Nellore

News April 28, 2024

ALERT.. నెల్లూరులో 41.1 డిగ్రీల ఉష్ణోగ్రత

image

భానుడి ప్రతాపానికి శనివారం నెల్లూరు జిల్లా ప్రజలు అల్లాడిపోయారు. తిరుపతి 42.9, నెల్లూరులో 41.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ప్రజలు జాగ్రత్తలు పాటించాలని, అవసరమైతే తప్ప మధ్యాహ్నం బయటకు రావద్దని నిపుణులు సూచిస్తున్నారు.

News April 28, 2024

రాజకీయ ప్రచార వాహనాలకు అనుమతి తప్పనిసరి

image

రాజకీయ పార్టీలు, అభ్యర్థులు అనుమతి లేకుండా వాహనాలను
ప్రచారానికి వినియోగించారదని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి M. హరి నారాయణన్ తెలిపారు.  ఆయన మాట్లాడుతూ.. అనుమతి పొందిన వాహనాలు అనుమతి పత్రం( పర్మిషన్) వాహనం ముందు భాగంలో అతికించాలన్నారు . FST/SST టీమ్ లు ప్రచార వాహనాలకు అనుమతులు ఉన్నాయో లేదో తనిఖీ చేస్తామన్నారు.

News April 28, 2024

వెంకటగిరిలో జోరుగా ఏర్పాట్లు

image

సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదివారం మధ్యాహ్నం వెంకటగిరి పట్టణానికి విచ్చేస్తున్నారు. ఈ సందర్భంగా వెంకటగిరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడుతున్నారు.

News April 28, 2024

ఏపీ సెట్ – 24కు సర్వం సిద్ధం

image

ఏపీ సెట్ – 2024 పరీక్ష ఆదివారం ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరగనుంది. విక్రమ సింహపురి యూనివర్సిటీ పరిధిలో కాకుటూరులోని వర్సిటీ కళాశాల, జగన్స్ కాలేజీ, కృష్ణచైతన్య డిగ్రీ కాలేజీ, రావూస్ డిగ్రీ కళాశాల, డీకేడబ్ల్యూ కళాశాల, వీఆర్ ఐపీఎస్ లో పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు చేసినట్లు ఏపీ సెట్ ప్రాంతీయ సమన్వయకర్త వీరారెడ్డి తెలిపారు. 1767 మంది విద్యార్థులు హాజరుకానున్నట్లు ఆయన వెల్లడించారు.

News April 28, 2024

నేడు వెంకటగిరికి సీఎం జగన్ 

image

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదివారం వెంకటగిరిలో ఎన్నికల ప్రచార సభలో పాల్గొననున్నారు. మధ్యాహ్నం 1.10 గంటలకు ఆయన ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన హెలిపాడ్ లో దిగుతారు. 1.30 గంటల నుంచి 2.15 గంటల వరకు వెంకటగిరిలోని త్రిభువని సెంటరులో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం హెలికాఫ్టర్ లో కందుకూరు బయలుదేరుతారు.

News April 28, 2024

చేజర్ల : వివాహితపై యాసిడ్ దాడి

image

నెల్లూరుకు చెందిన పుట్టా మురార్జి చేజర్ల మండలం కండాపురంలో అక్క కుమార్తె సుప్రజను వివాహం చేసుకున్నాడు. కొన్నేళ్లుగా నెల్లూరులోనే నివాసం ఉంటున్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలో పుట్టింటికి వచ్చిన భార్య సుప్రజపై శనివారం బాత్ రూములు శుభ్రపరిచే యాసిడ్ తో దాడి చేశాడు. సుప్రజను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు బాధిత కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు విచారణ చేపట్టారు.

News April 27, 2024

మా ఆత్మకూరుకు ఇవి కావాలి: ఆనం

image

ఆత్మకూరు ప్రజాగళం సభలో చంద్రబాబుకు ఆనం రామనారాయణ రెడ్డి వినతులు విన్నవించుకున్నారు. ‘సోమశిల హైకెనాల్ పూర్తి చేసి సాగునీరు, తాగునీరు అందించాలి. నదికూడి శ్రీకాళహస్తి లైన్ టీడీపీ హయాంలో మొదలు పెడితే.. దానిని వైసీపీ తుంగలో తొక్కింది. మీరు పూర్తి చేయాలి. జిల్లా 100 పడకల ఆసుపత్రిని 250 పడకల ఆసుపత్రిగా అప్‌గ్రేడ్ చేయాలి. సోమశీల ప్రాజెక్టును పూర్తి చేయాలి’అని కోరారు.

News April 27, 2024

NLR: వీఎస్ఆర్ మాస్కులు ధరించిన అభిమానులు

image

నెల్లూరు సిటీ 8వ డివిజన్ లో ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి ఎండీ ఖలీల్ అహ్మద్, డివిజన్ కార్పోరేటర్ మొగలపల్లి కామాక్షి దేవి శనివారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఐదేళ్ల కాలంలో సీఎం జగన్ చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని గుర్తించి మరోసారి తమకు అవకాశం కల్పించాలని ప్రజలను కోరారు. పలువురు అభిమానులు వీఎస్ఆర్ మాస్కులు ధరించి ఆయనతో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు.

News April 27, 2024

రేపు వెంకటగిరికి ముఖ్యమంత్రి రాక

image

సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వెంకటగిరికి రానున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు నిర్వహించే బహిరంగ సభలో ఆయన పాల్గొంటారని నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి కార్యాలయ వర్గాలు తెలిపాయి. త్రిభువని కూడలి ప్రాంతంలో సభ నిర్వహణకు అవసరమైన ప్రాంతాలను స్థానిక నాయకులు పరిశీలించారు.

News April 27, 2024

నెల్లూరులో ఒకే రోజు బావబామ్మర్దుల ప్రచారం

image

సార్వత్రిక ఎన్నికల తేదీ దగ్గర పడుతున్న కొద్ది ప్రధాన పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. అందులో భాగంగా శనివారం నెల్లూరు జిల్లాలో ఇద్దరు ప్రముఖుల ప్రచార కార్యక్రమాలు జరగనున్నాయి. ఆత్మకూరు, బుచ్చిరెడ్డిపాళెంలో నారా చంద్రబాబు ఎన్నికల ప్రజాగళం సభలు నిర్వహిస్తుండగా, వెంకటగిరి నియోజకవర్గంలో ఆయన బామ్మర్ది నందమూరి బాలకృష్ణ రోడ్ షో జరగనుంది.