Nellore

News August 20, 2024

నెల్లూరు: వృక్షానికి రాఖీ కట్టిన విద్యార్థులు

image

అనంతసాగరం మండలం చిలకలమర్రి జడ్పీ హైస్కూల్లో హెచ్ఎం సురేశ్ ఆధ్వర్యంలో రక్షాబంధన్ పండుగను సోమవారం సందడిగా జరుపుకున్నారు. విద్యార్థినులు విద్యార్థులకు రాఖీలు కట్టారు. వృక్షానికి కూడా రాఖీ కట్టి పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఉపాధ్యాయుడు చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థుల మధ్య సోదర భావాన్ని చాటడానికి రక్షాబంధన్ పండుగ ఎంతో దోహదపడుతుందన్నారు.

News August 20, 2024

నెల్లూరు జిల్లా యువకులకు అరుదైన అవకాశం

image

విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ NCC వాలంటీర్లు యుగంధర్ రెడ్డి, లవకుమార్‌ అరుదైన అవకాశం దక్కించుకున్నారు. దేశ రాజధానిలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ప్రత్యేక్షంగా వీక్షించే అవకాశం దక్కించుకున్నారు. దేశ వ్యాప్తంగా 200మందిని, రాష్ట్ర వ్యాప్తంగా 20 మందికి ఈ అవకాశం కల్పించారు. వారిలో VSUకు చెందిన విద్యార్థులు యుగంధర్ రెడ్డి, లవకుమార్‌ ఉండడం విశేషం. దీంతో వారిని పలువురు అభినందించారు.

News August 20, 2024

నెల్లూరు: ఒక్కరోజే 330కు పైగా రిజిస్ట్రేషన్లు

image

నెల్లూరు జిల్లా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో సోమవారం ఒక్కరోజే 330కి పైగా వివిధ రిజిస్ట్రేషన్లు జరిగాయి. గత 3 నెలలుగా పదుల సంఖ్యలో జరిగిన రిజిస్ట్రేషన్లు.. సోమవారం మంచి రోజు కావడంతో ఎక్కువ రిజిస్ట్రేషన్లు జరిగినట్లు సమాచారం. నెల్లూరు ప్రధాన కార్యాలయంలో 80, స్టోన్ హౌస్ పేటలో 25, జిల్లాలోని మండల కేంద్రాల్లో ఉన్న అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో 225 కు పైగా రిజిస్ట్రేషన్లు జరిగాయి.

News August 20, 2024

నెల్లూరు: పొగాకు కొనుగోలు చరిత్రలోనే అత్యధిక ధర

image

నెల్లూరు పొగాకు కొనుగోలు వేలం కేంద్రంలో దక్షిణ ప్రాంత తేలికపాటి (SLS) నేలలో పండించే పొగాకు కొనుగోలు చరిత్రలో అత్యధికంగా కేజీ పొగాకు ₹358 రూపాయలు అమ్ముడయ్యిందని నిర్వహకులు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. నెల్లూరు జిల్లా D.C పల్లిలోని పొగాకు వేలం కేంద్రంలో ప్రారంభంలో కేజీ ₹220 రూపాయలు కాగా ప్రస్తుతం అత్యధికంగా ₹358 రూపాయలు పలకడం పొగాకు కొనుగోలు చరిత్రలోనే రికార్డుగా రైతులు హర్షలు వ్యక్తం చేస్తున్నారు.

News August 19, 2024

నెల్లూరు: ఒక గేటు పెట్టలేని ప్రభుత్వం 5 ఏళ్లు పాలించింది: సీఎం

image

సోమశిల ప్రాజెక్టు సందర్శించిన అనంతరం ఏర్పాటు చేసిన ప్రజావేదికలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. అందులో ఆయన మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వంలో గుండ్లకమ్మ ప్రాజెక్టులో గేటు పోతే దానిని పెట్టకుండా 5 ఏళ్లు పాలించిందని విమర్శించారు. సోమశిల మరమ్మతులకు రూ. 95 కోట్లు ఖర్చు అవుతుందన్నారు. ఇప్పుడున్న NDA ప్రభుత్వం ఎన్నికష్టాలు ఉన్నా అన్ని పనులు పూర్తి చేస్తామని సీఎం పేర్కొన్నారు.

News August 19, 2024

మరికాసేపట్లో సోమశిలకు ముఖ్యమంత్రి రాక

image

మరికాసేపట్లో సోమశిలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హెలికాప్టర్లో చేరుకోనున్నారు. ఈ నేపథ్యంలో గిరిజన గురుకుల పాఠశాల వద్ద హెలిపాడ్ వద్ద భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. జలాశయం వద్ద నుంచి గ్రామంలో వరకు భారీగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఇప్పటికే భారీగా కూటమి నాయకులు చేరుకున్నారు. పలువురు ఎమ్మెల్యేలు, మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సోమశిలకు చేరుకున్నారు.

News August 19, 2024

CM చంద్రబాబుకు రాఖీ కట్టిన ఎమ్మెల్యే విజయశ్రీ

image

సీఎం చంద్రబాబు నాయుడు సోమవారం హెలికాప్టర్‌లో శ్రీసిటీ హెలిప్యాడ్‌కు చేరుకున్నారు. ఆయనకు సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ ఘన స్వాగతం పలికారు. అనంతరం చంద్రబాబుకు రాఖీ కట్టి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో శ్రీసిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.

News August 19, 2024

నెల్లూరు: యువకుడు పెళ్లి చేసుకోలేదని యువతి సూసైడ్

image

యువకుడు పెళ్లి చేసుకోలేదని యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన నెల్లూరులో చోటుచేసుకుంది. పోలీసుల కథనం .. నెల్లూరు ముత్యాలపాలెంలో వెంకటరమణ కుటుంబం నివాసం ఉంటోంది. ఆయనకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె జీవిత(19)కు ఇన్‌స్టాగ్రాంలో రామూర్తి నగర్‌కు చెందిన ప్రతాప్‌తో పరిచయం ఏర్పడి ప్రేమకు దారితీసింది. కొంతకాలంగా వివాహం చేసుకోమని కోరుతుండగా ఆతడు కాలయాపన చేయడంతో ఇంట్లో ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

News August 19, 2024

కావలి: పెళ్లి చేసుకుంటానని బాలికకు గర్భం చేశాడు

image

పెళ్లి చేసుకుంటానని మాయమాటలతో లొంగదీసుకుని బాలికకు గర్బం చేసిన ఉదంతం కావలిలో వెలుగు చూసింది. పట్టణానికి చెందిన బాలిక ప్రకాశం జిల్లా దర్శిలో అమ్మమ్మ వద్దకు వెళ్లింది. అక్కడ వరుణ్ సాయి అనే వ్యక్తి ప్రేమిస్తున్నట్లు చెప్పి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఇటీవల నీరసంగా ఉన్న బాలికను ఆసుపత్రికి తీసుకెళితే గర్భం దాల్చినట్లు తేల్చారు. బాలిక తల్లిదండ్రులు కావలి ఒకటో పట్టణ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

News August 19, 2024

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం రద్దు

image

నెల్లూరు జిల్లా ఎస్పి కార్యాలయంలో సోమవారం జరగనున్న ప్రజాసమస్యల ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు జిల్లా పోలీసు కార్యాలయం నుంచి అధికారులు ఒక ప్రకటనను విడుదల చేశార., సోమవారం జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన ఉన్నందున రద్దు చేశామన్నారు. ప్రజలు ఈ విషయం గమనించాలని కోరారు.