Nellore

News August 28, 2024

పార్టీ మారనున్న వైసీపీ రాజ్యసభ సభ్యుడు బీద ?

image

వైసీపీ రాజ్యసభ సభ్యుడు కావలి ప్రాంతానికి చెందిన బీద మస్తాన్ రావు పార్టీ మారనున్నట్లు జిల్లాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. గతంలో ఈయన టీడీపీ కావలి ఎమ్మెల్యేగా పని చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తర్వాత మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో వైసీపీలో చేరి రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ మారనున్నట్లు వస్తున్న ఊహగానాల్లో ఎటువంటి సందేహం లేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

News August 28, 2024

నెల్లూరు: ఘాట్ రోడ్డులో ప్రమాదం.. ఒకరి స్పాట్ డెడ్

image

రాపూరు మండలం చిట్వేల్ ఘాట్ రోడ్డు సమీపంలోని ఆరో మైలు వద్ద బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ కారు, బైకు, ఆర్టీసీకి చెందిన పెళ్లి బస్సు ఒక్కసారిగా ఢీ కొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో బైక్‌పై వెళ్తున్న వెంకటాచలం మండలం కుచ్చెళ్లపాడుకు చెందిన వీరేపల్లి వెంకటరత్నయ్య అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.

News August 28, 2024

నెల్లూరు : ఫోర్జరీ కేసులో కొనసాగుతున్న విచారణ

image

నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ సంతకాల ఫోర్జరీ కేసులో పోలీసు అధికారులు విచారణ వేగవంతం చేశామన్నారు. ఇప్పటికే ఈ కేసులో నగరపాలక సంస్థ టీపీఓ దేవేంద్రను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మంగళవారం నగర డీఎస్పీ డి. శ్రీనివాసరెడ్డి కార్పొరేషన్ కార్యాలయంలోని టౌన్ ప్లానింగ్ సెక్షన్, నుడా కార్యాలయాల్లో విచారణ చేపట్టారు. పలు కీలక ఫైళ్లను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

News August 28, 2024

నెల్లూరులో అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం

image

నెల్లూరు నగరంలోని దర్గామిట్ట కేవీఆర్ సర్కిల్ వద్ద అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు, గ్రావెల్ టిప్పర్ ఢీ కొన్నాయి. ఈ ఘటనలో డ్రైవర్‌తో పాటు సుమారు 15 మందికి గాయాలయ్యాయి. ఇద్దరికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం. క్షతగాత్రులను నగరంలోని రామచంద్రారెడ్డి ప్రజా వైద్యశాలకు తరలించారు. ఎటువంటి ప్రాణాపాయం జరగలేదని స్థానికులు తెలిపారు. ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

News August 28, 2024

కోవూరు పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన ఎస్పి

image

SPS నెల్లూరు జిల్లాలోని సంతపేట, కోవూరు పోలీసు స్టేషన్ లను జిల్లా ఎస్.పి. జి.కృష్ణకాంత్ మంగళవారం సాయంత్రం సందర్శించారు. పోలీసు స్టేషన్ పరిసరాలను, పోలీసు స్టేషన్స్ మ్యాప్, చార్ట్ లను, స్టేషన్స్ పరిధిలో ఉన్న హైవే, నేర, శాంతి భద్రతల పరిస్థితులను పరిశీలించారు.
మహిళా సంబంధిత సమస్యలపై సత్వరమే స్పందించి, పరిష్కరించాలని ఆదేశించారు.

News August 27, 2024

నెల్లూరు సిటీ వైసీపీ అభ్యర్థి ఖలీల్‌కు గుండెపోటు

image

2024 ఎన్నికల్లో నెల్లూరు సిటీ వైసీపీ అభ్యర్థిగా పోటీచేసిన ఖలీల్ అహ్మద్‌కు గుండెపోటు వచ్చింది. అతనిని హుటాహుటిన నెల్లూరులోని ఓ ఆసుపత్రికి తరలించారు. ఖలీల్ కు వైద్యులు స్టంట్ వేశారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సమాచారం. ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆసుపత్రికి వెళ్లి ఖలీల్, కుటుంబ సభ్యులను పరామర్శించారు.

News August 27, 2024

DSPని పరామర్శించిన ఎస్పీ కృష్ణ కాంత్

image

ప్రమాదంలో గాయపడిన నెల్లూరు రూరల్ DSP శ్రీనివాసరావు ఇంటికి జిల్లా యస్.పి. కృష్ణకాంత్ వెళ్లి పరామర్శించారు.  DSP ధైర్య సాహసాలను ఎస్పీ మెచ్చుకొని, స్యయంగా ప్రశంసాపత్రం అందించి అభినందించారు. జిల్లా పోలీసు యంత్రాంగం వారి వెంటే ఉందని కుటుంబ సభ్యులకు భరోసా కల్పించారు. త్వరగా పూర్తిగా కోలుకొని, కలిసి విధులు నిర్వహించాలని రూరల్ DSP కి మనోధైర్యం చెప్పిన అన్ని విధాల తోడ్పాటు అందిస్తామన్నారు.

News August 27, 2024

నెల్లూరు జిల్లాలో SIల బదిలీ

image

➤ MS రాకేశ్ VR TO మనుబోలు
➤ B.రమేశ్ బాబు దర్గామిట్ట TO సంతపేట
➤ G.బాలకృష్ణ సెబ్ TO సంతపేట
➤ బి.వెంకటేశ్వర్లు DCRB TO నెల్లూరు రూరల్
➤ B.లక్ష్మణరావు గుడ్లూర్ TO నెల్లూరు రూరల్
➤ Sk.సుభాని బాలాజీనగర్ TO లింగసముద్రం
➤ M.బాజీబాబు లింగసముద్రం TO నెల్లూరు VR
➤ P.అనూష సీతారామపురం TO సోమశిల
➤ PS V.సుబ్బారావు సోమశిల TO VR
➤ శ్రీనివాసరావు VR TO మర్రిపాడు

News August 27, 2024

గన్ మిస్‌ఫైర్‌తోనే రమేశ్ బాబు మృతి

image

నాయుడుపేట(M) మేనకూరుకు చెందిన డాక్టర్ రమేశ్ బాబు అమెరికాలో <<13935471>>మృతిచెందిన <<>>విషయం తెలిసిందే. రక్తపు మడుగుల్లో చనిపోవడంతో ఎన్నో అనుమానాలు వచ్చాయి. ‘రమేశ్ గన్ ప్రాక్టీస్‌కు వెళ్లేందుకు శుక్రవారం సాయంత్రం తన ఇంటి వద్ద తుపాకీని క్లీన్ చేశాడు. ఈక్రమంలో మిస్ ఫైర్ కావడంతో బుల్లెట్ ఆయన శరీరంలోకి దూసుకెళ్లి చనిపోయాడు. ఆయనను ఎవరో కాల్చి చంపారనడం అవాస్తవం’ అని NRI శ్రీధర్ రెడ్డి వెల్లడించారు.

News August 27, 2024

మండుతున్న ఎండలు.. దేశంలో నెల్లూరు టాప్

image

నెల్లూరు జిల్లాలో ఆశించిన మేర వర్షాలు పడటం లేదు. మరోవైపు ఎండలు మండుతున్నాయి. వేసవిని తలపించేలా భానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. దీంతో జిల్లా వాసులు వేడి, ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. నిన్నటి రోజున దేశంలోనే అత్యధికంగా నెల్లూరులో 38.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పక్కనే ఉన్న తిరుపతి జిల్లాలో 38.8 డిగ్రీల ఎండ కాసింది. వర్షాలు లేకపోవడం, పొడి వాతావరణం కారణంగా పగటి ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటున్నాయి.