India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నెల్లూరు జిల్లాలో దాదాపు 3.17 లక్షల మంది పింఛన్ లబ్ధిదారులు ఉన్నారు. ఏప్రిల్ నెల నుంచే పెరిగిన పింఛన్ ఇస్తామని చంద్రబాబు చెప్పారు. ఈ నేపథ్యంలో పాత బకాయిలు రూ.3వేలతో కలిపి జులైలో ఒక్కొక్కరికీ రూ.7 వేలు చొప్పున డబ్బులు అందుతాయి. వాలంటీర్లు కాకుండా సచివాలయ సిబ్బందే ఇంటికి వచ్చి నగదు అందజేస్తారని తాజాగా మంత్రి పార్థసారథి ప్రకటించారు. పింఛన్ల పంపిణీకి వాలంటీర్లను పక్కన పెట్టడంపై మీ కామెంట్.
ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన తొలి మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. మంత్రులు పొంగూరు నారాయణ, ఆనం రామనారాయణరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రులు తమ శాఖలపై పట్టు పెంచుకునేందుకు ముఖ్యమంత్రి పలు సూచనలు చేయనున్నారు. తొలి మంత్రి వర్గ సమావేశం కావడంతో వివిధ వర్గాలకు లబ్ధి చేకురేలా పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఓ మహిళపై ఆమె ప్రియుడు దాడి చేసిన ఘటన కావలి పట్టణంలోని కచ్చేరిమిట్టలో జరిగింది. ఆదివారం ఈ మేరకు బాధిత మహిళ పోలీసులకు ఆశ్రయించింది. ఆమె భర్త మూడేళ్ల క్రితం మరణించడంతో తలకాయ రాజేశ్ కుమార్ అనే వ్యక్తితో సహజీవనం చేస్తోంది. కొన్నాళ్లుగా వీరి మధ్య విభేదాలు రావడంతో నిందితుడు దాడికి పాల్పడ్డాడు.
నెల్లూరు ఇస్కాన్ సిటీలో 25 కళా సంఘాల సినీ స్టూడియోను ఆ కళాసంఘాల అధ్యక్షుడు అమరావతి కృష్ణారెడ్డి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. నెల్లూరు జిల్లాలోని కళాకారుల ప్రతిభను చాటుకునేందుకు అనుకూలంగా స్టూడియోను ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో హైటెక్ ఫార్మా రమణారెడ్డి, నారాయణ గ్రూపు ఆఫ్ హాస్పిటల్స్ AGM సీహెచ్ భాస్కర్ రెడ్డి, నిర్మాత షంషుద్దీన్, దోర్నాల హరిబాబు, అమీర్ జాన్ తదితరులు పాల్గొన్నారు.
కుమార్తెను చూసేందుకు వస్తున్న తల్లి రోడ్డుప్రమాదంలో మృతి చెందింది. విడవలూరు(M), ముదివర్తి గ్రామానికి చెందిన లక్ష్మీనారాయణ, సరోజనమ్మ దంపతుల కుమార్తె హారిక నెల్లూరులోని రామ్మూర్తి నగర్‌లో ఉంటున్నారు. కుమార్తెను చూసేందుకు వారు బైక్‌పై వస్తుండగా NTR నగర్ వద్ద లారీ ఢీకొట్టడంతో సరోజమ్మ అక్కడికక్కడే మృతి చెందగా..లక్ష్మీనారాయణకు గాయాలయ్యాయి. భార్య విగతజీవిగా పడిఉండడం చూసి భర్త గుండెలవిసేలా రోదించారు.
మర్రిపాడు: కదిరినాయుడుపల్లి అటవీ ప్రాంతంలో పెద్దపులి జాడ మంగళవారం తెలిసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇటీవల ఒక కారుపై పెద్దపులి దాడి చేసినట్లు వచ్చిన వార్త ఆధారంగా అటవీశాఖ అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఇప్పటికే ఆ ప్రాంతంలో పెద్దపులి జాడ తెలుసుకునేందుకు 35 కెమెరాలు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. నిరంతర పర్యవేక్షణ కోసం ఉదయగిరి, కావలి, నెల్లూరు, ఆత్మకూరు, రాపూరు అధికారులు విధులు నిర్వహిస్తున్నారు.
నెల్లూరు నగరంలోని సౌత్ రైల్వే స్టేషన్ సమీపంలో గల జయభారత్ హాస్పిటల్ లో డయోరియా లక్షణాలతో చికిత్స పొందుతున్న ఆరుగురు చిన్నారులను జిల్లా కలెక్టర్ ఎం హరి నారాయణన్ పరామర్శించారు. వైద్యాధికారులతో మాట్లాడి చిన్నారుల ఆరోగ్య పరిస్థితిని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. చిన్నారులందరూ ఆరోగ్యంగా ఉన్నారని, అన్ని పరీక్షలు కూడా బాగున్నాయని కలెక్టర్ కు వైద్యాధికారులు వివరించారు.
గూడూరు మండలంలో ఓ బాలికపై జరిగిన అత్యాచారం ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు.. గూడూరు మండలంలోని ఓ గ్రామానికి చెందిన నరేశ్, గణేశ్ అనే యువకులు ఓ బాలికను భయభ్రాంతులకు గురిచేసి వీడియో తీసి బ్లాక్ మెయిల్ చేసి అత్యాచారం చేసినట్టు బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. గూడూరు రూరల్ ఎస్సై మనోజ్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మండలం అబాక పంచాయతీలోని అమ్మలపాడు గ్రామంలో కారిమేటి ఉదయ్ కుమార్‌పై అతని భార్య మస్తానమ్మ సలసల కాగుతున్న వంట నూనెను పోసి చంపాలని ప్రయత్నించింది. ఉదయకుమార్‌కు తీవ్రగాయాలు కావడంతో సూళ్లూరుపేటలోని సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నెల్లూరు నగరంలోని ఎన్టీఆర్ నగర్ వద్ద జాతీయ రహదారిపై ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. మోటారు సైకిల్ ను లారీ ఢీకొనడంతో ఓ మహిళ ఘటనా స్థలంలో ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది.
Sorry, no posts matched your criteria.