Nellore

News August 12, 2024

నెల్లూరు: సీఎం చంద్రబాబుతో రూరల్ ఎమ్మెల్యే భేటీ

image

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును వెలగపూడి సచివాలయంలో సోమవారం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి భేటి అయ్యారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలు, అభివృద్ధిపై ఎమ్మెల్యే మాట్లాడినట్లు తెలుస్తోంది. అదేవిధంగా జిల్లాలో తాజా రాజకీయ పరిస్థితులు సీఎం అడిగి తెలుసుకున్నట్లు సమాచారం.

News August 12, 2024

నెల్లూరు: రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతి

image

నెల్లూరుకు చెందిన విద్యార్థి విష్ణు రోడ్డు ప్రమాదంలో చనిపోయిన ఘటన ఆదివారం తమిళనాడులో జరిగింది. విష్ణు చెన్నైలోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో మూడో సంవత్సరం చదువుతున్నాడు. ఆయన తమ స్నేహితులతో తిరువణ్ణామలై అరుణాచలేశ్వర ఆలయానికి కారులో వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో వారు ప్రయాణిస్తున్నకారును తిరువళ్లూరు జిల్లాలో లారీ ఢీకొంది. ఘటనలో విష్ణుతోపాటు మరో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు.

News August 12, 2024

నెల్లూరు: ఆందోళనకరంగా CBSE విధానం

image

జిల్లాలో సీబీఎస్ఈ విధానం ఆందోళనకు గురి చేస్తున్నట్లు పలువురు వాపోతున్నారు. జిల్లా వ్యాప్తంగా 40 పాఠశాలలో ఈ విధానం అమలులో ఉంది. అందుకు తగ్గ సిబ్బందిని నియమించడంలో మాత్రం విఫలమయ్యారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు ఉపాధ్యాయులు తెలుగులో చదివి డీఎస్సీ ఉత్తీర్ణత సాధించారు. ఇదే ఇప్పుడు శాపంగా మారింది. డీఈవో పీవీజే రామారావు స్పందిస్తూ.. దిద్దుబాటు చర్యలకు సిద్ధమవుతున్నట్లు తెలిపారు.

News August 11, 2024

మంత్రిగా ఆనం బాధ్యతల స్వీకరణ

image

వెలగపూడి సచివాలయంలో మంత్రిగా నేడు ఆనం రామనారాయణరెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర వ్యాప్తంగా 160 దేవాలయాల పున:నిర్మాణ ఫైల్‌పై తొలి సంతకం చేశారు. ఈ కార్యక్రమంలో ఆనం కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

News August 11, 2024

నెల్లూరు: ఆ బ్యారేజీలకు మళ్లీ పాత పేర్లే

image

జిల్లాలోని నెల్లూరు, సంగం బ్యారేజీలకు పూర్వపు పేర్లను కొనసాగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. గత ప్రభుత్వంలో నెల్లూరు బ్యారేజీకి నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డి, సంగం బ్యారేజీకి మేకపాటి గౌతమ్ రెడ్డి బ్యారేజీ అని అప్పటి సీఎం జగన్ నామకరణం చేసిన విషయం తెలిసిందే. తాజాగా పాత పేర్లనే కొనసాగించాలని సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు.

News August 11, 2024

దుత్తలూరు: హైవేపై ప్రమాదం.. ఒకరు మృతి

image

దుత్తలూరు మండలం బండ కింద పల్లి జాతీయ రహదారిపై ఓ కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో కారు డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.

News August 11, 2024

శ్రీకాకుళం టీంను ఓడించిన నెల్లూరు జట్టు 

image

నెల్లూరులో నేడు జరిగిన 11వ రాష్ట్ర స్థాయి సీనియర్ సాఫ్ట్ బాల్ క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్‌లో నెల్లూరు జట్టు విజేతగా నిలిచింది. శ్రీకాకుళం టీంతో హోరాహోరీగా జరిగిన ఈ మ్యాచ్‌లో నెల్లూరు ఆటగాళ్లు రాణించారు. సెమీ ఫైనల్లో విజయనగరం టీంను ఢీకొట్టనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. 

News August 11, 2024

ఘోరాలన్నీ ఆగస్టు 15 నుంచి బయటకొస్తాయి: సోమిరెడ్డి

image

చంద్రబాబు నిర్ణయాలతో ఆగస్టు15 నుంచి పాప ప్రక్షాళన జరుగుతుందని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు.ఆయన X వేదికగా..రాష్ట్ర ప్రజలు కూటమి ప్రభుత్వం రావడంతో స్వాతంత్ర్యం వచ్చినంత సంతోషంలో ఉన్నారన్నారు. మదనపల్లె ఫైల్స్‌ను మించిన సర్వేపల్లి కోర్టు చోరీ ఫైల్స్ వంటి ఘోరాలున్నాయని అన్నారు. ఇవన్నీ ‘ప్రజల వద్దకు పాలన’ సదస్సులో వెలుగులోకి రానున్నాయని తెలిపారు. ప్యాలెస్ నుంచి పాలన ప్రజల వద్దకు రాబోతోందన్నారు.

News August 11, 2024

నెల్లూరు: తెగిన చిన్నారి నాలుకకు కుట్లు

image

నెల్లూరు సర్వజన ఆసుపత్రిలో వైద్యులు అరుదైన ఆపరేషన్ చేశారు. కుటుంబీకుల కథనం మేరకు..నాలుగురోజుల క్రితం కుక్కలకు భయపడి పరుగెత్తుతూ చిన్నారి పావని ఇనుప కడ్డీ మీద పడింది. ఆ ఘటనలో బాలిక నాలుక తెగిపోయింది. దీంతో వెంటనే ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా..శరీరం మొత్తం మత్తు ఇవ్వాలన్నారు. అనంతరం అక్కడ నుంచి సర్వజన ఆసుపత్రికి రాగా ఈఎన్‌టీ సుకుమార్ బృందం పాపకు ఆపరేషన్ చేసి నాలుకకు కుట్లు వేసినట్లు తెలిపారు.

News August 11, 2024

నెల్లూరు: భార్యాభర్తలు సూసైడ్

image

నెల్లూరులో విషాద ఘటన చోటుచేసుకుంది. నాలుగేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్న కె.నాగరాజు(23),సురేఖ (19) ఆత్మహత్య చేసుకున్నారు. భర్త మద్యానికి బానిసై కుటుంబాన్ని పట్టించుకోవడం లేదని భార్య శనివారం ఉరివేసుకుని కన్నుమూసింది. సురేఖ మృతదేహాన్ని చూసి భరించలేక నాగరాజు అదేరోజు రైలు కింద పడి మృతిచెందాడు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఘటనలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.