India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉమ్మడి నెల్లూరు జిల్లా పెళ్లకూరు(M) చిల్లకూరులో గురువారం జరిగిన ఘర్షణలో YCP కీలక నేత కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డికి బెయిల్ దొరకలేదు. ఆయనతో పాటు ఆళ్ల మణి, శ్రీనివాసులు, సుజిత్, చంద్రబాబు, పిల్లిమిట్ట మురళి, వంశీకృష్ణ, చెంచయ్య, చమ్మరతి పుట్టయ్యపై 341, 147, 148, 307, 324 RW 149 సెక్షన్లతో కేసులు నమోదు చేశారు. గుండె సమస్యలు ఉన్నాయని బెయిల్ కోరినా రాలేదు. వారిని నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు.
తాజా ఎన్నికల్లో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూటమికి 15,431(63.72) మంది ఉద్యోగులు ఓట్లు వేసినట్లు అధికారులు వెల్లడించారు. మెత్తం 24,216 మంది ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకోగా.. వారిలో కేవలం 5,925(24.47) మంది మాత్రమే వైసీపీకి ఓటు వేశారు. మరోవైపు ఇండియా కూటమికి 1,580(6.52) మంది ఓటు వేశారు. కాగా జిల్లాలో కూటమి క్లీన్ స్వీప్ చేసిన విషయం తెలిసిందే.
కావలి పట్టణంలో శనివారం విషాదం చోటు చేసుకుంది. ఉదయగిరి వంతెన సమీపంలో ఓ గుర్తు తెలియని యువకుడు రైలు కింద పడి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. మృతుని వయసు 25 నుంచి 30 సంవత్సరాలు ఉంటుందని పోలీసులు తెలిపారు.మృతుడు స్కై బ్లూ కలర్ హాఫ్ హాండ్ టీ షర్ట్ , బులుగు లోయర్ ప్యాంట్ ధరించి ఉన్నాడు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. మృతుని వివరాలు తెలిస్తే తమకు చెప్పాలని కోరారు.
నెల్లూరు జిల్లాలోని పోలీసు సిబ్బంది సంక్షేమమే ప్రథమ కర్తవ్యంగా భావించి “పోలీస్ వెల్ఫేర్ డే” ని జిల్లా యస్.పి. ఆరీఫ్ హఫీజ్ నిర్వహిస్తున్నారు. పోలీస్ సిబ్బంది సంక్షేమానికి ఎల్లప్పుడూ కృషి చేస్తామన్నారు. సిబ్బంది నుంచి అర్జీలను స్వయంగా స్వీకరించి, వారితో ముఖాముఖిగా మాట్లాడి సమస్య పరిష్కరిస్తానని భరోసా కల్పించారు. పారదర్శకతతో కోరుకున్న చోటుకే ఖాళీల ఆధారంగా స్థానచలనం చేశారు.
నెల్లూరు జిల్లాలోని పోలీసు సిబ్బంది సంక్షేమమే ప్రథమ కర్తవ్యంగా భావించి “పోలీస్ వెల్ఫేర్ డే” ని జిల్లా యస్.పి. ఆరీఫ్ హఫీజ్ నిర్వహిస్తున్నారు. పోలీస్ సిబ్బంది సంక్షేమానికి ఎల్లప్పుడూ కృషి చేస్తామన్నారు. సిబ్బంది నుంచి అర్జీలను స్వయంగా స్వీకరించి, వారితో ముఖాముఖిగా మాట్లాడి సమస్య పరిష్కరిస్తానని భరోసా కల్పించారు. పారదర్శకతతో కోరుకున్న చోటుకే ఖాళీల ఆధారంగా స్థానచలనం చేశారు.
చేజర్ల మండలంలోని పలు గ్రామాలలో వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి. అదురుపల్లి, ఏటూరు, నాగుల వెల్లటూరు తదితర గ్రామాలలో గాలితో కూడిన తేలికపాటి వర్షం కురుస్తోంది. ఇన్ని రోజులు ఉక్కపొతతో అల్లాడిన ప్రజలు ఈ వర్షంతో ఉపశమనం పొందుతున్నారు. చిరు వ్యాపారులు కాస్త ఇబ్బంది పడుతున్నారు.
అనంతసాగరం మండలం, సోమశిల జలాశయానికి వరద వస్తోంది. పూర్తి సామర్థ్యం 78 టీఎంసీలు కాగా శనివారం నాటికి జలాశయంలో 7.293 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు తెలిపారు. ఎగువ ప్రాంతాల నుంచి 521 క్యూసెక్కుల వరద వస్తోంది. పెన్నా డెల్టాకు 200, దక్షణ కాలువకు 5, ఉత్తర కాలువకు 5 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. 68 క్యూసెక్కుల నీరు ఆవిరి అవుతుంది.
నెల్లూరు జిల్లా TDP సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి మంత్రి పదవి దక్కనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. సర్వేపల్లిలో 2 దశాబ్దాల తర్వాత సోమిరెడ్డి TDP జెండా ఎగురవేశారు. నారా లోకేశ్‌ను ఆయన నిన్న ప్రత్యేకంగా కలవడంతో మంత్రి పదవి ఖాయమనే ప్రచారం జరుగుతోంది. గత టీడీపీ హయాంలో ఆయన మంత్రి(MLC కోటా)గా చేసిన అనుభవం ఉంది. ఈ నేపథ్యంలో మరోసారి పదవి దక్కుతుందని ఆ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
జరిగిన ఎన్నికల ఫలితాలపై పార్టీ అభిమానులు, కార్యకర్తలు సంయమనంగా వ్యవహరించాలని గూడూరు డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి కోరారు. దాడులు, ప్రతి దాడులకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని, ఈ విషయంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. గెలుపోటములపై ఆగ్రహవేశాలకు గురికాకుండా ప్రతి ఒక్కరూ శాంతియుతంగా వ్యవహరించాలన్నారు. కౌంటింగ్ అనంతరం కొన్నిచోట్ల అల్లర్లు జరిగాయని వస్తున్న సోషల్ మీడియా కథనాలపై ఆయన స్పందించారు.
ఉదయగిరి మండలంలోని గండిపాలెం గ్రామంలో శుక్రవారం సాయంత్రం కురిసిన గాలివానకు విద్యుత్ స్తంభం కూలిపోయి ఓ ఇంటిపై పడింది. ఆ సమయంలో ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ఆ ప్రాంతవాసులు ఊపిరి పీల్చుకున్నారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. అధికారులు వెంటనే స్పందించి స్తంభాన్ని తొలగించి సరఫరాను పునరుద్ధరించారు. అకాల వర్షం పడి రైతులకు పండ్లతోటల యజమానులకు ఊరటనిచ్చింది.
Sorry, no posts matched your criteria.