Nellore

News January 4, 2026

నెల్లూరు: గ్రామాలపై ప్రత్యేక నిఘా

image

నెల్లూరు పోలీసులు జిల్లావ్యాప్తంగా వినూత్న అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గ్రామాల్లో ప్రజలతో సమావేశమై సైబర్ మోసాలు, గంజాయి, ఇసుక అక్రమ రవాణా, మహిళల రక్షణపై అవగాహన కల్పిస్తున్నారు. సమస్యాత్మక గ్రామాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తూ, చట్ట వ్యతిరేక పనులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. ఏదైనా అనుమానాస్పదంగా కనిపిస్తే డయల్ 112 లేదా ఈగల్ సెల్ 1972 నంబర్లకు సమాచారం ఇవ్వాలన్నారు.

News January 3, 2026

నెల్లూరు కలెక్టర్ వినూత్న నిర్ణయం

image

కొత్త సంవత్సరం వేళ బొకేలు, స్వీట్లకు బదులు విద్యార్థులకు అవసరమైన వస్తువులు ఇవ్వాలన్న కలెక్టర్ హిమాన్షు శుక్లా పిలుపునకు మంచి స్పందన లభించింది. సందర్శకులు ఇచ్చిన వాషింగ్ మెషిన్‌ను కలెక్టర్ శనివారం బీసీ బాలికల హాస్టల్‌కు పంపారు. అలాగే కావలి, ఆత్మకూరు హాస్టళ్లకు నోట్ పుస్తకాలు, డిక్షనరీలను పంపిణీ చేశారు. విద్యార్థులపై కలెక్టర్ చూపుతున్న ఈ ప్రత్యేక శ్రద్ధ సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

News January 3, 2026

నెల్లూరు: చిన్నారి మృతదేహాన్ని లాక్కొచ్చిన కుక్కలు

image

నెల్లూరు జిల్లా ఇందుకూరుపేటలో చిన్నారి <<18745357>>మృతదేహం <<>>శుక్రవారం కలకలం రేపిన విషయం తెలిసిందే. ఎస్ఐ నాగార్జున రెడ్డి విచారణ చేపట్టి అసలు విషయాలు వెల్లడించారు. రావురు డొంక గిరిజన కాలనీకి చెందిన వెలుగు జానయ్య 5నెలల కుమారుడు గత నెల 26న అనారోగ్యంతో చనిపోయాడు. మృతదేహాన్ని జగనన్న కాలనీ సమీపంలో తక్కువ లోతు గుంత తీసి పూడ్చారు. కుక్కలు మట్టి తవ్వి మృతదేహాన్ని బయటకు లాక్కొచ్చాయని ఎస్ఐ విచారణలో తేలింది.

News January 3, 2026

నెల్లూరు జిల్లాలో 19 ఉద్యోగాలకు నోటిఫికేషన్

image

నెల్లూరు జిల్లాలోని KGBVలో 19 బోధనేతర పోస్టులను ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. అర్హులైన మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సమగ్రశిక్ష ఏపీసీ వెంకటసుబ్బయ్య ఓ ప్రకటనలో కోరారు. శనివారం నుంచి 11వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని చెప్పారు. అభ్యర్థులు తమ అప్లికేషన్లను నెల్లూరులోని సమగ్రశిక్ష కార్యాలయంలో అందజేయాలని కోరారు.

News January 3, 2026

వ్యవసాయ యాంత్రీకరణకు విరివిగా రుణాలు మంజూరు చేయాలి : కలెక్టర్

image

వ్యవసాయ యాంత్రీకరణను ప్రోత్సహించేందుకు రైతులకు విరివిగా రుణాలు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్‌ హిమాన్షు శుక్ల బ్యాంకర్లను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని తిక్కన ప్రాంగణంలో జిల్లాస్థాయి బ్యాంకర్ల సమితి సమావేశం కలెక్టర్‌ అధ్యక్షతన నిర్వహించారు. ఈనెల 28వ తేదీన వ్యవసాయ యాంత్రీకరణతో పాటు వ్యవసాయ అనుబంధ రంగాలకు మంజూరు చేస్తున్న రుణాలపై ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహిస్తామని తెలిపారు.

News January 2, 2026

నెల్లూరు: తొలి రోజు.. ‘ఎమ్మెల్యేలు’ ఎక్కడ..?

image

జిల్లాలో రీ సర్వేలో భాగంగా కొత్త పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీకి తొలిరోజు MLAలు పలుచోట్లా డుమ్మా కొట్టారు. అధికారికంగా నేతలు ఆధ్వర్యంలో జరగాల్సి ఉండగా.. కొన్ని చోట్ల అధికారులే కానిచ్చేసారు. కావలి, ఆత్మకూరు ప్రాంతాల్లో MLAలు పాల్గొనలేదు. విడవలూరు(M) పార్లపల్లిలో ఇవాళ జరగాల్సి ఉన్నా రామతీర్ధంలో MLA ప్రశాంతి రెడ్డి పంపిణీ చేశారు. TP గూడూరు(M) ముంగలదొరువులో రేపు జరగాల్సిన పట్టాల పంపిణీ ఇవాళ జరిగింది.