Nellore

News June 22, 2024

నందవరం అటవీ ప్రాంతంలో పులి కలకలం

image

మర్రిపాడు మండలం నందవరం అటవీ ప్రాంతంలో ఏఎమ్ఆర్ గార్డెన్ వద్ద పులి కనబడిందని శనివారం స్థానికంగా కలకలం రేగింది. ఓ వ్యక్తి పులిని చూసినట్లు గ్రామస్థులకు తెలిపాడు. గ్రామస్థుల ఫిర్యాదుతో సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని పరిసరాలను పరిశీలించారు. అధికారులు అది పులి కాదని ఐన అనే జంతువు అని నిర్ధారించారు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని అటవీశాఖ అధికారులు తెలిపారు.

News June 22, 2024

నెల్లూరు: ఎమ్మెల్యేలు, మంత్రులతో ఎంపీ వేమిరెడ్డి భేటీ

image

ఉమ్మడి నెల్లూరు జిల్లాల ఎమ్మెల్యేలతో పాటు జిల్లాకు చెందిన ఇద్దరు రాష్ట్ర మంత్రులతో నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి శనివారం ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ముందుగా వేమిరెడ్డి నివాసానికి చేరుకున్న రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలకు ఎంపీ వేమిరెడ్డి పుష్పగుచ్ఛాలు అందించి సాదరస్వాగతం పలికారు. అనంతరం నెల్లూరు జిల్లా సమగ్రాభివృద్ధిపై సుధీర్ఘంగా చర్చించారు.

News June 22, 2024

నెల్లూరు: 10 గ్రామాలకు నిలిచిన రాకపోకలు

image

గూడూరు-మిట్టాత్మకూరు ప్రధాన రహదారిపై విందూరు వద్ద కల్వర్టు కుంగింది. గూడూరు వచ్చేందుకు దగ్గర మార్గం ఇదొక్కటే కావడంతో 10 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అధికారులు ఇకనైనా స్పందించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని వారు కోరుతున్నారు.

News June 22, 2024

విడవలూరు: కిడ్నాపర్ ని పట్టుకున్న గ్రామస్థులు

image

విడవలూరు మండలం అలగానిపాడు గ్రామంలో శుక్రవారం రాత్రి అనుమానస్పదంగా తిరుగుతున్న ఓ వ్యక్తిని గ్రామస్థులు పట్టుకున్నారు. పట్టుకున్న వ్యక్తిని విచారించగా తనది తమిళనాడు అని, అక్కడినుంచి వచ్చి ఓ గ్రామానికి చెందిన ఓ పాపను కిడ్నాప్ చేశానని… తనను పోలీసులు తరమడంతో ఆ పాపను వ్యాన్ లో వదిలేసి అక్కడకు వచ్చినట్లు తెలిపాడు. అతనిని గ్రామస్థులు పోలీసులకు అప్పజెప్పారు. పోలీసుల విచారణలో అసలు విషయాలు తెలియాల్సి ఉంది.

News June 22, 2024

నెల్లూరు జిల్లాలో టైగర్ కారిడార్ ఏర్పాటుకు ప్రతిపాదనలు

image

ఉమ్మడి నెల్లూరు జిల్లాలో టైగర్ కారిడార్ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించినట్లు జిల్లా అటవీ శాఖ అధికారి ఆవుల చంద్రశేఖర్ శనివారం తెలిపారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను ఇప్పటికే కేంద్ర అటవీ శాఖకు పంపించింది. ఇటు శేషాచల అడవుల నుంచి నల్లమల మధ్య ఉన్న తిరుపతి, కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లాలను కలుపుతూ కారిడార్ ఏర్పడనుంది. జిల్లాలో రాపూరు, వెంకటగిరి, ఉదయగిరి, ఆత్మకూరు రేంజ్ పరిధిలో ఈ కారిడార్ ఏర్పడనుంది.

News June 22, 2024

రోడ్డు ప్రమాదంలో తిరుపతి వాసులు ఇద్దరు మృతి

image

తిరువన్నామలై దర్శనం కోసం వెళ్తున్న తిరుపతిలోని సుబ్బారెడ్డి నగర్, రెడ్డిగుంటకు చెందిన భక్తుల బృందానికి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందినట్లు సమాచారం. మరో ఎనిమిది మంది గాయాలయి తిరువన్నామలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు ప్రాథమిక సమాచారం. మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది.

News June 22, 2024

గూడూరు వద్ద కుంగిన కల్వర్టు

image

గూడూరు మండలం విందూరు వద్ద ఆర్ & బీ రోడ్డు మీద ఉన్న కల్వర్టు కుంగడంతో అటుగా వచ్చే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గూడూరు వచ్చేందుకు దగ్గర మార్గం ఇదొక్కటే కావడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఈ కల్వర్ట్ నిర్మించిన తక్కువ కాలంలోనే ఇలా జరగడంతో ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఇకనైనా స్పందించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని వారు కోరుతున్నారు.

News June 22, 2024

నెల్లూరు: ఈ నెల 24న DKWలో జాబ్ మేళా

image

నెల్లూరులోని డీకే డబ్ల్యూ డిగ్రీ కళాశాలలో ఈ నెల 24న జాబ్ మేళాను నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ గిరి ఒక ప్రకటనలో తెలిపారు. ఉద్యోగ మేళాలో ఈ సంవత్సరం డిగ్రీ పూర్తిచేసిన విద్యార్థులు కూడా పాల్గొనవచ్చని చెప్పారు. చెన్నై, శ్రీసిటీలోని పలు కంపెనీలు ఇందులో పాల్గొంటున్నట్లు తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు సంబంధిత ధ్రువపత్రాలతో ఉదయం 9 గంటలకు హాజరు కావాలన్నారు.

News June 22, 2024

ఉదయగిరి: అది చిరుత పులి కాదు కుక్క..?

image

ఉదయగిరి సమీపంలో దుర్గంపల్లికి వెళ్లే మార్గం పక్కన మేక మృతి చెందింది. అయితే చిరుతపులి దాడి చేసినట్లు అధికారులు అనుమానించారు. కాగా పరిశీలించిన అటవీ రేంజ్ అధికారి ఉమామహేశ్వర రెడ్డి కుక్కల దాడి అని చెప్పారు. మరికొందరు అధికారులు మాత్రం చిరుత లేదా హైనా చంపి ఉంటుందిని అనుమానించారు. భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడంతో స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు. దీనిపై ఎటూ తేలని పరిస్థితి నెలకొంది.

News June 22, 2024

నెల్లూరు: నగరపాలక సంస్థ కమిషనర్ సంతకం ఫోర్జరీ

image

నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వికాస్ మర్మత్ సంతకం ఫోర్జరీకి గురైంది. ఈ కేసులో టౌన్ ప్లానింగ్ అధికారులు బి.ప్రవీణ్, ఎం.దేవేంద్ర, సచివాలయ వార్డు ప్లానింగ్ కార్యదర్శులు పి.నాగేంద్ర బాబు, కార్తీక్ మాలవ్యను కమిషనర్ సస్పెండ్ చేశారు. ఆరోపణపై షోకాష్ నోటీసులు జారీ చేసినా..వివరణ సరిపోలలేదని కమిషనర్ తెలిపారు. వీరితో పాటు ఎల్‌టీపీ దిలీప్ కుమార్‌కు నోటీసులు ఇచ్చారు. వివరణ అనంతరం చర్యలు తీసుకుంటామన్నారు.