India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
చెముడుగుంటలోని నెల్లూరు సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ రాజేశ్వరరావు కడప సెంట్రల్ జైలుకు బదిలీ అయ్యారు. నెల్లూరు ఏపీ స్టార్స్ ప్రిన్సిపల్‌గా ఉన్న రాజారావుకు స్థానిక సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ బాధ్యతలు అప్పగించారు. అలాగే కడప సెంట్రల్ జైల్ ఇన్‌ఛార్జ్ సూపరింటెండెంట్ ప్రకాశ్‌ను ఏపీ స్టార్స్ ప్రిన్సిపల్‌గా నియమిస్తూ జైళ్ల శాఖ డీఐజీ కుమార్ విశ్వజిత్ ఉత్తర్వులు జారీ చేశారు.
నెల్లూరు జిల్లాలో ఇప్పటికీ రూ.10 కాయిన్‌ను కొన్ని చోట్ల తీసుకోవడం లేదు. మరోవైపు ఆర్టీసీ బస్సుల్లోనూ వీటిని తీసుకోవడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కావలి డిపో మేనేజర్ శ్రీనివాసరావు స్పందించారు. ‘ఆర్టీసీలో రూ.10 కాయిన్ చెల్లుతుంది. ప్రయాణికులు ఇచ్చే కాయిన్ తీసుకోవాల్సిందేనని సిబ్బందికి ప్రత్యేకంగా చెప్పాం. రూ.10 కాయిన్ చెల్లుతుందని బస్టాండ్ ఆవరణలో నోటీసు బోర్డు పెట్టాం’ అని తెలిపారు.
భార్య అసభ్యకర ఫొటోలు భర్తకు పంపిన ఘటన నెల్లూరు జిల్లాలో జరిగింది. అల్లూరు మండలంలోని ఓ గ్రామానికి చెందిన రాజా 28 ఏళ్ల వివాహిత అసభ్యకర చిత్రాలను ఆమె భర్తకు గత మార్చి నుంచి వాట్సప్ చేస్తున్నాడు. దీంతో భార్యను భర్త శారీరకంగా వేధించాడు. చివరకు ఆ ఫోన్ నంబర్‌ను పరిశీలిస్తే రాజానే ఇలా చేస్తున్నాడని తెలిసి గ్రామ పెద్దలు మందలించారు. రాజా ప్రవర్తనలో మార్పు రాకపోవటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
నెల్లూరులోని జిల్లా పరిషత్ కార్యాలయంలో ఈనెల 29వ తేదీ జిల్లాపరిషత్ కు సంబంధించిన ఏడు స్థాయి సంఘాల సమావేశం నిర్వహించనున్నట్లు జెడ్పీ సీఈవో కన్నమనాయుడు తెలిపారు. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్, గ్రామీణ నీటి సరఫరా, పారిశుధ్య, ఆర్ అండ్ బి, జిల్లా నీటి యాజమాన్య సంస్థ, గృహనిర్మాణ, విద్యుత్ శాఖ, పశుసంవర్థక, మత్స్య, ఉద్యానవన, విద్య, వైద్య, ఐసీడీఎస్, గిరిజనాభివృద్ది, సాంఘిక సంక్షేమ శాఖలతో సమావేశం జరుగుతుందన్నారు.
నెల్లూరులోని ఆర్టీసీ బస్టాండ్‌లో గుర్తుతెలియని వ్యక్తి మంచినీళ్లు తాగడానికి వెళ్లి అక్కడికక్కడే కుప్పకూలి పడిపోయాడు. అక్కడ ఉన్నవారు దగ్గరకు వెళ్లి చూడగా మరణించినట్లు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు వచ్చి పరిశీలించారు. పై ఫోటోలోని వ్యక్తి ఎవరికైనా తెలిసినట్లయితే ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్లో సంప్రదించగలరని పోలీసులు తెలిపారు.
నెల్లూరు జిల్లా వ్యాప్తంగా శుక్రవారం జరగనున్న ఉపాధి హామీ పథకం గ్రామ సభల్లో మెటీరియల్ కాంపోనెంట్ కింద పనులకు ప్రతిపాదనలు చేయనున్నారు. ఇందుకు జిల్లాకు రూ.80 కోట్లు కేటాయించారు. ప్రతి నియోజకవర్గానికి రూ.10 కోట్లు చొప్పున ఈ నిధులు వెచ్చించారు. గ్రామ సభలో గుర్తించిన పనులను ఎంపీడీవోల ద్వారా జిల్లా కలెక్టర్ కు నివేదిస్తారు.
బోగోలు మం. ఏనుగులబావి గ్రామంలో పెళ్లిలో ఘర్షణ జరిగింది. పోలీసుల వివరాల మేరకు.. గురువారం వివాహం జరుగుతుండగా కొందరు యువకులు గొడవకు దిగారు. మాటమాటా పెరిగి దాడి చేసుకున్నారు. ఈ క్రమంలో శ్రీను అనే యువకుడు గాయాలపాలయ్యారు. అతన్ని కుటుంబ సభ్యులు హుటాహుటిన కావలి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఘటనకు కారణాలు తెలియాల్సి ఉంది.
జిల్లాలోని పంచాయతీలకు రూ.34.68 కోట్ల ఆర్థిక సంఘం నిధులు మంజూరయ్యాయి. 2023-24 సంవత్సరానికి రెండో విడత 15వ ఆర్థిక సంఘం నిధులు మంజూరయ్యాయి. ట్రేడ్ గ్రాంట్‌గా రూ.20,81,17,976లు, అన్ ట్రేడ్ కింద రూ.13,87,45,162లు.. మొత్తంగా రూ.34,68,63,138 విడుదలయ్యాయి. ఈ నిధుల ద్వారా పంచాయతీల్లో కనీస వసతులు మెరుగుపర్చుకునేందుకు అవకాశం ఉంటుంది.
ప్రజలకు ఇసుక రవాణా భారం తగ్గించడానికి ఇసుక రవాణా ధరలు నిర్ధారించామని కలెక్టర్ ఓ.ఆనంద్ వెల్లడించారు. గురువారం ట్రాన్స్ పోర్ట్, రవాణా శాఖ అధికారులతో తిక్కన ప్రాంగణంలో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం మన జిల్లాలో మర్రిపాడు ఇసుక డిపో పనిచేస్తోందని, దీనిలో 36 వేల మెట్రిక్ టన్నుల ఇసుక అందుబాటులో ఉందని తెలిపారు. ఇక్కడి నుంచి రోజుకు వెయ్యి టన్నుల ఇసుక సరఫరా అవుతోందని తెలిపారు.
జిల్లాలో ఇసుక అక్రమ రవాణా చేస్తే ఉపేక్షించేదిలేదని, బ్లాక్ మార్కెటింగ్ అక్రమ డంపులపై కఠిన చర్యలు తీసుకుంటామని
ఎస్పీ జీ.కృష్ణకాంత్ హెచ్చరించారు. మర్రిపాడులో ఉన్న ఇసుక రీచ్ వద్ద పటిష్టమైన నిఘా ఏర్పాటు చేశామన్నారు. స్టాక్ పాయింట్ ప్రాంతానికి వే బిల్లులు, టైం స్లాట్‌లో ఉన్న వాహనాలను మాత్రమే అనుమతి ఇస్తామన్నారు. టోల్ ప్లాజా వద్ద టీంలు ఏర్పాటు చేసి నిరంతరం తనిఖీలు చేస్తామన్నారు.
Sorry, no posts matched your criteria.