India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

జిల్లా పర్యటనలో భాగంగా మంత్రి లోకేశ్ ఆదివారం రాత్రి రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నారు. ఎయిర్ పోర్ట్‌లో ఆయనకు ఏపీ వక్ఫ్ బోర్డ్ ఛైర్మన్ అబ్దుల్ అజీజ్ స్వాగతం పలికారు. అనంతరం వారు రోడ్డు మార్గానా నెల్లూరుకు పయనమయ్యారు.

నెల్లూరు బారాషహిద్ దర్గాలో రొట్టెల పండుగ వైభవంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం పండుగ ఏర్పాట్లు, భద్రత, వసతులను కలెక్టర్ ఆనంద్, ఎస్పీ కృష్ణకాంత్ పరిశీలించారు. భక్తులకు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని కలెక్టర్ అధికారుల్ని ఆదేశించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు నిరంతరం పర్యవేక్షించాలని ఎస్పీ సూచించారు.

నెల్లూరు నగరంలోని స్వర్ణాల చెరువు దగ్గర బారాషహీద్ దర్గాలో సోమవారం రొట్టెల పండుగ ఘనంగా ప్రారంభమైంది. ఇవాళ తెల్లవారుజాము నుంచి భక్తులు పలు రాష్ట్రాల నుంచి రొట్టెల పండుగ ప్రాంగణానికి విచ్చేశారు. స్వర్ణాల చెరువులో కోర్కెలు తీర్చే విధంగా భక్తులు రొట్టెలు పంచుకుంటున్నారు. ప్రారంభమైన తొలిరోజే భక్తుల తాకిడి ఎక్కువైంది. క్యూలైన్ల అన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి.

నెల్లూరులోని బారాషహిద్ దర్గా వద్ద నేటి నుంచి రొట్టెల పండగ ప్రారంభం కానుంది. అన్ని గ్రామాల్లో జరుగుతున్న మొహర్రం వేడుకలు ఆదివారంతో ముగుస్తాయి. దీంతో నేడు బారాషహిద్ దర్గా వద్ద భక్తుల రద్దీ తక్కువగా ఉండే అవకాశం ఉంది. సోమవారం నుంచి భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనాలు వేస్తున్నారు. ఇప్పటికే దర్గా వద్ద పోలీస్ అధికారులు 1700 మందితో బందోబస్తు ఏర్పాటు చేశారు.

➠ జులై 6వ తేదీ రాత్రి సందల్ మాలి
➠ 7వ తేదీ రాత్రి గంధం మహాత్సవం
➠ 8వ తేదీ రొట్టెల పండుగ
➠ 9వ తేదీ తహలీల్ ఫాతేహ
➠ 10వ తేదీ ముగింపు వేడుకలు
ఈ మేరకు ఇప్పటికే పలు ప్రాంతాల నుంచి వేలాదిగా ప్రజలు నెల్లూరుకు తరలి వస్తున్నారు.

రొట్టెల పండుగను పటిష్ట బందోబస్త్ నడుమ ప్రశాంతంగా నిర్వహహించడమే లక్ష్యమని IG సర్వశ్రేష్ట త్రిపాఠి తెలిపారు. శనివారం ఆయన రొట్టెల పండుగ బందోబస్త్ ఏర్పాట్లను ఎస్పీ కృష్ణకాంత్‌తో కలసి నిర్వహించారు. పోలీసు సిబ్బంది మానవతాదృక్పదంతో వ్యహరించి విధులు నిర్వహించాలని సూచించారు. 1,700 మంది పోలీసు ఫోర్స్‌తో సర్వం సన్నద్ధం చేశామని తెలిపారు. రొట్టెల పండుగలో వాహనాల పార్కింగ్ అనేది కీలకం అని చెప్పారు.

నెల్లూరు VR స్కూల్ వద్ద పెంచలయ్య, వెంకటేశ్వర్లు అనే ఇద్దరు చిన్నారులు తామూ చదువుకుంటామని కమిషనర్‌ను కోరిన విషయం తెలిసిందే. దీనిపై మంత్రి లోకేశ్ ‘X’ వేదికగా స్పందించారు. ఆ చిన్నారుల విద్యాభ్యాసానికి అవసరమైన ఏర్పాట్లు చేయాల్సిందిగా అక్కడి అధికారులను ఆదేశించాను. ‘పేదరికం నుంచి బయటకు తెచ్చే ఒకే ఒక సాధనం విద్య. చిన్నారులు కలలను సాకారం చేసుకునేందుకు అన్ని విధాల అండగా నిలుస్తాం’ అని ఆయన వెల్లడించారు.

ఏపీ నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఐటీఐ, వెల్డర్ అభ్యర్థులకు ఖతర్‌లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు ఆ సంస్థ అధికారి షేక్ అబ్దుల్ ఖయ్యూం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత, అనుభవం కలిగిన అభ్యర్థులు ఈనెల 25వ తేదీలోగా సంబంధిత ధ్రువపత్రాలతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు.

వరికుంటపాడు హైవేపై శుక్రవారం రాత్రి యాక్సిడెంట్ జరిగింది. ఈ ప్రమాదంలో దుత్తలూరు (M) కొత్తపేటకు చెందిన బర్రె రవి, తాళ్లూరి కృపానందం గాయపడ్డారు. తాళ్లూరి కృపానందం పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం నెల్లూరు తరలిస్తుండగా మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. బైక్ అదుపు తప్పిందా లేక గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టిందా అనే విషయంపై కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.

ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నెల్లూరు బారాషహీద్ దర్గాలో రొట్టెల పండుగ సందడి ముందుగానే ప్రారంభమైంది. శుక్రవారం స్వర్ణాల చెరువు వద్ద భక్తులతో సందడి వాతావరణం నెలకొంది. జులై 6 నుంచి 10 తేదీ వరకు ఐదు రోజులపాటు రొట్టెల పండుగ జరగనుంది. ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రొట్టెల పండుగకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పటిష్ఠమైన చర్యలు తీసుకున్నారు.
Sorry, no posts matched your criteria.