India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నెల్లూరు జిల్లాలో ఓ దొంగ అడ్డంగా దొరికిపోయాడు. ముత్తుకూరు మండలం పిడతాపోలూరు గ్రామ పంచాయతీలోని వడ్డిపాలెంలో ఈ ఘటన జరిగింది. ఎవరూ లేని సమయంలో పట్టపగలే దొంగ ఓ ఇంట్లోకి చొరబడ్డాడు. బీరువాను పగలగొట్టాడు. పక్కన ఇంట్లో ఉన్న మహిళ ఆ శబ్దం వినింది. దొంగను గమనించి ఆ ఇంటి బయట గడియ పెట్టింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో దొంగను అదుపులోకి తీసుకున్నారు.
టీడీపీ ప్రభుత్వం పెట్టే కేసులకు తాము భయపడేది లేదని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. నెల్లూరు వైసీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ‘సర్వేపల్లిలో సోమిరెడ్డి అవినీతికి పాల్పడుతున్నారని దళిత బీజేపీ నేత పెంచలయ్య ఆరోపించారు. ఆయన చెప్పిన వివరాలను నేను ఫార్వర్డ్ చేసినందుకు నాపై కేసు పెట్టారు. A2గా నన్ను చేర్చారు. కేసులకు భయపడే ప్రసక్తే లేదు’ అని కాకాణి అన్నారు.
చిల్లకూరు మండలం, తమ్మినపట్నంలో త్వరలో జరగనున్న క్రిష్ సిటీ శంకుస్థాపన కార్యక్రమానికి భారత ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్నారు. ఈ సందర్బంగా ఇవాళ సభాస్థలిని కలెక్టర్ వెంకటేశ్వర్ పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రధాని సభ విజయవంతం అయ్యేలా ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు, ఆర్డీఓ కిరణ్ కుమార్ తదితరులు ఉన్నారు.
నెల్లూరు : జిల్లాలో స్వయం సహాయక సంఘాల్లో ఉన్న లక్ష ఇరవై వేలమంది మహిళలను లక్షాధికారులు చేయడమే ప్రధాన లక్ష్యంగా లక్ పతి దీదీ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ సాంబశివారెడ్డి తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఈ ఏడాది జిల్లాలో ఉన్న పొదుపు సంఘాల మహిళలను గుర్తించి వారికి అవసరమైన జీవనోపాధిని కల్పిస్తామని తెలియజేశారు.
కావలిలో రియల్ ఎస్టేట్ మాఫియా 123 ఎకరాలు ప్రభుత్వానికి చెందిన భూములను ఆక్రమించుకుంది వాస్తవమేనని కావలి పట్టణ టీడీపీ అధ్యక్షుడు కిషోర్ బాబు పేర్కొన్నారు. సోమవారం స్థానిక టీడీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి దొంగ సర్వే నెంబర్లతో అమ్ముతున్నారని అన్నారు. కావలి ఎమ్మెల్యే చేస్తున్న అభివృద్ధిని ఓర్వలేక కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
సూళ్లూరుపేట రైల్వే స్టేషన్ సమీపంలోని రైలు పట్టాలపై గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని ఆదివారం రైల్వే పోలీసులు గుర్తించారు. మృతుడు సుమారు 45 ఏళ్ల వయస్సు కలిగి ఉన్నాడని తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే హెడ్ కానిస్టేబుల్ కె. శ్రీనివాసరావు వివరించారు.
వైసీపీ హయాంలో ఉపాధిహామీ పథకంలో కొందరు సిబ్బంది చేతివాటం ప్రదర్శించారు. వెంకటగిరి నియోజకవర్గం కలువాయిలో స్థానికంగా ఉండే అర్హుల జాబ్ కార్డుల్లో.. అక్కడ లేని వారి పేర్లు చేర్చి రూ. లక్షలు కాజేశారు. ఏడుగురు క్షేత్రసహాయకులు, ఒక మేట్, ముగ్గురు టీఏలు, ఈసీలపై మొత్తం 12 మందిపై వేటు వేసినట్లు ఎంపీడీవో గోవర్దన్ తెలిపారు
భక్తితో నిండిన ఈ కృష్ణాష్టమి పర్వదినం మీ జీవితంలో ఆనందం, శాంతి నింపాలని ఆ శ్రీ కృష్ణుడి అనుగ్రహం రాష్ట్ర ప్రజలపై ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు. సోమవారం కృష్ణాష్టమి సందర్భంగా ప్రజలందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. శ్రీకృష్ణ జన్మాష్టమికి హిందూ సాంప్రదాయంలో ప్రాముఖ్యత ఉంటుందన్నారు.
ఉదయగిరి పట్టణ శివారులోని దుర్గం కొండపై ఆదివారం రాత్రి మంటలు వచ్చాయి. వన్య ప్రాణులకు ప్రమాదం ఉందని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం సెలవు రోజు కావడంతో ఈ కొండకు పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. వన భోజనాలు చేస్తుంటారు. ఈ క్రమంలో ఆకతాయిలు ఎవరైనా సిగరెట్ పడేసి ఉంటారని లేదా పొయ్యి వెలిగించి చల్లార్చకపోవడంతో మంటలు వచ్చి ఉంటాయని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
పెళ్లకూరు మండలం కానూరు రాజుపాలెం అడవుల్లో కోడి పందేల శిబిరంపై ఎస్సై శ్రీకాంత్ సిబ్బందితో కలిసి ఆదివారం ఉదయం దాడి చేశారు. 10 బైక్‌లు, 17 ఫోన్స్, 2 కోడి పుంజులతో పాటు రూ.3,820 నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. మొత్తం 19 మందిపై కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. కోడి పందేలు, పేకాట ఆడితే ఉపేక్షించేది లేదని ఆయన హెచ్చరించారు.
Sorry, no posts matched your criteria.