Nellore

News April 22, 2024

వైసీపీ యువజన విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధిగా సమీర్ ఖాన్

image

వైసీపీ యువజన విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధిగా సమీర్ ఖాన్‌ను నియమించారు. ఈ మేరకు వైసీపీ రాష్ట్ర కమిటీ అధికారికంగా ఆదివారం ప్రకటన జారీచేసింది. వైసీపీ మైనార్టీ నేతగా క్రియాశీలకంగా పనిచేయడంతో పాటు జిల్లాలో సోనుసూద్ ట్రస్ట్ తరఫున అనేక సేవా కార్యక్రమాలను నిర్వహించారు. తాజాగా రాష్ట్ర అధికార ప్రతినిధి పదవి దక్కింది.

News April 21, 2024

టీడీపీ ఉపాధ్యక్షుడిగా కొమ్మి లక్ష్మయ్య నాయుడు

image

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మయ్య నాయుడు నియమితులయ్యారు. ఆత్మకూరు నియోజకవర్గానికే చెందిన పుట్టం బ్రహ్మానందరెడ్డిని రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా నియమించారు. ఈ క్రమంలో ఇద్దరు నేతలను ఆత్మకూరు అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి అభినందించారు.

News April 21, 2024

కసుమూరు దర్గాలో సినీ హీరో సుమన్ పూజలు

image

దక్షిణ భారతదేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కసుమూరు మస్తాన్ వలి దర్గాను ఆదివారం ప్రముఖ సినీ నటుడు సుమన్ దర్శించుకున్నారు. దర్గా ముజావర్లు ఆయనకు ఘన స్వాగతం పలికారు. హీరో సుమన్ పేరిట ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో కేఎస్ అసిఫ్, ఎంఎస్ మొహమ్మద్, ఎంఎస్ దస్తగిరి, రహీద్ తదితరులు పాల్గొన్నారు.

News April 21, 2024

స్ట్రాంగ్ రూమును పరిశీలించిన జిల్లా కలెక్టర్

image

తడ తహశీల్దార్ కార్యాలయం మరియు స్ట్రాంగ్ రూంను తిరుపతి జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ సందర్శించారు. అలాగే సూళ్లూరు పేట తహశీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. ఏవైనా సమస్యలు ఉంటే వాటి పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు.

News April 21, 2024

వైసీపీలోకి జనసేన నేత శ్రీకాంత్

image

బీజేపీ – జనసేన జిల్లా సమన్వయకర్త శ్రీకాంత్, జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ తదితరులు వైసీపీలో చేరారు. నెల్లూరు రామ్మూర్తినగర్ లోని వీఎస్ఆర్ క్యాంప్ కార్యాలయంలో వారికి ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి ఖలీల్ అహ్మద్, జిల్లా అధ్యక్షుడు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆత్మీయ ఆహ్వానం పలికారు.

News April 21, 2024

నెల్లూరు: సచివాలయంలో మద్యం సీసాలు

image

నెల్లూరు జిల్లాలోని ఓ సచివాలయంలోనే మద్యం సీసాలు దొరకడం కలకలం రేపుతోంది. కావలి పట్టణ పరిధిలోని బుడంగుంట సచివాలయంలో మద్యం సీసాలు నిల్వ చేసినట్లు సీ-విజిల్ యాప్ ద్వారా కొందరు ఫిర్యాదు చేశారు. దీంతో ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు సచివాలయంలో తనిఖీలు చేశారు. 43 మద్యం సీసాలను గుర్తించారు. వాటిని సీజ్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News April 21, 2024

ఉదయగిరి టీడీపీలో ఉత్కంఠ..!

image

ఉదయగిరి టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలు, కీలక నేతలు నెల్లూరులోని ఓ హోటల్లో సమావేశం కావడం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. అక్కడి అభ్యర్థి కాకర్ల సురేశ్ విజయానికి చేయాల్సిన కృషిపై సమాలోచనలు జరిపినట్లు పైకి చెబుతున్నా ఆ సమావేశంలో అభ్యర్థి లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. కొద్ది రోజులుగా సీనియర్ నేతలందరూ కాకర్లపై గుర్రుగా ఉన్నారనే ప్రచారం నేపథ్యంలో ఈ భేటీ ఉదయగిరి రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది.

News April 21, 2024

నెల్లూరు: రేపటి నుంచి టెక్నికల్ పరీక్షలు

image

డ్రాయింగ్, హ్యాండ్ లూమ్ వీవింగ్, టైలరింగ్ అండ్ ఎంబ్రాయిడరీ, లోయర్, హయ్యర్ గ్రేడ్ టైపింగ్ తదితర టెక్నికల్ కోర్సుల పరీక్షలను సోమవారం నుంచి 25వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు నెల్లూరు ఆర్ఐఓ శ్రీనివాసులు తెలిపారు. హాల్ టికెట్లను ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. పరీక్ష కేంద్రానికి హాల్‌టికెట్‌తో పాటు ప్రభుత్వం నిర్దేశించిన గుర్తింపు కార్డు తీసుకురావాలన్నారు.

News April 21, 2024

వెంకటగిరి అభ్యర్థి రామకృష్ణనే ..!

image

వెంకటగిరి టీడీపీ MLA అభ్యర్థిగా కురుగొండ్ల రామకృష్ణ పోటీలో ఉండనున్నారు. ఈమేరకు మంగళగిరికి వచ్చి బీఫారం తీసుకెళ్లాలని ఆయనకు TDP కేంద్ర కార్యాలయం నుంచి పిలుపు వచ్చినట్లు సమాచారం. ఈ సీటును ఆయన కుమార్తె లక్ష్మీసాయిప్రియకు కేటాయించారు. ఇప్పటికే ఆమెతో పాటు రామకృష్ణ నామినేషన్ వేశారు. ఆయన అయితేనే అనుకూల వాతావరణం ఉంటుందని వచ్చిన నివేదికల మేరకు అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినట్లు సమాచారం.

News April 21, 2024

డిప్యూటీ మేయర్ పదవికి ఖలీల్ రాజీనామా

image

నెల్లూరు డిప్యూటీ మేయర్ పదవికి ఖలీల్ అహ్మద్ రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా పత్రాన్ని మేయర్ స్రవంతికి అందజేశారు. ఆయన వైసీపీ నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈక్రమంలోనే రాజీనామా చేసినట్లు చెప్పారు. రాజీనామా విషయాన్ని మేయర్ రహస్యంగా ఉంచడం అనుమానాలకు తావిస్తోంది.