Nellore

News August 11, 2024

జిల్లాలో నీటి పంపిణీ వ్యవస్థను మెరుగుపరచాలి: మంత్రి ఆనం

image

జిల్లాలో నీటి పంపిణీ వ్యవస్థను మెరుగుపర్చి రైతాంగానికి ఇబ్బందులు లేకుండా సాగునీరు అందించేందుకు చర్యలు చేపట్టాలని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి  అధికారులను ఆదేశించారు. శనివారం నగరంలోని జిల్లాపరిషత్‌ కార్యాలయంలో ఇరిగేషన్‌ ప్రాజెక్టుల పురోగతి, సాగునీటి కాలువల స్థితి గతులపై సోమశిల, తెలుగుగంగ, కండలేరు ప్రాజెక్టుల అధికారులతో మంత్రులు మాట్లాడారు. రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. 

News August 10, 2024

నెల్లూరు జిల్లాలో TODAY TOP NEWS

image

➽ వ్యవసాయానికే ప్రభుత్వం పెద్ద పీట: మంత్రి నారాయణ
➽ కోవూరు: బాలికను గర్భవతిని చేసిన కారు డ్రైవర్
➽ ఉదయగిరి: ATM కార్డుతో ఉడాయించి రూ.54వేలు డ్రా
➽ సోమశిలకు రోజురోజుకీ పెరుగుతున్న వరద
➽ దొరవారిసత్రం: లారీ బోల్తా
➽ గూడూరు: బావ చేతిలో బామ్మర్ది హత్య
➽ నాయుడుపేట తహశీల్దార్‌గా గీతా వాణి
➽ ఇందుకూరుపేట ఎంపీడీవో బదిలీ

News August 10, 2024

గూడూరు: బావ చేతిలో బామ్మర్ది హత్య 

image

ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు బనిగిసాహెబ్ పేటలో దారుణం చోటుచేసుకుంది.  కుటుంబ కలహాల నేపథ్యంలో బావ, బామ్మర్ది మధ్య ఏర్పడిన ఘర్షణలో.. బామ్మర్ది జాకీర్‌, ఆయన చెల్లెలిపై బావ అల్లాబక్షు రోకలి బండతో దాడి చేశాడు. ఘర్షణలో తీవ్రంగా గాయపడ్డ క్షతగాత్రులను గూడూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తరలిస్తుండగా జాకీర్ మృతి చెందాడు. ఆయన చెల్లెలి పరిస్థితి విషయంగా ఉంది. 

News August 10, 2024

మంత్రి నారాయణతో వైసీపీ ఎమ్మెల్సీలు కరచలనం

image

నెల్లూరు దర్గామిట్టలో జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి మునిసిపల్ శాఖ మంత్రి నారాయణ హాజరయ్యారు. సమావేశానికి మంత్రులతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. అయితే వైసీపీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి మంత్రి నారాయణ మీద అనేక సార్లు విమర్శలు చేస్తుంటారు. అయినా మంత్రి పట్టించుకోకుండా కరచలనం ఇచ్చి ఆత్మీయంగా పలకరించారు.

News August 10, 2024

జడ్పీ సమావేశానికి క్యూకట్టిన మంత్రులు, ప్రజాప్రతినిధులు

image

నెల్లూరు నగరంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో జెడ్పి సర్వసభ్య సమావేశం శనివారం ప్రారంభమైంది. ఈ సమావేశానికి మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డితో పాటు నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, నెల్లూరు జిల్లాలోని పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, బల్లి కళ్యాణ చక్రవర్తి, జిల్లా కలెక్టర్ ఆనంద్ హాజరయ్యారు.

News August 10, 2024

నెల్లూరు: భిన్న ధ్రువాలు కలిసిన వేళ

image

నెల్లూరు నగరంలోని దర్గామిట్టలో జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి హాజరైన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని శాలువా పుష్పగుచ్ఛం అందించి జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ ఆనం అరుణమ్మ సత్కరించారు. శనివారం జడ్పీ సమావేశానికి మంత్రులతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. చాలాకాలం తర్వాత ఈ సఖ్యత నెల్లూరు నగరంలో చర్చాంశనీయంగా మారింది.

News August 10, 2024

గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్

image

నెల్లూరు నగరంలోని దర్గామిట్ట వద్ద గల గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలను జిల్లా కలెక్టర్ ఆనంద్ శనివారం ఉదయం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వసతి గృహంలో విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలు, భోజన మెనూపై ఆరా తీసారు. వసతి గృహంలో ఉన్న స్టాకును పరిశీలించారు. పదో తరగతి విద్యార్థులతో మమేకమై వారి అభ్యసన సామర్ధ్యాలను పరీక్షించారు.

News August 10, 2024

సంగంలో పాల డైరీ ప్రారంభించిన మంత్రి ఆనం

image

సంగం మండలం, దువ్వూరు సమీపంలో జాతీయ రహదారి పక్కన నూతనంగా నిర్మించిన ఓ పాల డైరీని రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి శనివారం ప్రారంభించారు. రైతులకు ఉపయోగపడే విధంగా ఈ డైరీని నిర్మించడం అభినందనీయమని నిర్వాహకులకు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట స్థానిక టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

News August 10, 2024

సోమశిలకు రోజురోజుకి పెరుగుతున్న వరద

image

సోమశిల జలాశయానికి ఎగువ ప్రాంతాల నుంచి శనివారం ఉదయం 6 గంటలకు 11,290 క్యూసెక్కుల కృష్ణా జలాలు వచ్చి చేరుతున్నట్లు జలాశయ ఈఈ దశరథ రామిరెడ్డి తెలిపారు. జలాశయం పూర్తి సామర్థ్యం 78 టీఎంసీలు కాగా ప్రస్తుతం జలాశయంలో 15.733 టీఎంసీల నీరు నిల్వ ఉంది. 17, 18 స్లూయిస్ ద్వారా పెన్నా డెల్టాకు 200 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. జలాశయంలో 85 క్యూసెక్కుల నీరు ఆవిరి అవుతున్నట్లు తెలిపారు.

News August 10, 2024

కోవూరు : బాలికను గర్భవతిని చేసిన కారు డ్రైవర్

image

బాలికపై అత్యాచారం చేసి గర్భిణిని చేసిన ఘటన కోవూరులో చోటుచేసుకుంది. మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక తొమ్మిదో తరగతి మధ్యలో ఆపేసి ఇంటి దగ్గరే ఉంటోంది. ఆమె సమీప బంధువు కారు డ్రైవర్ K శ్రీనివాసులు పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాలికకు నలతగా ఉండటంతో ఆసుపత్రికి తీసుకెళ్లగా గర్భిణిగా వైద్యులు నిర్ధారించారు. బాలికను నిలదీయగా నిజం చెప్పింది. పోలీసులకు ఫిర్యాదు చేయగా పోక్సోకేసు నమోదు చేశారు.