India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

నెల్లూరులోని వెంకటేశ్వరపురం ప్రభుత్వ బాలుర ఐటీఐలో ఇవాళ ఉదయం 9 గ.లకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ తెలిపారు. పలు ప్రముఖకంపెనీ ప్రతినిధులు హాజరై ఇంటర్వ్యూలు నిర్వహిస్తాయన్నారు. టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా చదివిన వారు అర్హులు అన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు తెలిపారు.

ఆత్మకూరు మండలం బట్టేపాడు శివారు పొలాలలో నిర్వహిస్తున్న కోడిపందాల శిబిరంపై ఆదివారం ఆత్మకూరు పోలీసులు దాడుల్లో నిర్వహించారు. ఈ దాడుల్లో కోడిపందాలు నిర్వహిస్తున్న ఐదు మందిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి 19 బైకులు, 8 కోడిపుంజులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎక్కడైనా ఇలాంటి చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

నెల్లూరు జిల్లా వ్యాప్తంగా SP జి.కృష్ణకాంత్ ఆదేశాల మేరకు ఇవాళ పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. వాహనాలు, లాడ్జీలను క్షుణ్ణంగా పరిశీలించారు. రాత్రి వేళల్లో లాడ్జీల్లో బస చేసిన వారి వివరాలపై ఆరా తీశారు. జిల్లా వ్యాప్తంగా ఓపెన్ డ్రింకింగ్ ఘటనలో 80, డ్రంక్ అండ్ డ్రైవ్‌లో 96, రోడ్డు నిబంధనలు పాటించని మరో 514 మందిపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

నెల్లూరు జిల్లాలో బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం ధర రూ.78,470లు ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర గ్రాము రూ.7,100లుగా ఉంది. కాగా 24 క్యారెట్ల బంగారం ధర శనివారంతో పోల్చితే రూ.700కు పెరిగింది. గడిచిన కొద్ది రోజులుగా జిల్లాలో మేలిమి బంగారం ధరలు తులం రూ.78వేలకు పైగా ఉండగా శనివారం కాస్త తగ్గి రూ.77వేలకు చేరింది.

ఆయన ఉద్యోగం కోసం కొద్ది రోజుల్లో గల్ఫ్ వెళ్లాలి. సరదాగా ఫ్రెండ్స్‌కు పార్టీ ఇవ్వడం కోసం బీచ్‌కు వెళ్లగా.. అదే అతడి చివరి రోజుగా మారింది. SI నాగబాబు వివరాల మేరకు.. దొరవారిసత్రం(M) తనయాలికి చెందిన సతీశ్, చెంచుకృష్ణ, మునిశేఖర్ రెడ్డి స్నేహితులు. సతీశ్‌కు గల్ఫ్‌లో ఉద్యోగం వచ్చింది. దీంతో సరదాగా గడిపేందుకు తూపిలిపాలెం బీచ్‌కు వెళ్లగా.. అలల తాకిడికి సతీశ్ కొట్టుకుపోయి చనిపోయాడు.

నెల్లూరు కలకొండ కొండపై గల శ్రీ లక్ష్మి నరసింహ స్వామి దేవాలయంలో స్వామివారికి శనివారం పల్లకి సేవ వైభవంగా జరిగింది. స్వామివారు ఆదిలక్ష్మి, చెంచు లక్ష్మి సమేతుడై పల్లకిలో కొలువుదీరి భక్తులకు దర్శనమిచ్చారు. నరసింహ నామ స్మరణతో దేవాలయం మారుమోగింది. భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.

నాయుడుపేటలో అస్థిపంజరం కలకలం రేపింది. స్వర్ణముఖి నదిలో కొట్టుకొచ్చిన మనిషి అస్తిపంజరాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీఆర్వో ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

బాలికను కిడ్నాప్ చేసి లైంగికదాడికి పాల్పడిన వ్యక్తికి శిక్ష పడింది. బాలాయపల్లిలోని ఓ బాలికను జయంపులో దుకాణం నడుపుతున్న ఓజిలి(M) ఇనుగుంటకు చెందిన సుబ్బారావు ప్రేమ పేరుతో నమ్మించాడు. సుబ్రహ్మణ్యం, వెంటకయ్య, వాణి సహయంతో 2015లో బాలికను కిడ్నాప్ చేసి లైంగికదాడికి పాల్పడ్డాడు. నేరం రుజువు కావడంతో నలుగురికి పదేళ్ల జైలు, రూ.22వేలు జరిమానా విధిస్తూ పోక్సో కోర్టు జడ్జి సిరిపిరెడ్డి సుమ నిన్న తీర్పుచెప్పారు.

వక్ఫ్ బోర్డు ఇన్‌స్పెక్టర్లు నిజాయితీగా పనిచేయాలని, ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లు ఎదురైనా తన దృష్టికి తీసుకురావాలని ఏపీ స్టేట్ వక్ఫ్ బోర్డ్ ఛైర్మన్ అబ్దుల్ అజీజ్ సూచించారు. 26 జిల్లాల ఇన్స్పెక్టర్ ఆఫ్ ఆడిటర్స్‌తో ఆయన నెల్లూరు నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ… వక్ఫ్ ఆస్తులతో సంపద సృష్టించడానికి తీసుకోవాల్సిన చర్యలను సిద్ధం చేయాలని ఆదేశించారు.

ధనుర్మాసం ప్రారంభమైంది. విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైన ఈ మాసంలో మహిళలు ఉదయాన్నే ఇంటి వాకిటను శుభ్రం చేసి ముగ్గులు వేస్తారు. న్యూ ఇయర్, సంక్రాంతి వరకు రంగురంగుల రంగవళ్లులను తీర్చిదిద్దుతుంటారు. మరి మీ అందమైన ముగ్గులను మాకు పంపండి. మీ పేరుతో Way2Newsలో మేము పబ్లిష్ చేస్తాం.
● ఇలా పంపండి: ముగ్గు ఫొటో, మీ పేరు, ఊరి పేరు, పాస్‌పోర్టు సైజు ఫొటోను 97036 22022 కు వాట్సాప్ చేయండి.
Sorry, no posts matched your criteria.