India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అల్పపీడన ప్రభావంతో గత మూడు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురవడంతో ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సెల్ ఫోన్లకు హెచ్చరికలు చేసింది. ‘మీ పరిసర ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉంది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడేప్పుడు చెట్లు, టవర్లు, పోల్స్, పొలాలు ఇతర బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదు. సురక్షితమైన భవనాల్లో ఆశ్రయంపొందాలి.అని మెసేజ్ పంపంది. మీకు ఈ మెసేజ్ వచ్చిందా?.
తిరుపతి జిల్లా కోట మండలం విద్యానగర్‌లోని మహాత్మా జ్యోతిరావు ఫూలే AP బీసీ బాలికల గురుకుల పాఠశాలకు వారం రోజులు సెలవు ప్రకటించినట్లు ఆ పాఠశాల కన్వీనర్ నారాయణరావు బుధవారం పేర్కొన్నారు. ఈ భవనంలోని గదులు కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రమాదకరంగా మారాయన్నారు. దీంతో భవనాలకు మరమ్మతులు చేపట్టామన్నారు. అందుకే సెలవులు ప్రకటించామన్నారు.
నెల్లూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన పెంచలకోనలో బుధవారం ద్వాదశి సందర్భంగా శ్రీవార్లకు నందనవనంలో అష్టోత్తర శత కలశాభిషేకం, సాలగ్రామ దాత్రి పూజలు నిర్వహించి వనభోజనాలు ఏర్పాటు చేశారు. సాయంత్రం శ్రీ పెనుశిల లక్ష్మీ నరసింహ స్వామి వారికి బంగారు గరుడ వాహనంపై వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య వైభవంగా ఉత్సవం జరిపారు. ఆలయ డిప్యూటీ కమిషనర్ పోరెడ్డి శ్రీనివాసులు రెడ్డి పాల్గొన్నారు.
కోవూరు మండలం పడుగుపాడు రైల్వే గేట్ వద్ద జరిగిన రైలు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. లేగుంటపాడు గ్రామానికి చెందిన సరోజమ్మ(65) రైల్వే గేటు దాటుతుండగా తిరుపతి నుంచి సికింద్రాబాద్‌కు వెళ్తున్న వందే భారత్ రైలు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
భార్యను భర్త హత్య చేసిన ఘటన బోగోలు మండలంలో చోటుచేసుకుంది. మృతురాలి కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. విశ్వనాథనావుపేటకు చెందిన దత్తు.. తస్లీమా(35)ను మూడేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాడు. ఈ క్రమంలో తన భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో దత్తు మంగళవారం రాత్రి గొడవపడి కత్తితో పొడిచి హత్య చేశాడు. మృతదేహాన్ని కావలి ఏరియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఏపీ బీసీ సంక్షేమశాఖ ఆదేశాల మేరకు DSC పరీక్షలకు ఉచిత శిక్షణ ఇవ్వడానికి ఆసక్తిగల అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు బీసీ సంక్షేమ అధికారి కే ప్రసూన ఓ ప్రకటనలో తెలిపారు. నెల్లూరు జిల్లాకు చెందిన నిరుద్యోగ BC, SC,ST, EBC అభ్యర్థులు అర్హులన్నారు. వారి కుటుంబ వార్షిక ఆదాయం రు.లక్ష లోపు ఉండి, టెట్ అర్హత కలిగిన అభ్యర్థులు BC స్టడీ సర్కిల్‌లో 14వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.
వెంకటగిరి మున్సిపాలిటీ అభివృద్ధికి తోడ్పాటు అందించాలని ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ కోరారు. విజయవాడలో మంత్రి నారాయణను ఆయన క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కలిశారు. వెంకటగిరి మున్సిపాలిటీ పరిధిలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై వినతిపత్రం అందజేశారు. మున్సిపాలిటీలో ఉద్యోగ సిబ్బంది కొరత ఉందని.. వెంటనే పోస్టులను భర్తీ చేయాలని కోరారు.
అత్యాచారం ఘటనలో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్షతోపాటూ రూ. 23వేల జరిమానా పడినట్లు చిల్లకూరు SI సురేశ్ బాబు తెలిపారు. మండల పరధిలోని ఓ గ్రామంలో 2021లో ఓ మైనర్ బాలికను కావూరు మస్తాన్ బాబు అపహరించి అత్యాచారం చేశాడు. నేరం రుజువు కావడంతో కోర్టు మంగళవారం నిందితుడికి శిక్ష ఖారారు చేసినట్లు SI తెలిపారు.
వైసీపీ అధినేత జగన్ అసెంబ్లీకి ఎందుకు రారని AP స్టేట్ ఆక్వా కల్చర్ డెవలప్‌మెంట్ అథారిటీ ఛైర్మన్ ఆనం వెంకటరమణారెడ్డి ప్రశ్నించారు. 39.37 శాతం మంది ప్రజల మనోభావాలను ఆయన అవమానిస్తున్నారన్నారు. ప్రతి పక్షా హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తాననడం సిగ్గుచేటన్నారు. జగన్ వెంట ఆ పార్టీ MLAలు సైతం నడవడం బాధాకరమన్నారు. జగన్ అసెంబ్లీకి వచ్చి రాష్ట్ర అభివృద్ధికి విలువైన సూచనలు ఇవ్వాలని కోరారు.
అక్కంపేట కురిచర్లపాడు మధ్యలో కల్వర్ట్ కుంగడంతో అక్కంపేట, కురిచర్లపాడు కసుమూరు మీదుగా నెల్లూరు రాకపోకలు నిలిచిపోయాయి. మంగళవారం తెల్లవారుజామున నుంచి తేలికపాటి వర్షాలు ప్రారంభమయ్యాయి. ఇక్కడ పొట్టేలు కాలవ వంతెనకు ముందు పొలాల వద్ద ఉన్న కల్వర్ట్ మంగళవారం మధ్యాహ్నం కుంగిపోయింది. రాకపోకలకు విఘాతం ఏర్పడింది. దీంతో గ్రామస్థులు ముళ్లకంప వేసి రాకపోకలు బంద్ చేశారు.
Sorry, no posts matched your criteria.