Nellore

News August 22, 2024

ప్రస్తుతం అందుబాటులో మర్రిపాడు ఇసుక డిపో: కలెక్టర్

image

ప్రజలకు ఇసుక రవాణా భారం తగ్గించడానికి ఇసుక రవాణా ధరలు నిర్ధారించామని కలెక్టర్ ఓ.ఆనంద్ వెల్లడించారు. గురువారం ట్రాన్స్ పోర్ట్, రవాణా శాఖ అధికారులతో తిక్కన ప్రాంగణంలో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం మన జిల్లాలో మర్రిపాడు ఇసుక డిపో పనిచేస్తోందని, దీనిలో 36 వేల మెట్రిక్ టన్నుల ఇసుక అందుబాటులో ఉందని తెలిపారు. ఇక్కడి నుంచి రోజుకు వెయ్యి టన్నుల ఇసుక సరఫరా అవుతోందని తెలిపారు.

News August 22, 2024

నెల్లూరు జిల్లాలో అక్రమంగా ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు: ఎస్పీ

image

జిల్లాలో ఇసుక అక్రమ రవాణా చేస్తే ఉపేక్షించేదిలేదని, బ్లాక్ మార్కెటింగ్ అక్రమ డంపులపై కఠిన చర్యలు తీసుకుంటామని
ఎస్పీ జీ.కృష్ణకాంత్ హెచ్చరించారు. మర్రిపాడులో ఉన్న ఇసుక రీచ్ వద్ద పటిష్టమైన నిఘా ఏర్పాటు చేశామన్నారు. స్టాక్ పాయింట్ ప్రాంతానికి వే బిల్లులు, టైం స్లాట్‌లో ఉన్న వాహనాలను మాత్రమే అనుమతి ఇస్తామన్నారు. టోల్ ప్లాజా వద్ద టీంలు ఏర్పాటు చేసి నిరంతరం తనిఖీలు చేస్తామన్నారు.

News August 22, 2024

గూడూరు ఎమ్మెల్యేతో మాజీ ఎమ్మెల్యే భేటీ

image

గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ కుమార్‌ను వారి నివాసంలో గురువారం గూడూరు మాజీ ఎమ్మెల్యే వరప్రసాదరావు కలిశారు. నియోజకవర్గ అభివృద్ధి పనులపై చర్చించారు. ముఖ్యంగా గూడూరు రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులకు సంబంధించి ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు రాబట్టాలని ఆయన కోరారు. అలాగే రహదారుల మరమ్మతులపై దృష్టి సారించాలన్నారు.

News August 22, 2024

నెల్లూరు: హైస్కూల్ HM సస్పెండ్

image

ఇటీవల నెల్లూరు నగరంలోని బీవీ నగర్ కేఎన్ఆర్ ఉన్నత పాఠశాలలో నిర్మాణ పనులు జరుగుతుండగా, స్లాబ్ కూలి 9వ తరగతి విద్యార్థి మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు విద్యాశాఖ అధికారులు విచారణ చేపట్టారు. విచారణ అనంతరం 26 పేజీల నివేదికను కలెక్టర్‌కు అందజేశారు. పాఠశాల హెచ్ఎమ్ విజయరత్నం నిర్లక్ష్యం కారణంగానే ఘటన జరిగినట్లు గుర్తించి ఆయన్ను అధికారులు సస్పెండ్ చేశారు.

News August 22, 2024

నెల్లూరు: ‘ఇసుక తోలకంలో వే బిల్ లేకుంటే చర్యలు’

image

ఇసుక రవాణా మీద జిల్లా కలెక్టర్, జిల్లా SP సంయుక్తంగా ప్రెస్ మీట్ ద్వారా గురువారం ప్రజలకు సూచనలు చేశారు. ఇసుక కావలసిన వారు టోల్ ఫ్రీ ద్వారా నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు. మైన్స్ డిపార్ట్మెంట్ నందు పేర్లు నమోదు చేసుకున్న రవాణా వాహనాల ద్వారా ఇసుకను అందిస్తామని తెలిపారు. ఏ సమస్య ఉన్నప్పటికీ 24 గంటలలో సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. వే బిల్ లేకుంటే చర్యలు తీసుకుంటామని SP తెలిపారు.

News August 22, 2024

నెల్లూరు: పెన్నా నదిలో మృతదేహం కలకలం

image

పెన్నా నదివద్ద గురువారం మధ్యాహ్నం ఓ మృతదేహం కలకలం రేపింది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతి చెందిన వ్యక్తిని బయటకు తీశారు. మృతుడు ఆత్మహత్య చేసుకున్నాడా? లేక ఎవరైనా హత్య చేసి పెన్నా నదిలో పడేశారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరింత సమాచారం తెలియాల్సిఉంది.

News August 22, 2024

నెల్లూరు: 48 గంటల్లోనే దొంగలను పట్టుకున్న పోలీసులు

image

నెల్లూరు జిల్లా ఏఎస్ పేట మండలం రాజవోలు గ్రామంలో బంకు నిర్వహిస్తున్న ఓ మహిళ మెడలో బంగారు గొలుసులు లాకెళ్లిన ఇద్దరు నిందితులను 48 గంటల్లో సంగం సర్కిల్ పోలీసులు పట్టుకున్నారు. ఈ విషయమై ఆత్మకూరు డిఎస్పీ కార్యాలయంలో డి.ఎస్.పి K.వేణుగోపాల్ సమావేశం నిర్వహించి కేసు వివరాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సీఐ వేమారెడ్డి, ఎస్ఐ ప్రసాద్ రెడ్డిలు పాల్గొన్నారు.

News August 22, 2024

నెల్లూరు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో 5 కిలోల కణతి తొలగింపు

image

జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో ఓ మహిళకు వైద్యులు అరుదైన చికిత్స చేశారు. చేజర్లకు చెందిన జెర్రి రమణమ్మ(62) కుడి తొడపై కణతి ఏర్పడగా.. అసోసియేట్ ప్రొఫెసర్ డా. కాలేషా బాషా, డాక్టర్ సుహాసిని, డాక్టర్ ఉమా మహేశ్ శస్త్ర చికిత్స చేసి 5 కిలోల కణతి తొలగించారు. వీరిని సూపరింటెండెంట్ డాక్టర్ సిద్ధానాయక్ అభినందించారు.

News August 22, 2024

నాయుడుపేటలో దారుణం.. నడి రోడ్డుపై పురిటి బిడ్డ

image

తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం తిమ్మాజి కండ్రిక సమీపంలో పురిటి బిడ్డను గుర్తు తెలియని వ్యక్తులు రోడ్డుపై పడవేసి వెళ్లారు. రోడ్డుపై పసికందు పడి ఉండటాన్ని స్థానికులు గుర్తించి నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. బిడ్డ పరిస్థితి ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. పురిటి బిడ్డ ఆచూకీ కోసం ఆరా తీస్తున్నారు.

News August 22, 2024

నెల్లూరు: ఇద్దరు కానిస్టేబుళ్లు, ఒక హోంగార్డు సస్పెండ్

image

వెంకటగిరిలో ఇద్దరు కానిస్టేబుళ్లను తిరుపతి SP సుబ్బరాయుడు బుధవారం సస్పెండ్ చేశారు. వెంకటగిరి పోలీసుస్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుళ్లు డి.రమణ. కె.మస్తాన్ అవినీతికి పాల్పడుతున్నారనే ఆరోపణలు వచ్చాయి. విచారణ చేపట్టగా అవినీతికి పాల్పడినట్లు నిర్ధారణ కావడంతో సస్పెండ్ చేశారు. అదేవిధంగా శ్రీసిటీ పోలీసు స్టేషన్‌లో పనిచేసే హోంగార్డు చిన్న తంబి అక్రమ వసూళ్లకు పాల్పడగా సస్పెండ్ చేశారు.