Nellore

News October 16, 2024

నెల్లూరు జిల్లాలో విద్యుత్ కంట్రోల్ రూమ్ నంబర్లు ఇవే..

image

నెల్లూరు జిల్లాలోని ఏడు డివిజన్ల విద్యుత్ భవన్‌లలో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసినట్లు జిల్లా విద్యుత్ శాఖ సూపరింటెండింగ్ ఇంజినీర్ విజయన్ తెలిపారు.
వాటి వివరాలు
➥ నాయుడుపేట-7382623178
➥గూడూరు-7901036852
➥నెల్లూరురూరల్-9381815083
➥నెల్లూరుటౌన్-7901642857
➥ కోవూరు-9705200708
➥కావలి-7901056437
➥ఆత్మకూరు-7901056906
➥విద్యుత్ భవన్-9440817468
అత్యవసరాలల్లో ప్రజలు ఈ నం.కు ఫోన్ చేయాలన్నారు.

News October 15, 2024

నెల్లూరు జిల్లాలో రేపు సెలవు

image

నెల్లూరు జిల్లాలో బుధవారం కూడా భారీ వర్షాలు పడనున్నాయి. ఈ నేపథ్యంలో కలెక్టర్ ఆనంద్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అన్ని పాఠశాలలు, కళాశాలలకు బుధవారం కూడా సెలవు ప్రకటించారు. 72 గంటల పాటు భారీ వర్షాలు ఉంటాయని.. అవసరమైతే తప్ప బయటకు రావద్దని కలెక్టర్ సూచించారు. పెన్నా బ్రిడ్జికి పడిన గండిని జిల్లా ఎస్పీ కృష్ణకాంత్‌తో కలిసి కలెక్టర్ పరిశీలించారు.

News October 15, 2024

నెల్లూరుకు 750 కిలోమీటర్ల దూరంలో అల్పపీడనం

image

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం నెల్లూరుకి 750 కిలోమీటర్లు దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఈ అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో మరో రెండు రోజులు ఉమ్మడి నెల్లూరు జిల్లాతో సహా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ వాయుగుండం 17వ తేదీ నెల్లూరు సమీపంలో తీరం తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

News October 15, 2024

నెల్లూరు, తిరుపతి ఇన్‌ఛార్జ్ మంత్రులు వీరే

image

రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలకు ఇన్‌ఛార్జ్ మంత్రులను నియమించింది. క్యాబినెట్‌‌లోని మంత్రులందరికీ కొత్త జిల్లాల వారీగా ఇన్‌ఛార్జ్ బాధ్యతలు అప్పగించింది. తిరుపతి జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రిగా అనగాని సత్యప్రసాద్, నెల్లూరు జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రిగా మహహ్మద్ ఫరుఖ్ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.

News October 15, 2024

నెల్లూరు: వైస్‌షాపు లాటరీలో చిత్రవిచిత్రాలు

image

➤నెల్లూరు సిటీలో ఓ నాయకుడు 27 మందితో సిండికేట్‌గా మారి 150 అప్లికేషన్లు వేశారు. దరఖాస్తు ఫీజు రూ.3 కోట్లు చెల్లించారు. అయినప్పటికీ ఆయనకు ఒక్క షాపు కూడా రాలేదు.
➤లింగసముద్రం మండలంలో రెండు షాపులకు 68 అప్లికేషన్లు రాగా.. కేవలం ఒకే దరఖాస్తు పెట్టిన మహిళకు షాప్ తగిలింది.
➤ఆత్మకూరు సర్కిల్‌లో 321 అప్లికేషన్లకు ముగ్గురు మహిళలకు దుకాణాలు దక్కాయి.
➤అల్లూరులో ఓ నాయకుడు 15 అప్లికేషన్లు వేయగా ఒక్కటీ రాలేదు.

News October 15, 2024

నెల్లూరు: ప్రభుత్వ ఉద్యోగుల సెలవులు రద్దు

image

అల్పపీడనం, తుఫాను కారణంగా జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం
ఉందని అధికారులు తెలిపారు. కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్లను విడుదల చేశారు. 0861-2331261,7995576699 , జిల్లాలోని ప్రజలు ఈ నెంబర్లకు ఫోన్ చేసి సహాయం పొందవచ్చున్నారు. జిల్లా స్థాయి నుంచి గ్రామస్థాయి వరకు సెలవులో ఉన్న అధికారులు, సిబ్బంది సెలవులు రద్దు చేసుకుని హెడ్ క్వార్టర్స్ లో ఉండాలని కలెక్టర్ ఆదేశించారు.

News October 14, 2024

నెల్లూరు జిల్లాలో రేపు కూడా సెలవు

image

భారీ వర్షాల దృష్ట్యా మంగళవారం కూడా నెల్లూరు జిల్లాలో పాఠశాలలకు, అంగన్వాడీలకు, జూనియర్ కాలేజీలకు సెలవు మంజూరు చేసినట్లు కలెక్టర్ ఓ.ఆనంద్ తెలిపారు. మరో మూడు రోజులు తుఫాన్ ప్రభావం అధికంగా ఉండటంతో వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో సెలవును ప్రకటించారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని, అందుకు తగ్గట్టు అధికారులు ఏర్పాటు చేయాలని సూచించారు.

News October 14, 2024

ప్రశాంతంగా ముగిసిన మద్యం షాపుల లక్కీ డ్రా ప్రక్రియ

image

జిల్లావ్యాప్తంగా మద్యం షాపులు కొరకు దరఖాస్తు చేసుకున్న వారి లక్కీ డ్రా ప్రక్రియ ప్రశాంతంగా ముగిసినట్లు జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ తెలిపారు. రెండు టేబుళ్లను ఏర్పాటుచేసి ఒక్కొక్క టేబుల్‌ వద్ద ఇద్దరు వీడియో గ్రాఫర్లతో పూర్తి ప్రక్రియను వీడియోగ్రఫీ చిత్రీకరించినట్లు చెప్పారు. ఆయా షాపులకు టెండర్లు దాఖలు చేసిన దరఖాస్తుదారుల సమక్షంలోనే లక్కీడిప్‌ తీసి షాపు దక్కించుకున్న వారి పేరును ప్రకటించారు.

News October 14, 2024

నెల్లూరు జిల్లాకు రెడ్ అలర్ట్

image

భారీ వర్షాల కారణంగా నెల్లూరు, తిరుపతి జిల్లాలకు రెడ్ జోన్ ప్రకటించారు. అక్టోబర్ 15 – 18 మధ్యలో తిరుపతి – నెల్లూరు – ప్రకాశం జిల్లాల మీదుగా అత్యధికంగా తుపాను ఎఫెక్టు ఉండనుంది. తిరుపతి – నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. నెల్లూరు – కావలి – తడ – సూళ్లూరుపేట – సత్యవేడు – నాయుడుపేట- శ్రీకాళహస్తి డివిజన్లలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది.

News October 14, 2024

24×7 అప్రమత్తంగా ఉండండి : మంత్రి నారాయణ

image

భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా అధికారులు అందరూ అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ సూచించారు. ఎక్కడ ఏ సమస్య వచ్చినా వెంటనే పరిష్కరించేందుకు సిద్ధంగా ఉండాలని చెప్పారు. 14, 15, 16 తేదీలలో విస్తారంగా వర్షాలు ఉన్నందున అందరూ అప్రమత్తంగా ఉండాలని మంత్రి హెచ్చరించారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలపై దృష్టిసారించాలని అన్నారు.