Nellore

News February 15, 2026

దేశంలో ఎక్కడా లేదు.. శ్రీకాళహస్తిలోనే..!

image

శ్రీకాళహస్తి క్షేత్రంలో అనేక విశేషాలు మనకు కనిపిస్తాయి. ఆలయ ప్రధాన ముఖద్వారం, నందీశ్వరుడు, బలిపీఠంతో పాటు దారు ఏకశిలా ధ్వజస్తంభం ఉంటాయి. ధ్వజస్తంభం పైన చిన్న నంది ఉంటుంది. ఇటువంటి దారు ఏకశిలా ధ్వజస్తంభం భారతదేశంలో మరెక్కడా లేదు.

News February 15, 2026

నెల్లూరు: ​మల్లెపూలు కాదు.. తెల్లని బంగారమే!

image

నెల్లూరు జిల్లా కోట మండలంలో మల్లెపూల దిగుబడి ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతోంది. తోటల నుంచి మొగ్గలు రావడం మొదలవ్వడంతో మార్కెట్‌లో కిలో మల్లెపూల ధర ఏకంగా రూ.1400 పలుకుతోంది. దిగుబడి స్వల్పంగా ఉన్నప్పటికీ, భారీ డిమాండ్ కారణంగా రైతులు వీటిని తిరుపతి, గూడూరు, చెన్నై ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. ఆశించిన స్థాయిలో పంట లేకపోయినా, లభిస్తున్న అధిక ధరతో రైతులు అందినకాడికి విక్రయిస్తూ ఆదాయం పొందుతున్నారు.

News February 15, 2026

నెల్లూరు: లేడీస్.. బీ అలర్ట్!

image

ఉమ్మడి నెల్లూరు జిల్లాలో బంగారం ధర తులం రూ.1.60 లక్షలు దాటడంతో చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. గత 6నెలల్లోనే 60కి పైగా స్నాచింగ్ కేసులు నమోదయ్యాయి. ఒంటరి మహిళలే లక్ష్యంగా నంబర్ ప్లేట్ లేని బైకులపై వచ్చి నగలు, తాలిబొట్లు లాకెళ్తున్నారు. తాజాగా గూడూరులో ఓ టీచర్‌పై బంగారం కోసం దాడి చేయడం కలకలం రేపింది. నగలు ధరించి బయటకు వెళ్లేటప్పుడు మహిళలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని పోలీసులు కోరుతున్నారు.

News February 15, 2026

నెల్లూరు: ప్రిన్సిపల్ సంతకం లేకున్నా.. ఓకే!

image

నెల్లూరు జిల్లాలో ఈనెల 23వ తేదీ నుంచి ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఫీజు బకాయిలు పేరుతో విద్యార్థులను కాలేజీ వాళ్లు ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్ఐవో వరప్రసాద్ రావు హెచ్చరించారు. ప్రభుత్వ వెబ్‌సైట్, వాట్సాప్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకున్న హాల్ టికెట్లపై ప్రిన్సిపల్స్ సంతకం లేకున్నా పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తామని స్పష్టం చేశారు.

News February 15, 2026

శ్రీకాళహస్తిలో బ్రహ్మోత్సవాల పేర్లు తెలుసా…!

image

బ్రహ్మోత్సవాలు అంటే వాహన సేవలు అని తెలుసు. కానీ శ్రీకాళహస్తిలో 9 రోజులు జరిగే వాటిని నవరాత్రి బ్రహ్మోత్సవాలు అని అంటారు. దానికి పేర్లు ఉన్నాయి. 1వరోజు దేవరాత్రి, 2వరోజు భూతరాత్రి, 3వ రోజు గాంధర్వ రాత్రి, 4వరోజు నాగరాత్రి, 5వరోజు శివరాత్రి, 6వరోజు బ్రహ్మ రాత్రి, 7వరోజు స్కంద రాత్రి, 8వరోజు ఆనంద రాత్రి, 9వరోజు ఋషి రాత్రి అంటారు.

News February 15, 2026

నెల్లూరు జిల్లాలో ఉద్యోగాలు

image

నెల్లూరు జిల్లా వైద్యారోగ్య శాఖలో నేషనల్ హెల్త్ మిషన్ విభాగం కింద ఖాళీగా ఉన్న పోస్టులకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు DMHO సుజాత చెప్పారు. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ కింద భర్తీ చేస్తామన్నారు. స్పీచ్ థెరపిస్ట్-1, చైల్డ్ సైకాలజిస్ట్-1, ల్యాబ్ టెక్నీషియన్ -2, డేటా ఎంట్రీ ఆపరేటర్-5, శానిటరీ వర్కర్, కుక్ కమ్ కేర్ టేకర్, ఇతర పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈనెల 18వ తేదీ లోపు DMHO ఆఫీసులో సంప్రదించాలి.

News February 15, 2026

ఇది ప్రజల ఆకాంక్షల బడ్జెట్: ఎంపీ వేమిరెడ్డి

image

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026- 27 బడ్జెట్ అన్ని వర్గాల ఆకాంక్షలను ప్రతిబింబించేలా ఉందని నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు. రాష్ట్ర పునర్నిర్మాణ దిశగా రూ.3.32 లక్షల కోట్లతో అభివృద్ధి, సంక్షేమమే ఎజెండాగా బడ్జెట్ కేటాయింపులు కూటమి ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం అన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రికి, కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.

News February 15, 2026

ఇది ప్రజల ఆకాంక్షల బడ్జెట్: ఎంపీ వేమిరెడ్డి

image

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026- 27 బడ్జెట్ అన్ని వర్గాల ఆకాంక్షలను ప్రతిబింబించేలా ఉందని నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు. రాష్ట్ర పునర్నిర్మాణ దిశగా రూ.3.32 లక్షల కోట్లతో అభివృద్ధి, సంక్షేమమే ఎజెండాగా బడ్జెట్ కేటాయింపులు కూటమి ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం అన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రికి, కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.

News February 14, 2026

నెల్లూరు: వాట్సప్‌కు పరిమితమైన ప్రేమ సందేశాలు

image

ప్రేమికుల దినోత్సవం వస్తుందంటే వారం రోజుల నుంచి గ్రీటింగ్ కార్డులు, రోజా పువ్వులు, కవితలతో కూడిన లేఖలు ఇచ్చి తమ ప్రేమను తెలియపరచాలని ప్రేమికులు ఎదురుచూస్తుండే వారు. అయితే ఇప్పుడు కేవలం వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రేమ సందేశాలు పెట్టుకొని తమ భావాలను వ్యక్త పరుస్తున్నారు. షాపుల్లో కనీసం గ్రీటింగ్ కార్డులు కనబడని పరిస్థితి ఏర్పడింది. 90’S కిడ్స్ మాత్రం తమ రోజులే బాగున్నాయని ఆనంద పడుతున్నారు.

News February 14, 2026

నా ఆస్తులపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించండి: మాజీ మంత్రి అనిల్

image

‘నా ఆస్తులపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించవచ్చు’ అని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు. తనకు ఎక్కడా వ్యాపారాలు, కోట్లు విలువ చేసే బంగ్లాలు కూడా లేవని స్పష్టం చేశారు. రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఎన్ని ఆస్తులు ఉన్నాయో ఇప్పుడు కూడా అవే ఉన్నాయని అన్నారు. కావాలంటే తనపై ఎంక్వయిరీ వేయించండి అని, కోట్లు ఉన్నట్లు తెలితే ఆ డబ్బులు అమరావతికి విరాళం కింద ఇస్తానని తెలిపారు.