Nellore

News March 29, 2026

రాజకీయాల నుంచి శాశ్వతంగా వైదొలగుతా: బీదా మస్తాన్ రావు

image

నెల్లూరు జిల్లాలోని జువ్వలదిన్నె బోట్ల మాయానికి సంబంధించి తన ప్రమేయం ఉందని ఆధారాలతో సహా ఒక్క శాతం నిరూపించినా తన స్థానానికి రాజీనామా చేస్తానని బీదా మస్తాన్ యాదవ్ ప్రకటించారు. అంతేకాకుండా రాజకీయాల నుంచి శాశ్వతంగా వైదొలుగుతానన్నారు. నెల్లూరు నగరంలోని తన నివాసంలో ఆదివారం సమావేశం ఏర్పాటు చేశారు. కొంతమంది రాజకీయ కుట్రతో తనపై దుష్ప్రచారం చేస్తున్నారన్నారు.

News March 29, 2026

నెల్లూరులో దొంగలు ‘రూట్ మార్చారు’

image

గ్యాస్ సిలిండర్లకు డిమాండ్ ఏర్పడడంతో నెల్లూరులో కొత్త తరహా దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఇటీవల బుచ్చిలో 3 గ్యాస్ సిలిండర్లు చోరీకి గురవుగా.. తాజాగా నెల్లూరు రూరల్ వెల్లంటిలో 2 సిలిండర్లు అపహరించారు. వెల్లంటిలోని జెడ్పీ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో రెండు సిలిండర్ల అపహరణపై స్థానిక అంగన్వాడీ టీచర్ మమత పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News March 28, 2026

కందుకూరు: రోడ్డు ప్రమాదంలో ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ మృతి

image

కందుకూరులోని సింహాద్రి నగర్‌కు చెందిన జంపాల వెంకటరమణయ్య (హెడ్ కానిస్టేబుల్), ఒంగోలు ట్రాఫిక్ విభాగంలో విధులు నిర్వహిస్తున్నాడు. శనివారం సాయంత్రం భాగ్యనగర్ మూడో లైన్‌లో బైక్‌పై వెళ్తుండగా అకస్మాత్తుగా కుక్క అడ్డు రావడంతో వాహనం స్కిడ్ అయింది. ఈ ప్రమాదంలో ఆయన తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. తక్షణమే స్థానికులు గాయపడిన వెంకటరమణయ్యను ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు.

నెల్లూరు జిల్లాలో ప్రైవేట్ బస్సులపై మెరుపు దాడులు

image

నెల్లూరు జిల్లాలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై పోలీస్, రవాణా శాఖల అధికారులు సంయుక్తంగా విస్తృత తనిఖీలు చేపట్టారు. జిల్లా ఎస్పీ డాక్టర్ అజిత వేజెండ్ల ఆదేశాలతో వాహనాల ఫిట్‌నెస్, డ్రైవర్ లైసెన్సులు, ఎమర్జెన్సీ ఎగ్జిట్లు, భద్రతా ప్రమాణాలను నిశితంగా పరిశీలిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తూ, ప్రయాణికులు ఏవైనా ఫిర్యాదులు ఉంటే వెంటనే 112 నంబర్‌కు సమాచారం అందించాలన్నారు.

News March 28, 2026

నెల్లూరు కేబినెట్ రేసులో కొత్త పేర్లు

image

నెల్లూరు జిల్లాలో త్వరలో జరగబోయే రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణలో భాగంగా కొత్త ముఖాలకు అవకాశం దక్కే అవకాశాలు ఉన్నాయి. మంత్రులుగా ఉన్న నారాయణ లేదా ఆనం రామనారాయణ రెడ్డిలలో ఒకరిని మారుస్తారనే ప్రచారం సాగుతోంది. వారి స్థానంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డికి మహిళా కోటా లేదా రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ఆయన పనితీరు, దూకుడును బట్టి మంత్రి పదవి ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.

News March 28, 2026

నెల్లూరులో సీఎం చంద్రబాబు పర్యటన ఖరారు

image

జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటనకు ఏర్పాట్లు పూర్తయ్యాయని మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. సీఎం 30న నాయుడుపేటలో టిడ్కో ఇళ్ల పంపిణీలో పాల్గొంటారని అన్నారు. ఒకటో తేదీన ఉదయగిరి నియోజకవర్గంలో వింజమూరులో పెన్షన్ల పంపిణీకి వస్తారని వివరించారు. రెండు పర్యటనలు విజయవంతం చేసేందుకు జిల్లా యంత్రాంగం కృషి చేస్తుందని వెల్లడించారు.