Nellore

News April 18, 2024

ఓటరు దరఖాస్తులను ఈనెల 24 లోగా పరిష్కారం

image

జిల్లాలో పెండింగ్ లో ఉన్న ఓటరు దరఖాస్తులను ఈనెల 24 లోగా పరిష్కరించి తుది ఓటరు జాబితాను ప్రచురిస్తామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హరి నారాయణన్ వెల్లడించారు.
గురువారం ఎస్‌ఆర్ శంకరన్ వీసీ హాల్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఇప్పటివరకు 20,53,397 మంది ఓటర్లుగా నమోదై ఉన్నారని అన్నారు.

News April 18, 2024

సీఎం జగన్ నాకు తీరని అన్యాయం చేశాడు: వెలగపల్లి

image

సీఎం జగన్ తనకు తీరని అన్యాయం చేశాడని తిరుపతి పార్లమెంటు బిజెపి అభ్యర్థి వెలగపల్లి వరప్రసాదరావు అన్నారు. వాకాడులో ఆయన మాట్లాడుతూ.. ఐదేళ్లు ఎంపీగా, ఐదేళ్లు ఎమ్మెల్యేగా పనిచేసిన తనను.. ఎవరో మాటలు విని తనకు టికెట్ ఇవ్వలేదని అన్నారు. దీంతో తాను బీజేపీ తరఫున తిరుపతి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీలో ఉన్నానని అన్నారు. తనను గెలిపిస్తే గూడూరు నియోజకవర్గ అభివృద్ధికి తొలి ప్రాధాన్యం ఇస్తానన్నారు.

News April 18, 2024

నెల్లూరు జిల్లాలో తొలి రోజు 9 మంది నామినేషన్లు

image

నెల్లూరు జిల్లాలో తొలి రోజు 8 నియోజకవర్గాల్లో 9 మంది 14 నామినేషన్లు, నెల్లూరు పార్లమెంట్‌కు ఒక నామినేషన్ వేసినట్లు కలెక్టర్ హరినారాయణన్ తెలిపారు. అలాగే జిల్లాలో సార్వత్రిక ఎన్నికలను పరిశీలించడానికి వ్యయ పరిశీలకులు ఇప్పటికే జిల్లాకు వచ్చారన్నారు. ఎన్నికల సాధారణ పరిశీలకులు, పోలీసు పరిశీలకులు 24న జిల్లాకు వస్తారని వెల్లడించారు. ఇప్పటివరకు జిల్లాలో రూ.1.78 కోట్ల నగదును సీజ్ చేసినట్లు పేర్కొన్నారు.

News April 18, 2024

కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తరఫున నామినేషన్ దాఖలు

image

నెల్లూరు రూరల్ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తరఫున మాజీ మేయర్ భానుశ్రీ నెల్లూరు రూరల్ రిటర్నింగ్ అధికారి మలోలకు గురువారం నామినేషన్ పత్రాలను అందజేశారు. ఎటువంటి హంగు ఆర్భాటం లేకుండా మాజీ మేయర్ భానుశ్రీతో పాటు టీడీపీ నేతలు నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. గతంలో 2014, 19 ఎన్నికల్లో కూడా కోటంరెడ్డి పోటీ చేశారు. ఇది వరుసగా మూడోసారి కావడం గమనార్హం.

News April 18, 2024

బాబు పర్యటనతో నామినేషన్ తేదీ మార్పు

image

20వ తేదీన గూడూరు పట్టణంలో మాజీ సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో తన నామినేషన్ మార్పు చేసినట్లు మాజీ ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ తెలిపారు. ఈ నెల 19న నామినేషన్ వేయాల్సి ఉండగా చంద్రబాబు పర్యటన కారణంగా 22వ తేదీకి మార్పు చేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని కోరారు.

News April 18, 2024

తొమ్మిదో సారి ప్రసన్న నామినేషన్

image

కోవూరు MLA అభ్యర్థిగా నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి తొమ్మిదో సారి నామినేషన్ దాఖలు చేశారు. 1993 ఉప ఎన్నికల్లో మొదటిసారిగా ఆయన టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగారు. 1994, 1999, 2004, 2009 ఎన్నికల్లోనూ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఒక్క 2004లో మాత్రం ఓడారు. 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో YCP అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. 2014లో ఓడిపోగా 2019లో విజేతగా నిలిచారు. ఇప్పుడు మరోసారి బరిలో దిగారు.

News April 18, 2024

ఖాళీలు పెట్టకండి: నెల్లూరు కలెక్టర్

image

ఇవాల్టి నుంచి నెల్లూరు జిల్లాలో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈనేపథ్యంలో కలెక్టర్ హరినారాయణన్ కీలక సూచనలు చేశారు. ‘అన్ని రాజకీయ పార్టీల నేతలకు కొత్త నామినేషన్ పేపర్లు ఇచ్చాం. ఎటువంటి తప్పులు లేకుండా, ఖాళీలు పెట్టకుండా అన్ని వివరాలు పొందుపరచాలి. ఫాం-ఏ, బీ పత్రాలపై ఇంకుతోనే సంతకం పెట్టాలి. తాజా అఫిడవిట్ పత్రాలను అందజేయాలి. నామినేషన్ వేసే ఆఫీసులోకి నలుగురినే అనుమతిస్తాం’ అని ఆయన చెప్పారు.

News April 18, 2024

బందోబస్తు పర్యవేక్షణకు పోలీసు అధికారులు

image

నామినేషన్ల ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానుంది. ప్రతి ఆర్వో ఆఫీసు వద్ద శాంతిభద్రతల పర్యవేక్షణ బాధ్యతలను DSPలకు అప్పగించారు. నెల్లూరు ఎంపీ నామినేషన్ కేంద్రం వద్ద ఏఎస్పీ సౌజన్య, నెల్లూరు సిటీలో శ్రీనివాసులు రెడ్డి, రూరల్‌లో రామకృష్ణాచారి , కోవూరులో శ్రీనివాసులు, సర్వేపల్లిలో వీరాంజనేయరెడ్డి, ఆత్మకూరులో కోటారెడ్డి, కావలిలో వెంకటరమణ, ఉదయగిరిలో సాయినాథ్ పర్యవేక్షిస్తారు.

News April 18, 2024

నెల్లూరు: ఇష్టదైవాలకు పూజలు

image

ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ నేడు ప్రారంభం కాబోతోంది. ఈక్రమంలో అభ్యర్థులు ముందుగా ఇష్టదైవాలకు పూజలు చేశాక నామినేషన్ కేంద్రాలకు వెళ్లనున్నారు. కోవూరు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతి తిరుమలలో, వైసీపీ అభ్యర్థి ప్రసన్నకుమార్ రెడ్డి తన ఇంట్లో పూజలు చేసి ఆర్వో కార్యాలయానికి రానున్నారు. కావలి వైసీపీ అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గ్రామదేవత కళుగోళ శాంభవిని దర్శించాక బయలుదేరుతారు.

News April 18, 2024

నామినేషన్లకు అంతా సిద్ధం: కలెక్టర్

image

నెల్లూరు జిల్లాలో గురువారం నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం అవుతుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హరి నారాయణన్ వెల్లడించారు. నామినేషన్ల ప్రక్రియ పారదర్శకంగా జరిగేందుకు వీడియోగ్రఫీతో పాటు సీసీ కెమెరాలను సైతం ఏర్పాటు చేశామని చెప్పారు. అన్ని ఆర్వో కార్యాలయాల్లో ఏర్పాట్లు పూర్తి కాగా.. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ జరుగుతుంది.