India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సచివాలయ భవనానికి నెలల తరబడి అద్దె చెల్లించకపోవడంతో యజమాని తాళం వేసిన ఘటన నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలంలో వెలుగు చూసింది. వాసిలి గ్రామంలో ఐదేళ్లుగా సచివాలయాన్ని అద్దె భవనంలో నిర్వహిస్తున్నారు. గతంలో అద్దె చెల్లించాలని యజమాని అడగగా.. వైసీపీ నాయకులు చెల్లిస్తామంటూ ముందుకు వచ్చారు. ఇటీవల అద్దె అడగగా.. తమకు సంబంధం లేదని వైసీపీ నాయకులు తప్పుకున్నారు. దీంతో యజమాని సచివాలయానికి తాళం వేశారు.
నెల్లూరు జిల్లా చేజర్ల జడ్పీటీసీ సభ్యుడు పీర్ల పార్థసారథి పొలంలో అక్రమంగా నిల్వ ఉంచిన రూ.1.50 కోట్ల విలువైన 1560 టన్నుల తెల్లరాయిని గనుల శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనుమతించిన ప్రదేశంలో కాకుండా మరో చోట తవ్వకాలు చేస్తున్న వాహనాలను, తవ్విన ఖనిజాన్ని డీడీ శ్రీనివాస్ సీజ్ చేసి రెవెన్యూ, పోలీస్ విభాగాలకు అప్పగించారు. శ్రీరామ మినరల్స్ పేరుతో అనుమతి పొంది మరోచోట తవ్వకాలు చేసినట్లు సమాచారం.
రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని నెల్లూరు సంతపేటలోని ఆనం
రామ నారాయణరెడ్డి నివాసంలో ఆదివారం కలెక్టర్ హరి నారాయణన్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఆనం రామనారాయణ రెడ్డికి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా పలు విషయాలపై కాసేపు వారు చర్చించుకున్నారు.
ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 12 మండలాల్లో 169 కి.మీ. మేర సముద్ర తీరం వెంబడి దాదాపు 98 గ్రామాల్లో సుమారు 1.50 లక్షల మత్స్యకార కుటుంబాలు ఉన్నాయి. దాదాపు 41 వేల మంది చేపలవేటనే జీవనం మార్చుకుని జీవిస్తున్నారు. ఏటా దాదాపు 65 వేల టన్నుల మత్స్య సంపదను సముద్రం నుంచి సేకరిస్తున్నారు. వేట నిషేధకాలం ముగియడంతో 61 రోజుల తరువాత తెల్లవారు జామున మత్స్యకార గ్రామాల నుంచి పడవలు చేపల వేటకు బయలుదేరాయి.
ఆంధ్ర రాష్ట్ర సచివాలయంలోని 2 వ బిల్డింగ్ నందు గల పురపాలక శాఖ ఛాంబర్ లో ఆదివారం పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా పొంగూరు నారాయణ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ పాల్గొని నారాయణకు శుభాకాంక్షలు తెలిపారు.
నెల్లూరుకు 2016లో భూగర్భ మురుగునీటి వ్యవస్థ మంజూరైంది. నగరంలో మొత్తం 430 కి.మీ మేర మురుగునీటి పైపులైన్ వేయాల్సి ఉండగా 390 కి.మీ పైపులైన్ వేశారు. ఇంకొ 40కి.మీ నిర్మించాల్సి ఉండగా ప్రభుత్వం మారడంతో పనులు నిలిచి పోయాయి. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా పొంగూరు నారాయణ పదవి చేపట్టడంతో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ పూర్తవుతుందన్న ఆశ నెల్లూరు వాసులలో నెలకొంది.
చేజర్ల మండలంలోని ఆదూరుపల్లి కూడలిలో పెంచలకోన రహదారి వెంట అటవీ భూములు ఆక్రమించిన వారు వెంటనే ఖాళీ చేయాలని సంబంధిత అధికారులు సూచించారు. ఆక్రమించిన అటవీ భూముల నుంచి నాలుగు రోజుల్లో ఖాళీ చేయాలని అధికారులు ఆక్రమణదారులకు సూచించారు. వైదొలగని ప్రదేశాలను స్వాధీనం చేసుకుంటామని తెలిపారు. రెవెన్యూ, అటవీ శాఖతో సర్వే జరిపి హద్దులు ఏర్పాటు చేస్తామన్నారు.
ఫాదర్స్ డేను పురస్కరించుకుని ఒక చిన్నారి కళ్లజోడుపై తల్లిదండ్రుల చిత్రాన్ని గీచారు. సైదాపురం మండలంలోని ఓరుపల్లికి చెందిన రమేశ్ కుమారుడు లోహిత్ గిద్దలూరు హైస్కూల్‌లో 8వ తరగతి చదువుతున్నాడు. బాలుడు చిన్నప్పటి నుంచి చిత్రాలు గీస్తున్నాడు. ఈ క్రమంలో ఫాదర్స్ డే సందర్భంగా కళ్లజోడుపై తల్లిదండ్రుల చిత్రాలను గీశాడు. వాటిని చూసి పలువురు అభినందిస్తున్నారు.
నెల్లూరు రూరల్ 41వ డివిజన్ కు చెందిన పలువురు వాలంటీర్లు వైసీపీ నేతలపై శనివారం రాత్రి ఫిర్యాదు చేశారు. ఎన్నికలకు ముందు తమ చేత స్థానిక కార్పొరేటర్, వైసీపీ నేతలు బలవంతంగా ఒత్తిడి తీసుకొని వచ్చి రాజీనామా చేయించారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. తమకు న్యాయం చేయాలని ఈ అంశంలో సమగ్రంగా విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు.
మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణకి నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి దంపతులు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. శనివారం నెల్లూరులోని నారాయణ స్వగృహానికి చేరుకున్న వేమిరెడ్డి దంపతులు.. ఆయనకి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. వీరిలో నెల్లూరు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఉన్నారు.
Sorry, no posts matched your criteria.