India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
బాలికను వేధించిన కేసులో నిందితుడికి జీవితఖైదు, రూ.27వేలు జరిమానా విధిస్తూ నెల్లూరు జిల్లా పోక్సో కోర్టు జడ్జి సిరిపిరెడ్డి సుమ తీర్చునిచ్చారు. కావలిలోని ఓ బట్టల షాపులో పనిచేసే బాలికకు సాయి కిషోర్ అనే వ్యక్తి పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా కలిశాడు. అనంతరం దారుణంగా ప్రవర్తించాడు. దీంతో బాలిక కుటుంబసభ్యులు కావలి పోలీసులకు 2017లో ఫిర్యాదు చేశారు. కేసు విచారించి జడ్జి శిక్ష ఖరారు చేశారు.
మంత్రి నాదెండ్ల మనోహర్ కాసేపటి క్రితం నెల్లూరకు చేరుకున్నారు. ఆయనకు టిడ్కో ఛైర్మన్ అజయ్ కుమార్‌తోపాటూ పెద్ద సంఖ్యలో జనసేన నాయకులు స్వాగతం పలికారు. మంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తువాత నెల్లూరుకు రావడం ఇదే తొలిసారి. ఈ మేరకు ఆయన 22న సంగం మండలంలో పర్యటించనున్నట్లు ఆ పార్టీ నేతలు తెలిపారు.
రాపూరు మండలం పెంచల లక్ష్మీనరసింహస్వామిని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి శుక్రవారం దర్శించుకున్నారు. వారితోపాటు వెంకటగిరి ఎమ్మెల్యే కుడిగుండ్ల రామకృష్ణ పాల్గొన్నారు. ఆలయ అర్చకులు మంత్రికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేసి ఆశీర్వదించారు. ఆలయ అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఇవాళ మాజీ మంత్రి, దివంగత నేత మేకపాటి గౌతమ్ రెడ్డి మూడో వర్ధంతి సందర్భంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ నివాళులు అర్పించారు. ‘నా ప్రియ మిత్రుడు మేకపాటి గౌతమ్ రెడ్డి గారి 3వ వర్ధంతి సందర్భంగా నేను ప్రేమగా స్మరించుకుంటున్నాను. నేను నిన్ను మిస్ అవుతున్నాను, గౌతమ్’. అంటూ ట్విటర్‌లో పోస్ట్ చేశారు.
ఉమ్మడి నెల్లూరు జిల్లా, తడ మండలం బోడి లింగాలపాడు వద్ద జాతీయ రహదారిపై విద్యార్థులను తీసుకెళ్తున్న నారాయణ స్కూల్ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. బస్సులో 30 మంది విద్యార్థులు ఉండగా.. పలువురికి గాయాలయ్యాయి. గాయపడిన విద్యార్థులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్సలు అందిస్తున్నారు. ప్రాణాపాయం లేకపోవడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.
ఉమ్మడి జిల్లాలో నాలుగు మండలాలకు ఎంపీడీవోలను నియమిస్తూ జెడ్పీ సీఈఓ విద్యారమ గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. రాపూరు ఎంపీడీవో ఎం.భవానీని కలువాయికి, చిల్లకూరులో పనిచేస్తున్న ఎం.గోపీని కోటకు, వాకాడు ఏఓ శ్రీనివాసులును వాకాడుకు, తడ ఏఓ మల్లికార్జునును సూళ్లూరుపేట ఎంపీడీవోగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు.
సర్వేపల్లి కాలువలో మహిళ మృతదేహం కలకలం రేపింది. వెంకటాచలం మండలంలోని గొలగమూడి గ్రామానికి చెందిన కొందరు రైతులు గేదెల కోసం పొలాల వద్దకు వెళ్లగా సర్వేపల్లి కాలువలో గుర్తుతెలియని మహిళ(35) మృతదేహం కొట్టుకుపోతుండగా గమనించారు. వారు పోలీసులకు సమాచారం అందించారు. చీకటి పడడంతో మృతదేహం ఆచూకీ తెలయలేదు. మహిళ ప్రమాదవశాత్తు కాలువలో పడిందా, లేక సూసైడ్ చేసుకుందా? అనే వివరాలు తెలియాల్సి ఉంది.
ముత్తుకూరు మండలం కృష్ణపట్నం పోర్టులో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. కృష్ణపట్నం పోర్టు సౌత్ గెస్ట్‌హౌస్ వద్ద రెన్నోవేషన్ వర్క్‌లో భాగంగా వెల్డింగ్ పనులు జరుగుతుండగా ఒక గదిలో షార్ట్ సర్క్యూట్ వల్ల చిన్న అగ్ని ప్రమాదం జరిగింది. అప్రమత్తమైన పోర్టు ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో ఎలాంటి ఆస్తి ప్రాణ నష్టం జరగలేదని పోర్టు అధికార వర్గాలు తెలిపాయి.
జిల్లాలో గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆనంద్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని ఎస్‌ఆర్ శంకరన్ హాలులో గ్రూప్-2 పరీక్షల కోఆర్డినేషన్ అధికారి, కందుకూరు సబ్ కలెక్టర్ టి. శ్రీపూజ, డిఆర్‌వో ఉదయభాస్కర్‌రావుతో కలిసి పరీక్షల నిర్వహణపై కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు.
రాష్ట్ర ప్రభుత్వ సేవలను ప్రజలందరూ సంతృప్తి చెందేలా పారదర్శకంగా అందించేందుకు జిల్లా కలెక్టర్లు ప్రత్యేక దృష్టి పెట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ అన్నారు. గురువారం సచివాలయం నుంచి ఆయన జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ ఆనంద్, ఎస్పీ కృష్ణకాంత్ పాల్గొన్నారు.
Sorry, no posts matched your criteria.