Nellore

News August 16, 2024

కావలి: తాహశీల్దార్‌పై వేటుకు రంగం సిద్ధం..!

image

కావలి మాజీ ఎమ్మెల్యే కారు చోదకుడిగా పని చేస్తూ కూడబెట్టుకున్న సొమ్ముతో స్థలం కొనుగోలుతో పాటు ఇలాగ అనేక అక్రమాలు పాల్పడిన వ్యక్తికి అప్పటి తాహశీల్దార్ సహకరించారన్న సమాచారంతో తహసీల్దారుపై చర్యలకు ఉన్నతాధికారులు సిద్ధమవుతున్నారు. వైసీపీ నాయకులతో అంటకాగి అక్రమాలకు పాల్పడిన వారి పాపాలు పండుతున్నాయి. ఈ క్రమంలో గతంలో పనిచేసిన ఓ తాహశీల్దార్‌పై సస్పెండ్ వేటు పడనున్నట్లు సమాచారం.

News August 16, 2024

ఉపరాష్ట్ర పతి పర్యటన కోసం మంత్రి ఆనంని నియామకం

image

భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ రాష్ట్ర పర్యటనకు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ని రాష్ట్ర ప్రభుత్వం నామినేట్ చేసింది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తరపున భారత ఉపరాష్ట్రపతి కి స్వాగత, వీడ్కోలు కార్యక్రమాలతో పాటు భారత ఉపరాష్ట్రపతి తో కలిసి ప్రత్యేక హెలిక్యాప్టర్లో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రయాణిస్తారు.

News August 15, 2024

ఉప రాష్ట్రపతి పర్యటన వివరాలు

image

భారత ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌కడ్ 17వ తేదీ నెల్లూరు పర్యటన రానున్నారు.. 17వ తేదీ ఉదయం 9:50 కి నెల్లూరు పోలీసు పరేడ్ మైదానంలో ప్రత్యేక హెలికాప్టర్ చేరుకోనున్నారు. అక్కడ 10:30 నుంచి మధ్యహ్నం 2:55 వరకు వెంకటాచలంలోని స్వర్ణాంధ్ర భారత్ ట్రస్ట్ వార్షికోత్సవ వేడుకలలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 3:55 గంటలకు రేణిగుంట విమానాశ్రయంకు చేరుకుంటారు.

News August 15, 2024

నెల్లూరు బీవీ నగర్‌లో దారుణ హ‌త్య‌

image

నెల్లూరు బీవీ నగర్‌లో దారుణ హ‌త్య‌ చోటుచేసుకుంది. కెఎన్ఆర్ హైస్కూల్ స‌మీపంలోని రైల్వే వీధి ట్రాక్ స‌మీపంలో గుర్తుతెలియని వ్యక్తులు ఓ యువకుడిని దారుణంగా హత్య చేసి పరారయ్యారు. మృతుడు మ‌న్నేప‌ల్లి వేణుగా గుర్తించారు. సమాచారం అందుకున్న వేదయపాలెం 5వ టౌన్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News August 15, 2024

మర్రిపాడులో మళ్లీ పెద్దపులి సంచారం కలకలం

image

నెల్లూరు – కడప అంతర జిల్లా సరిహద్దు సమీపంలోని మర్రిపాడు మండలం, కదిరినాయుడు పల్లి బిట్ పరిధిలోని అటవీ ప్రాంతంలోకి ఓ పెద్ద పులి వెళుతున్నట్లు కనిపించిందని ఆటో డ్రైవర్ తెలిపాడు. గత రాత్రి 7 గంటల సమయంలో ఈ పెద్ద పులి కనిపించినట్లు తెలిపాడు. జూన్ 23వ తేదీ కదిరినాయుడు పల్లి అటవీ ప్రాంతంలో ఓ పెద్ద పులిని అటవీ శాఖ అధికారులు గుర్తించిన విషయం తెలిసిందే.

News August 15, 2024

కలువాయి: సైబర్‌ వలలో ఉపాధ్యాయుడు

image

సైబర్‌ నేరస్థులు ఓ ఉపాధ్యాయుడిని బురిడి కొట్టించి రూ.63 వేల నగదు స్వాహాచేశారు. ఈ సంఘటన బుధవారం కలువాయిలో జరిగింది. చీపినాపి జడ్పీ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న నారాయణరావు బుధవారం ఇంటికొచ్చి ఫోన్‌లో విద్యుత్తు బిల్లుకు సంబంధించిన మేసేజ్ చూసుకున్నారు. ఇంతలో సైబర్ నేరగాళ్లు కాల్ చేసి బిల్లు కట్టలేదని యాప్‌ను అప్‌డేట్ చేయాలని సూచించారు. వాళ్లు చెప్పినట్లు చేయడంతో ఖాతా నుంచి రూ.63 వేలు నగదు దొచుకున్నారు.

News August 15, 2024

నెల్లూరు: ఉత్తమ సేవ పురస్కారాలకు ఎంపికైన జిల్లా అధికారులు

image

జిల్లా రెవెన్యూ అధికారి లవన్న, కందుకూరు సబ్ కలెక్టర్ జి విద్యాధరి, నెల్లూరు, కావలి, ఆత్మకూరు ఆర్డిఓలు మలోల, శీనా నాయక్, మధులత, తుడ వైస్ చైర్మన్ టి బాపిరెడ్డి, బి చిన్న ఓబులేసు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పద్మావతి, జిల్లా పరిషత్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కన్నమ నాయుడు, డీఆర్డీఎ పీడీ సాంబశివరెడ్డి, జిల్లా ఆడిట్ ఆఫీసర్ ఎన్ తిరుపతయ్య, జిల్లా డిప్యూటీ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ బి.చందర్‌లు ఎంపికయ్యారు.

News August 15, 2024

నెల్లూరులో సీనియర్‌పై జూనియర్ల దాడి

image

సీనియర్ విద్యార్థిపై జూనియర్లు దాడి చేసిన ఘటన నెల్లూరులో జరిగింది. బాలాజీ నగర్ పోలీసుల వివరాల మేరకు.. ఆషరథ్ నెల్లూరులోని ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలో చదువుతున్నాడు. అదే కాలేజీకి చెందిన జూనియర్లు కైఫ్ మన్సూర్, ముజమిల్, షాహుల్‌ను కేఫ్ వద్ద అతడు కలిశాడు. మద్యం తాగేందుకు డబ్బులు కావాలని జూనియర్లు ఆషరథ్‌ని అడిగారు. అతడు లేవని చెప్పడంతో ఇటుక రాయితో కొట్టారు.

News August 15, 2024

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు పగడ్బందీ ఏర్పాట్లు

image

78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు గూడూరు స్టేడియం ముస్తాబయింది. గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో వేడుకలు నిర్వహించేందుకు, అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని గూడూరు ఆర్డీవో కిరణ్ కుమార్ తెలిపారు. గూడూరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో గూడూరు డివిజన్ పరిధిలోని వివిధ శాఖలకు చెందిన అధికారులతో, స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నిర్వహణపై బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు.

News August 14, 2024

కాకాని గోవర్ధన్ రెడ్డిపై కలెక్టర్‌కు ఫిర్యాదు

image

కోట్లాది రూపాయల విలువైన భూములను కాకాని గోవర్ధన్ రెడ్డి& బ్యాచ్ దోచుకున్నారని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. ఈ సందర్భంగా బుధవారం నెల్లూరు కలెక్టర్ కార్యాలయంలోని జిల్లా కలెక్టర్ ఆనంద్‌కు సర్వేపల్లి నియోజకవర్గ టీడీపీ నాయకులతో కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధికారాన్ని అడ్డుపెట్టుకొని కాకాని గోవర్ధన్ & బ్యాచ్ కోట్లాది రూపాయలు దోచుకున్నారని విమర్శించారు.