Nellore

News January 9, 2026

నెల్లూరు జైలును తనిఖీ చేసిన హోంమంత్రి అనిత

image

వెంకటాచలం మండలం చెముడుగుంటలోని నెల్లూరు సెంట్రల్ జైలును హోం మంత్రి అనిత శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. జైల్లోని వసతులను పరిశీలించారు. ఖైదీలతో మాట్లాడారు. వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జైల్లో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి రిమాండ్ ఖైదీగా ఉన్నారు. వైసీపీ నేతలు ఆయనతో ములాఖాత్ అవుతున్న నేపథ్యంలో ఆమె ఆకస్మిక తనిఖీలు ప్రాధాన్యతను సంతరించుకుంది.

News January 9, 2026

త్వరలో సూళ్లూరుపేటకు మహర్దశ.!

image

సూళ్లూరుపేట(M) బీవీపాలెం సమీపంలో దాదాపు 150 ఎకరాల్లో ఫ్లోటింగ్ వాటర్ రిసార్ట్స్, వాటర్ స్పోర్ట్స్, ఎకో-టూరిజంతో పాటు పులికాట్ పరిసర ప్రాంతాల్లో గ్రీన్ టూరిజం అభివృద్ధి చేయనున్నారు. ఈ టూరిజాన్ని PPP మోడల్‌లో పెట్టుబడులను ఆకర్షించే అవకాశం ఉంది. సుమారు రూ.350 కోట్ల నుంచి రూ.500 కోట్ల వరకు పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. ఇక టూరిజం ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 500 పైచిలుకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి.

News January 9, 2026

నెల్లూరు: ‘భోగి మంటల్లో అవి వేస్తే ప్రమాదం’

image

టైర్లు, ప్లాస్టిక్ వస్తువులతో భోగి మంటలలో వేయొద్దని దుత్తలూరు PHC వైద్యులు సయ్యద్ ఆయూబ్ అప్సర్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. రానున్న సంక్రాంతి పండగల్లో భాగంగా భోగి మంటల్లో టైర్లు, ప్లాస్టిక్ వస్తువులు వేస్తే పర్యావరణం దెబ్బతినడమే కాకుండా కేన్సర్, టీబీ, చర్మ, కంటి జబ్బులు వచ్చే ప్రమాదం ఉందన్నారు. సంప్రదాయబద్ధంగా పండగలను చేసుకోవాలని పిలుపునిచ్చారు.

News January 9, 2026

నెల్లూరు జిల్లావ్యాప్తంగా రేపు, ఎల్లుండి వర్షాలు

image

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం రాగల 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. ఈ ప్రభావంతో శని, ఆదివారాలలో జిల్లావ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. అయితే జనవరిలో సాధారణంగా వర్షాలు పడవు. కానీ వాయుగుండం ఏర్పడటం, వర్షాలు కురవడం చాలా అరుదుగా ఉంటుంది. అలాంటి పరిస్థితే ఇప్పుడు ఏర్పడింది.

News January 9, 2026

నెల్లూరులో వ్యభిచార గృహంపై పోలీసుల దాడులు

image

నెల్లూరు రూరల్ పరిధిలో ఇంటిని అద్దెకు తీసుకుని కొందరు వ్యభిచార గృహం నిర్వహిస్తున్నారన్న సమాచారంతో రూరల్ పోలీసులు గురువారం ఆకస్మిక దాడులు చేశారు. ద్వారకామయి నగర్లోని నూతన లేఅవుట్లోని ఓ ఇంట్లో వ్యభిచారం చేస్తున్న ముగ్గురు మహిళలు, ఇద్దరు విటులను గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరు పరిచినట్లు సీఐ వేణు తెలిపారు.

News January 8, 2026

NLR: వృద్ధాశ్రమాలకు అనుమతులు ఉండాల్సిందే..!

image

నెల్లూరు జిల్లాలో వృద్ధాశ్రమాల నిర్వహణకు స్వచ్ఛంద సేవా సంస్థలు తప్పనిసరిగా అనుమతులు పొందాలని విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాల వృద్ధుల సంక్షేమ శాఖ సంచాలకులు అహ్మద్ అయూబ్ ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. అనుమతులు లేని వయోవృద్ధుల ఆశ్రమాలపై 2007 వయోవృద్ధుల చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పారు. మరిన్ని వివరాలకు నెల్లూరులోని తమ కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు.

News January 8, 2026

కోడి పందేలు జరగకుండా చూడాలి: నెల్లూరు కలెక్టర్

image

నెల్లూరు జిల్లాలో కోడిపందేలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ హిమాన్షు శుక్ల అధికారులను ఆదేశించారు. తన క్యాంపు కార్యాలయంలో జిల్లా జంతు హింస నివారణ కార్యవర్గ సమావేశం గురువారం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ.. సంక్రాంతి సందర్భంగా గ్రామాల్లో కోడి, ఎడ్ల పందేలను పూర్తిస్థాయిలో అరికట్టాలన్నారు.

News January 8, 2026

నెల్లూరు: బంగారం కోసం హత్య

image

కొడవలూరు (M) కొత్త వంగల్లు గ్రామంలో ఈనెల 5న ఒంటరిగా నివసిస్తున్న వృద్ధ మహిళ కోటేశ్వరమ్మ హత్యకు గురైంది. నిందితుడిని అరెస్ట్ చేశామని ఎస్పీ డా.అజిత వేజెండ్ల వెల్లడించారు. కోటేశ్వరమ్మ ఇంటి వరండాలో నిద్రిస్తుండగా అదే గ్రామానికి చెందిన వేముల రంజిత్ కుమార్ రాయితో కొట్టి హత్య చేశాడు. ఆమె మెడలోని 30 గ్రాముల బంగారు సరుడు ఎత్తుకెళ్లాడు. నిందితుడిని అరెస్ట్ చేసి సరుడు రికవరీ చేశారు.

News January 8, 2026

నెల్లూరు: రూ.14.22 కోట్లను ప్రభుత్వం రాబట్టలేదా..?

image

నెల్లూరు జిల్లాలో గనుల తవ్వకాల పన్ను(సీనరేజ్) వసూళ్ల కాంట్రాక్టర్‌ను AMR సంస్థ దక్కించుకుంది. ఈ సంస్థ ప్రభుత్వానికి నెలకు రూ.14.22 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఎక్కడికక్కడ AMR చెక్‌పోస్ట్‌లు పెట్టి రూ.30కోట్లకు పైగా వసూళ్లు చేస్తోందని సమాచారం. కానీ ప్రతినెలా ప్రభుత్వానికి సరిగా సీనరేజ్ కట్టడం లేదని తెలుస్తోంది. జనవరి ఫీజు మాత్రమే చెల్లించాల్సి ఉందని DD శ్రీనివాసరావు Way2Newsకు తెలిపారు.

News January 8, 2026

నెల్లూరు: పథకాలు ఉన్నా.. అందడం లేదు!

image

మత్స్యశాఖలో ఎన్నో పథకాలు ఉన్నాయనేది చాలామందికి తెలియదు. రాష్ట్ర పథకాలు నిలిచిపోగా.. కేంద్ర పథకాలు ఉన్నా అమలు కావడం లేదు. నెల్లూరు జిల్లాలో 25 రకాల సబ్సిడీ పథకాల కింద 10,195 యూనిట్స్ కేటాయించారు. కేవలం 359 యూనిట్లు మంజూరు కాగా.. 9,835 యూనిట్లు మిగిలిపోయాయి. పథకాలపై ప్రచారం లేకపోవడంతోనే ఈ దుస్థితి నెలకొంది. ఈ శాఖపై త్వరలో కలెక్టర్ రివ్యూ నిర్వహించనున్నట్లు సమాచారం. ఆయన ఎలా స్పందిస్తారో చూడాలి.