India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

రేపటి నుంచి గ్రామపంచాయతీలో ప్రత్యేక అధికారుల పాలన రానుంది. గ్రామ సర్పంచుల పదవీకాలం ముగియనుంది. జిల్లాలోని 700 పంచాయతీలకు ప్రత్యేక అధికారులను నియమిస్తూ కలెక్టర్ హిమాన్సు శుక్లా ఉత్తర్వులు జారీ చేశారు. పంచాయతీ ఎన్నికలు పూర్తయి కొత్త సర్పంచులు ఎన్నిక అయ్యే వరకు వీరు బాధ్యతలు చూస్తారు. మండల స్థాయి అధికారులు, ఇంజినీర్లను ప్రత్యేక అధికారులుగా నియమించారు.

నెల్లూరు జిల్లా వింజమూరులో CM చంద్రబాబు పర్యటన ముగిసింది. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించినా పోలీసు సిబ్బందిని ఎస్పీ డాక్టర్ అజిత వేజెండ్ల అభినందించారు. ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠీ సూచనలతో ట్రాఫిక్, వీవీఐపీ రూట్ భద్రతను పకడ్బందీగా పర్యవేక్షించామన్నారు. మరోవైపు సిబ్బందిని కలెక్టర్ హిమాన్షు శుక్లా అభినందించారు.

ప్రభుత్వ జిల్లా విద్యా శిక్షణా సంస్థలలో ఇంటర్మీడియట్ అర్హతతో నిర్వహించనున్న రెండేళ్ల డిప్లొమా కోర్సులో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు డీఈవో ఆర్ బాలాజీ రావు తెలిపారు. ఇందుకు సంబంధించి https://cse.ap.gov.in, https://apdeecet.apcfss.in
వెబ్‌సైట్‌లో వివరాలు ఉన్నాయన్నారు. ఆసక్తి గలవారు గమనించాలని ఆయన కోరారు.

నెల్లూరులో మందు బాబులకు ఇబ్బంది లేకుండా అడుగుకొక బార్, వైన్ షాపులు దర్శనమిస్తున్నాయి. నెల్లూరు హైవేకు సమీపంలో చిల్డ్రన్స్ పార్క్ నుంచి దీన్ దయాల్ నగర్ వరకు 7షాపులు ఉన్నాయి. మెడికవర్ హాస్పిటల్ ఎదురుగా ఒకటి, చిల్డ్రన్స్ పార్క్ దారిలో రెండు, అస్లీ ఢాబా పక్కన ఒకటి, ఎన్టీఆర్ నగర్ సమీపంలో రెండు, దీన దయాల్ నగర్ వద్ద ఒకటి ఉన్నాయి. ఇవి హైవేకి సమీపంలో ఉండడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.

రాష్ట్రస్థాయిలో ప్రభుత్వంపై ప్రజలు 67.37% మంది సంతృప్తిగా ఉంటే నెల్లూరు జిల్లాలో 69.33%మంది ఉన్నారని CM చంద్రబాబు చెప్పారు. ‘కలెక్టర్ హిమాన్షు శుక్లా పనితీరు బాగుంది. ఇంకా బాగా పనిచేసి ప్రజల ఓట్లు మాకు వచ్చేలా చూడండి. ఉదయగిరిలో R&B, రిజిస్ట్రేషన్ శాఖ పనితీరుపై ప్రజల సంతృప్తి మైనస్‌లో ఉంది. బీ కేర్‌ఫుల్. నేను ఆకస్మిక తనిఖీలకు వస్తా. దొరికితే చర్యలు తప్పవు’ అని సీఎం హెచ్చరించారు.

ఉదయగిరికి పరిశ్రమలు వస్తాయని ఎవరూ ఊహించలేదని సీఎం చంద్రబాబు అన్నారు. వింజమూరులో ఆయన మాట్లాడుతూ.. ‘పంటలు పండకపోవడంతో ఉదయగిరి ప్రజలు దేశంలోని వివిధ ప్రాంతాలకు వలస వెళ్లారు. ఉదయగిరిలో డబ్బులు లేవు కానీ.. ఇక్కడి నుంచి బయటకు వెళ్లిన వాళ్లు బాగా సంపాదించారు. వాళ్లంతా ఉదయగిరిలో పెట్టుబడులు పెట్టాలి. ఇప్పటికే ఇక్కడికి రెండు పరిశ్రమలు వచ్చాయి. ఉదయగిరిని టూరిస్ట్ ప్లేస్‌గా మారుస్తా’ అని CM ప్రకటించారు.

నెల్లూరు జిల్లా వింజమూరు సభలో సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. ‘వింజమూరు ప్రజలు చాలా గ్రేట్. నేను గతంలో జన్మభూమి కార్యక్రమం చేపట్టాను. ఇదే తరహాలో ప్రజలు రూ.70లక్షలు సేకరించి వింజమూరు పాతూరు చెరువును బాగు చేశారు. సోమశిల నుంచి ఈ చెరువుకు నీళ్లు తరలించడానికి రూ.34కోట్లతో పనులు చేస్తాం. అక్టోబర్ ఒకటో తేదీకే ఈ చెరువును నీటితో నింపేలా పనులు పూర్తిచేస్తామని మీకు హామీ ఇస్తున్నా’ అని CM చెప్పారు.

Sorry, no posts matched your criteria.