Nellore

News August 16, 2024

వెంకటచలం: లవంగంపై సూక్ష్మ జాతీయ జెండా

image

ఆగస్టు 15 సందర్భంగా లవంగంపై అతి సూక్ష్మ సైజులో జాతీయ జెండాను రూపొందించి మండలంలోని యాచవరం గ్రామానికి చెందిన సూక్ష్మ కళాకారుడు ఆలూరు రాము ఆచారి బుధవారం అందరినీ అబ్బుర పరిచారు. లవంగంపై చిన్న సైజు కర్ర పుల్లను తయారుచేసి పేపర్ పై సూక్ష్మ సైజులో జాతీయ జెండాను తయారుచేసి గ్రామంలో ప్రదర్శించారు. పలువురు రాము ప్రతిభను అభినందించారు.

News August 16, 2024

సూళ్లూరుపేట: ఇస్రో SSLV-D3 ప్రయోగం విజయవంతం

image

శ్రీహరికోటలోని షార్ నుంచి దూసుకెళ్లిన SSLV-D3 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. ఈవోఎస్-08ను సైంటిస్టులు కక్ష్యలో ప్రవేశపెట్టారు. ఉదయం 9.17 గంటలకు రాకెట్ నింగిలోకి దూసుకెళ్లగా, 4 దశల్లో ఘన, ద్రవ ఇంధనాలను ఉపయోగించి భూమికి 475 కిలోమీటర్ల ఎత్తులో ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టారు. మొత్తంగా 16.57 నిమిషాల్లో ప్రయోగం ముగిసింది. దీంతో సైంటిస్టులు సంతోషం వ్యక్తం చేశారు.

News August 16, 2024

అన్నా క్యాంటీన్‌లు ప్రారంభించిన మంత్రి ఆనం, జిల్లా కలెక్టర్

image

పేదవాని కడుపు నింపే అన్న క్యాంటీన్‌ను నెల్లూరు నగరంలోని 48వ డివిజన్‌లో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఆనంద్ ప్రారంభించారు. ప్రతి పేదవానికి కూడు, గుడ్డ, నీడ అందించాలనే ఎన్‌టి‌ఆర్ ఆశయ సాధనకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పునః ప్రతిష్ఠ చేశారని మంత్రి వెల్లడించారు. అనంతరం అన్న క్యాంటీన్‌లో టిఫిన్ చేశారు.

News August 16, 2024

నెల్లూరు జిల్లా నుంచి ఎన్నికైన షేక్ అమీర్

image

నెల్లూరు జిల్లాకు చెందిన అమీర్‌కు ప్రత్యేక అభినందనలు ఉన్నతాధికారులు తెలిపారు. ఆగస్టు 15న అమరావతిలో జరిగిన
పంద్రాగస్టు వేడుకలకు ఎన్‌సీసీ విన్యాసాల విభాగం తరపున నెల్లూరు నుంచి షేక్ అమీర్ ఎంపికయ్యారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు జెండా వందనం చేశారు. ఈ క్రమంలో నెల్లూరుకు చెందిన షేక్ అమీర్ తన వారితో మైదానంలో నిర్వహించిన కవాతు అబ్బురపరిచింది.

News August 16, 2024

కావలి: తాహశీల్దార్‌పై వేటుకు రంగం సిద్ధం..!

image

కావలి మాజీ ఎమ్మెల్యే కారు చోదకుడిగా పని చేస్తూ కూడబెట్టుకున్న సొమ్ముతో స్థలం కొనుగోలుతో పాటు ఇలాగ అనేక అక్రమాలు పాల్పడిన వ్యక్తికి అప్పటి తాహశీల్దార్ సహకరించారన్న సమాచారంతో తహసీల్దారుపై చర్యలకు ఉన్నతాధికారులు సిద్ధమవుతున్నారు. వైసీపీ నాయకులతో అంటకాగి అక్రమాలకు పాల్పడిన వారి పాపాలు పండుతున్నాయి. ఈ క్రమంలో గతంలో పనిచేసిన ఓ తాహశీల్దార్‌పై సస్పెండ్ వేటు పడనున్నట్లు సమాచారం.

News August 16, 2024

ఉపరాష్ట్ర పతి పర్యటన కోసం మంత్రి ఆనంని నియామకం

image

భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ రాష్ట్ర పర్యటనకు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ని రాష్ట్ర ప్రభుత్వం నామినేట్ చేసింది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తరపున భారత ఉపరాష్ట్రపతి కి స్వాగత, వీడ్కోలు కార్యక్రమాలతో పాటు భారత ఉపరాష్ట్రపతి తో కలిసి ప్రత్యేక హెలిక్యాప్టర్లో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రయాణిస్తారు.

News August 15, 2024

ఉప రాష్ట్రపతి పర్యటన వివరాలు

image

భారత ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌కడ్ 17వ తేదీ నెల్లూరు పర్యటన రానున్నారు.. 17వ తేదీ ఉదయం 9:50 కి నెల్లూరు పోలీసు పరేడ్ మైదానంలో ప్రత్యేక హెలికాప్టర్ చేరుకోనున్నారు. అక్కడ 10:30 నుంచి మధ్యహ్నం 2:55 వరకు వెంకటాచలంలోని స్వర్ణాంధ్ర భారత్ ట్రస్ట్ వార్షికోత్సవ వేడుకలలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 3:55 గంటలకు రేణిగుంట విమానాశ్రయంకు చేరుకుంటారు.

News August 15, 2024

నెల్లూరు బీవీ నగర్‌లో దారుణ హ‌త్య‌

image

నెల్లూరు బీవీ నగర్‌లో దారుణ హ‌త్య‌ చోటుచేసుకుంది. కెఎన్ఆర్ హైస్కూల్ స‌మీపంలోని రైల్వే వీధి ట్రాక్ స‌మీపంలో గుర్తుతెలియని వ్యక్తులు ఓ యువకుడిని దారుణంగా హత్య చేసి పరారయ్యారు. మృతుడు మ‌న్నేప‌ల్లి వేణుగా గుర్తించారు. సమాచారం అందుకున్న వేదయపాలెం 5వ టౌన్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News August 15, 2024

మర్రిపాడులో మళ్లీ పెద్దపులి సంచారం కలకలం

image

నెల్లూరు – కడప అంతర జిల్లా సరిహద్దు సమీపంలోని మర్రిపాడు మండలం, కదిరినాయుడు పల్లి బిట్ పరిధిలోని అటవీ ప్రాంతంలోకి ఓ పెద్ద పులి వెళుతున్నట్లు కనిపించిందని ఆటో డ్రైవర్ తెలిపాడు. గత రాత్రి 7 గంటల సమయంలో ఈ పెద్ద పులి కనిపించినట్లు తెలిపాడు. జూన్ 23వ తేదీ కదిరినాయుడు పల్లి అటవీ ప్రాంతంలో ఓ పెద్ద పులిని అటవీ శాఖ అధికారులు గుర్తించిన విషయం తెలిసిందే.

News August 15, 2024

కలువాయి: సైబర్‌ వలలో ఉపాధ్యాయుడు

image

సైబర్‌ నేరస్థులు ఓ ఉపాధ్యాయుడిని బురిడి కొట్టించి రూ.63 వేల నగదు స్వాహాచేశారు. ఈ సంఘటన బుధవారం కలువాయిలో జరిగింది. చీపినాపి జడ్పీ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న నారాయణరావు బుధవారం ఇంటికొచ్చి ఫోన్‌లో విద్యుత్తు బిల్లుకు సంబంధించిన మేసేజ్ చూసుకున్నారు. ఇంతలో సైబర్ నేరగాళ్లు కాల్ చేసి బిల్లు కట్టలేదని యాప్‌ను అప్‌డేట్ చేయాలని సూచించారు. వాళ్లు చెప్పినట్లు చేయడంతో ఖాతా నుంచి రూ.63 వేలు నగదు దొచుకున్నారు.