India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
వాకాడు మండలం తూపిలిపాలెంను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్ అన్నారు. ఆయన వాకాడు మండలం తూపిలిపాలెం తీరప్రాంతాన్ని శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తూపిలిపాలెం గ్రామాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామని, బీచ్‌ను అభివృద్ధి చేసి పర్యాటకులకు అందుబాటులోకి తెస్తామని అన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ కిరణ్ కుమార్, అన్ని శాఖల అధికారులు ఉన్నారు.
పాండిచ్చేరి నుంచి కాకినాడ పోర్టు వెళ్లే సర్కార్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌లో, సాంకేతిక లోపం తలెత్తి నాయుడుపేట రైల్వే స్టేషన్ వద్దకు వచ్చే సరికి ఎస్ 8 బోగీలో పొగలు వ్యాపించాయి. ట్రైన్ బోగీలో నుంచి పొగలు రావడంతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. ట్రైన్‌లోని ప్రయాణికులు, ట్రైన్ కోసం ప్లాట్ ఫామ్‌పై వేచి ఉన్న ప్రయాణికులు భయంతో, తమ లగేజీలను తీసుకుని రైల్వే స్టేషన్ వెలుపలకు పరుగులు తీశారు.
బారాషాహీద్ దర్గా నందు ఏర్పాటు చేసిన పోలీసు కమాండ్ కంట్రోల్ రూమ్‌కు అనుసంధానం చేసిన డ్రోన్, PTZ, CC TV ఫుటేజీలను జిల్లా ఎస్పీ కృష్ణ కాంత్ శుక్రవారం సాయంత్రం పరిశీలించారు. బందోబస్త్ సిబ్బందికి తగు సూచనలు చేశారు. మొదటి రోజు 92, రెండవ రోజు 140, మూడవ రోజు 152 మంది తప్పిపోయిన చిన్నారులను తల్లిదండ్రుల వద్దకు నెల్లూరు పోలీసులు చేర్చారు. నిరంతరం పోలీసు పర్యవేక్షణలో దర్గా ప్రాంగణం ఉందన్నారు.
నెల్లూరు దర్గాలో జరిగే రొట్టెల పండుగను సీఎం చంద్రబాబు వీడియో వర్చువల్ ద్వారా వీక్షించారు. అనంతరం భక్తులతో, టీడీపీ నేతలతో లైవ్‌లో మాట్లాడుతూ.. రాష్ట్రం అభివృద్ధి చెంది, బాగా ఆదాయం రావాలని చెరువులో రొట్టెలు వదలమని చంద్రబాబు తెలిపారు. బారాషహీద్ దర్గాలో ఏర్పాటుచేసిన వీడియో వర్చువల్ కార్యక్రమానికి ఎంపీ ప్రభాకర్ రెడ్డి, మంత్రులు నారాయణ, ఆనం, ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి హాజరయ్యారు.

నెల్లూరు బారా షహీద్ దర్గా వద్ద అత్యంత వైభవంగా రొట్టెల పండుగ కొనసాగుతోంది. దేశంలోని పలు ప్రాంతాల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. ఇవాళ సీఎం చంద్రబాబు వర్చువల్ సందేశం ఇవ్వనున్నారు. దర్గా, స్వర్ణాల చెరువు ప్రాంతంలో భారీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. లక్షలాది మంది భక్తుల రాకతో నెల్లూరు కిటకిటలాడుతోంది.
ఇంజనీరింగ్‌లో సీఎస్ఈ గ్రూప్‌కు ఎంత డిమాండ్ ఉంది. నెల్లూరు జిల్లాలో ఇంజనీరింగ్ మొదటి విడత కౌన్సిలింగ్ 8722 సీట్లకు 6788 సీట్లు భర్తీ అయ్యాయి. సిఎస్ఈ గ్రూప్‌కు 3357 సీట్లు కేటాయించగా ఇప్పటికే 3059 సీట్లు భర్తీ అయ్యాయి. ఈసీఈ గ్రూపు 1725 సీట్లకు 1317 సీట్లు, ఏఐఎం, ఏఐఎం గ్రూపులకు 720 సీట్లకుగాను 661 భర్తీ కాగా మెకానికల్, ఈఈఈ ఉన్న సీట్లలో 50శాతం కూడా చేరలేదని ఉన్నత విద్య మండలి తెలిపింది.
దుత్తలూరు మండలం ఎరుకల్లు పాఠశాలలో మద్యం తాగి అపస్మారక స్థితిలో పడిఉన్న ఘటన శుక్రవారం జరిగింది. ఉదయం పాఠశాలకు వచ్చేసరికి గదిలో పడి ఉండడాన్ని గమనించిన విద్యార్థులు భయాందోళన చెందారు. గది తలుపులు తాళం వేసి ఉంటే ఎలా లోపలకు వెళ్లాడని గ్రామస్థులు ప్రశ్నిస్తున్నారు. ఆరు బయట, ప్రభుత్వ పాఠశాలలో మద్యం తాగకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
వెంకటాచలం మండలం కాకుటూరులోని విక్రయ సింహపురి విశ్వవిద్యాలయం ఇన్‌ఛార్జ్ వీసీగా విజయభాస్కర్ రావు నియమితులయ్యారు. ఈయన తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో భౌతికశాస్త్రం లెక్చరర్‌గా, పరిశోధనాభివృద్ధి డీన్‌గా పనిచేస్తున్నారు. మరికాసేపట్లో ఆయన బాధ్యతలు తీసుకోనున్నట్లు VSU అధికారులు తెలిపారు.
Sorry, no posts matched your criteria.