముంపు ప్రాంతాల్లోని బాధితులను బయటకి తీసుకొచ్చినట్లు తెలిపారు. పారిశుద్ధ్య నిర్వహణకు 10 వేల మంది కార్మికులు అవసరమని అన్నారు. వరద ప్రాంతాల్లో మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నామన్నారు.
నెల్లూరులోని శ్రీ ఇరుకళల పరమేశ్వరి దేవస్థానం వద్ద గణేష్ నిమజ్జనానికి పటిష్ట భద్రత ఏర్పాటు చేయనున్నట్లు ఎస్పీ కృష్ణకాంత్ తెలిపారు. గణేష్ ఘాట్ లో ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. నిమజ్జనోత్సవం ప్రశాంతంగా సాగేందుకు ఉత్సవ కమిటీలు, శాంతి కమిటీల సభ్యులు సమన్వయంతో పనిచేసి పోలీసులకు సహకరించాలని కోరారు.
నెల్లూరు జిల్లా ఏఎస్ పేట మండల కేంద్రంలోని గండువారి పల్లి స్కూల్లో క్షుద్ర పూజలు కలకలం రేపింది. ఉదయాన్నే పాఠశాలకు వచ్చిన విద్యార్థులు ముగ్గులు వేసి క్షుద్ర పూజలు చేసిన ఘటనను చూసి భయాందోళన గురయ్యారు. దీంతో విద్యార్థులు స్కూల్లోకి వెళ్లేందుకు భయభ్రాంతులకు గురవుతున్నారు. పాఠశాల యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించారు. నలుగురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖలో వాత్సల్య పథకం ద్వారా నెల్లూరు, కందుకూరులో ఉన్న బాలసదన్‌లో ఖాళీగా ఉన్న పోస్టులను తాత్కాలిక పద్దతిలో భర్తీ చేస్తున్నట్లు PD హేనా సుజన్ తెలిపారు. వంట, సహయకులు, రాత్రి వాచ్‌మెన్, క్రీడా శిక్షకురాలు, యోగా, పాఠాల బోధన, క్రాఫ్ట్, ఆర్ట్, మ్యూజిక్ టీచర్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నామన్నారు. ఈనెల 10వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని, వివరాలకు ICDS కార్యాలయంలో సంప్రదించాలని కోరారు.
Sorry, no posts matched your criteria.