India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

వింజమూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏఎస్ పేట మండలం రాజవోలు గ్రామానికి చెందిన కూరపాటి సురేంద్ర (27) మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. మెడికల్ షాపులో పనిచేస్తూ అందరితో కలుపుగోలుగా ఉండే సురేంద్ర మరణవార్త విని స్థానికులు కన్నీరుమున్నీరవుతున్నారు. మృతుడికి రెండేళ్ల క్రితమే వివాహం జరగగా, ఏడాది వయసున్న పాప ఉంది.

నెల్లూరు నగర మేయర్ పదవి ఎంపిక రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. మాజీ మేయర్ స్రవంతికి కేటాయించిన రిజర్వేషన్ ప్రకారమే సీటు భర్తీ చేయాలని ఆమె భర్త ఆధ్వర్యంలో గిరిజన నేతలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఇన్‌ఛార్జ్ మేయర్‌గా రూప్ కుమార్ యాదవ్ కొనసాగుతుండగా, ఎన్నిక ఆలస్యంపై స్రవంతి వర్గం అసహనం వ్యక్తం చేస్తోంది. మాజీ మేయర్ ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రులను కలవడం జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది.

జిల్లాలో ఈ నెల 23 నుంచి ప్రారంభమయ్యే ఇంటర్మీడియట్, మార్చి 16 నుంచి జరగనున్న పదో తరగతి పరీక్షల నిర్వహణపై జిల్లా రెవెన్యూ అధికారి విజయకుమార్ సమీక్ష నిర్వహించారు. పరీక్షలను ఎటువంటి లోటుపాట్లు లేకుండా, పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. పరీక్షా కేంద్రాల వద్ద తప్పనిసరిగా 144 సెక్షన్ అమలు చేయాలని, విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు జరిగేలా చూడాలని సూచించారు.

నెల్లూరు జిల్లాలోని అన్ని శాఖల్లో అర్హత కలిగిన వారందరికీ రానున్న నెల రోజుల్లో ప్రమోషన్లు కల్పించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆదేశించారు. పానల్ జాబితాలను తయారు చేయాలని సూచించారు. కొన్ని శాఖల్లో ఎప్పటినుంచో సర్వీస్‌లో ఉంటూ ప్రమోషన్ పొందని వారు ఇంకా ఉన్నారని చెప్పారు. క్రిమినల్, శాఖా పరమైన కేసులు లేని వారందరికీ ప్రమోషన్ ఇవ్వాలని సూచించారు.

10వ తరగతి, ఇంటర్ విద్యార్థులు పరీక్షలుపై ఫోకస్ చేయాలా? మ్యాచ్‌లు చూడాలా అన్న సందిగ్ధంలో ఉన్నారు. ఈ నెల 17 నుంచి CBSE పరీక్షలు ప్రారంభం కానుండగా, 23 నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. T20 వరల్డ్ కప్ జరుగుతున్న నేపథ్యంలో విద్యార్థులు మ్యాచ్‌లు చూస్తూ టీవీలకు అతుక్కుపోతున్నారు. విద్యార్థుల జీవితాల్లో ముఖ్యమైన పరీక్షలు కావడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు.

తపాలా శాఖలో గ్రామీణ డాక్ సేవక్ ఖాళీల భర్తీకి నెల క్రితం నోటిఫికేషన్ విడుదల కాగా దరఖాస్తుకు నేడు చివరి తేదీ. పదో తరగతి మార్కుల మెరిట్‌తో వీటిని భర్తీ చేయనున్నారు. నెల్లూరు డివిజన్‌లో 50, గూడూరు డివిజన్‌లో 31 ఖాళీలు ఉన్నాయి. ఆసక్తి ఉన్నవారు నేటి సాయంత్రంలోగా indiapost.gov.inలో అప్లై చేయాలి.
వేతనం వివరాలు:
☞ బీపీఎం పోస్టులకు నెలకు రూ.12,000-29,380
☞ ఏబీపీఎం/ డాక్ సేవక్ పోస్టులకు రూ.10,000- 24,470

ఉదయగిరి ARR ప్రభుత్వ జూనియర్ కళాశాల సమీపంలో రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. పట్టణానికి చెందిన జన్నత్ అనే యువకుడు నడుచుకుంటూ వెళ్తుండగా బైక్ ఢీకొట్టడంతో తలకు బలమైన గాయమైంది. వెంటనే సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతి చెందిన వ్యక్తి ఉదయగిరి ఉపసర్పంచ్ షేక్ ముత్తూజా హుస్సేన్ తమ్ముడుగా గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Sorry, no posts matched your criteria.