India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

సునామీ ఈ పేరు వింటేనే నెల్లూరు జిల్లాలోని తీర ప్రాంత గ్రామాల ప్రజలు వణికిపోతున్నారు. సరిగ్గా20 ఏళ్ల క్రితం 2004 డిసెంబర్ 26న నెల్లూరు జిల్లాలో సునామీ పంజా విసిరింది. ఈ ధాటికి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 20మంది మృతి చెందారు. కళ్లెదుటే కుటుంబ సభ్యులను పోగుట్టుకున్న పరిస్థితులను ఇప్పుడు తలచుకున్నా ఆ భయం అలానే ఉందని నెల్లూరు వాసులు పేర్కొంటున్నారు.

అల్పపీడన ప్రభావంతో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జిల్లా ప్రజలు చలిగాలులతో వణుకుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ముసురు పట్టి తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురుస్తుండడంతో గత రెండు రోజులుగా చలిగాలుల తీవ్రత ఎక్కువైంది. దీంతో వృద్ధులు పిల్లలతో పాటు సాధారణ ప్రజలు కూడా చలికి గజగజ వణికి పోతున్నారు.

నెల్లూరు జిల్లా రామాయపట్నం వద్ద భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ రూ.95 వేల కోట్లతో చమురు శుద్ధి కర్మాగారం ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించడం పట్ల మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో ఈ కర్మాగారం ఏర్పాటు వల్ల ఉపాధి అవకాశాలు, ప్రత్యక్షంగాను, పరోక్షంగా పెరుగుతాయని, విద్యావంతులకు, సాంకేతిక నైపుణ్యం ఉన్నవారికి అపారమైన అవకాశాలు వస్తాయని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.

బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్ప పీడనం కారణంగా వర్షాలు కురుస్తున్నాయి. అలాగే ఎగువ ప్రాంతాల నుంచి వరద వస్తోంది. దీంతో పులికాట్ సరస్సు జలకళను సంతరించుకుంది. సూళ్లూరుపేట నుంచి శ్రీహరికోటకు వెళ్లే మార్గంలో రోడ్డుకు ఇరువైపులా సరస్సు అలల తాకిడి పర్యాటకుల్ని కనువిందు చేస్తోంది. కొన్నిచోట్ల విహంగాలు కూడా కనిపిస్తున్నాయి.

పోలీసు కానిస్టేబుల్ అభ్యర్థుల దేహదారుఢ్య పరీక్షలను ఈనెల 30 నుంచి నిర్వహించనున్నారు. ఈ మేరకు నెల్లూరు నగరంలోని పోలీసు కవాతు మైదానంలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కానిస్టేబుల్ ఉద్యోగాలకు జిల్లాలో 20,356 మంది ప్రిలిమినరీ పరీక్షలు రాయగా వారిలో 4,600 మందికిపైగా దేహదారుఢ్య పరీక్షలకు అర్హత సాధించారు. ఈ పరీక్షలు ఈనెల 30 నుంచి జనవరి 8వ తేది వరకు నిర్వహించనున్నారు.

నెల్లూరు జిల్లాలో 10వ తరగతి విద్యార్థులు తత్కాల్ పథకం కింద ఈనెల 27 నుంచి జనవరి 10వ తేదీ వరకు ఫీజు చెల్లించవచ్చని DEO డాక్టర్ బాలాజీ రావు సూచించారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు విద్యార్థులు తత్కాల్ కింద రూ.1000 ఫైన్‌తో ఫీజు చెల్లించి పరీక్షలకు హాజరు కావచ్చన్నారు. సకాలంలో ఫీజులు చెల్లించి విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలని కోరారు.

నెల్లూరు జిల్లాలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రత్యేక కాల్ సెంటర్లు ఏర్పాటు చేసినట్లు జిల్లా వ్యవసాయ శాఖ అధికారిణి సత్యవాణి ఒక ప్రకటనలో తెలిపారు. ఎరువులు దొరక్కపోయినా, ఎక్కడైనా అధిక ధరలకు విక్రయాలు చేస్తున్న వెంటనే కాల్ సెంటర్‌కు ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. 83310 57182, 83310 57218 నంబర్లకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని కోరారు.

ప్రేమపేరుతో మోసం చేసిన యువకుడికి జైలుశిక్ష పడింది. సూళ్లూరుపేట సాయినగర్‌కు చెందిన భానుప్రకాశ్(23) ఓ బాలికను ప్రేమిస్తున్నానని చెప్పి హైదరాబాద్ తీసుకెళ్లి అక్కడ లైంగిక దాడి చేశాడు. ఈ ఘటనపై పోక్సో కేసు నమోదైంది. భానుప్రకాశ్‌తో అతడి బంధువులు వెంకటేశ్వర్లు(46), సుభాషిణి(40), స్వాతి(22), రమేశ్(29), మాలకొండయ్య(40)కు జడ్జి సిరిపిరెడ్డి సుమ పదేళ్ల జైలుశిక్ష, రూ.20 వేలు జరిమానా విధిస్తూ తీర్పుఇచ్చారు.

నైరుతి, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం బలహీనపడింది. ఈ నేపథ్యంలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో రెండో రోజులు భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇవాళ మాత్రం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇప్పటికే మారిన వాతావరణంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు చలి గాలులు పెరిగాయి. ఉదయాన్నే ఇంట్లో నుంచే రావాలంటే ప్రజలు భయపడిపోతున్నారు.

నెల్లూరు జిల్లా ప్రజలందరికీ కలెక్టర్ ఓ.ఆనంద్, ఎస్పీ జీ కృష్ణ కాంత్, జాయింట్ కలెక్టర్ కార్తీక్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రేమ, సేవాతత్పరత, క్షమా గుణాన్ని బోధించిన ఏసుక్రీస్తు జన్మదినమైన క్రిస్మస్ పండుగను అందరూ సంతోషంగా జరుపుకోవాలని కలెక్టర్ ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరు కూడా క్రీస్తు జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని నిజాయితీగా జీవించాలని, అందరం కలిసి మెలిసి ఐక్యత చాటాలన్నారు.
Sorry, no posts matched your criteria.